Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode అర్జున్ నర్స్‌ని బోనులోకి పిలిచి పార్వతితో పాటు ఇంకెవరికి డెలివరీ చేశారా అని అడిగితే ఆమె లక్ష్మికి కూడా డెలివరీ చేశానని అంటుంది. దాంతో అర్జున్ మిత్ర, లక్ష్మీలను బోనులోకి పిలుస్తాడు. అర్జున్ లక్ష్మీ బాబు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని అడుగుతాడు. దాంతో మున్నార్‌లో లక్కీ పుట్టిన టైంకే పుట్టినట్లు చెప్తుంది. దాంతో మిత్ర లక్ష్మీ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. 


అర్జున్: లక్కీ పాప పుట్టిన సేమ్ ప్లేస్ సేమ్ టైం అంతే కదా.
లక్ష్మీ: అవును.
మనీషా: అయిపోయింది ఆంటీ మొత్తం అయిపోయింది మన ప్లాన్ వేస్ట్ అయిపోయింది. 
అర్జున్: మీరు మున్నార్‌లో ఎక్కడున్నారు.
లక్ష్మీ: భాస్కర్ ఇంట్లో.. లక్ష్మీ అలా చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. కానీ నేను ఉన్నట్లు మా ఆయన మిత్ర గారికి తెలీదు. మిత్ర అన్నీ గుర్తు చేసుకుంటాడు. 
మిత్ర: భాస్కర్ ఇంట్లో ఉన్నది నువ్వా.
లక్ష్మీ: అవునండి. ఆ రోజు పెయిన్స్ వస్తే మీరే నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. మీరు తిడతారనే భయంతో నేను చెప్పలేదు. 
మిత్ర: మరి భాస్కర్ లక్కీ తన ఇంట్లో ఉన్న ఆవిడకు పుట్టాడని చెప్పాడు.
లక్ష్మీ: అది నాకు తెలుదు కానీ ఆ రోజు నాకు పుట్టింది జున్నునే. 


ఆ రోజు హాస్పిటల్‌లో పార్వతిని చూశారా అని అర్జున్ అడిగితే లేదు అని ఇద్దరూ చెప్తారు. దాంతో పార్వతి అక్కడ లేదని అంటాడు. దాన్ని లాయర్ చాణక్య అడ్డుకుంటారు. పార్వతి ఉందని చెప్తారు. దాంతో అర్జున్ నేను నిరూపిస్తానని చెప్తాడు. తర్వాత అర్జున్ పార్వతిని పిలుస్తాడు. డెలివరీ రోజు హాస్పిటల్‌కి వెళ్లే టైంకి క్లైమేట్ ఎలా ఉందని అడుగుతాడు. హాస్పిటల్‌కి ఎలా వెళ్లావని అడుగుతాడు. దాంతో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లానని పార్వతి అంటుంది. వర్షంలో నడుచుకుంటూ వెళ్లారా అని అర్జున్ అడిగితే పార్వతి వర్షం ఏంటి అని అడుగుతుంది. దాంతో ఆ రోజు ఫుల్ వర్షం అని అది చెప్పలేకపోయారని కనీసం అంత పెద్ద వర్షం గుర్తుండాలి కదా అని అంటాడు. ఇక తర్వాత చాణక్యని కొన్ని ప్రశ్నలు అడగాలని అర్జున్ అంటాడు. ఫేమస్‌ లాయర్ అయిన మీరు ఈ కేసు కోసం ఎంత తీసుకున్నారని అడిగితే ఒక్క రూపాయి తీసుకోలేదని మానవత్వంతో కేసు ఒప్పుకున్నానని అంటాడు.


దాంతో అర్జున్ ఫ్లైట్ టికెట్స్, రూమ్‌ ఖర్చులు అన్నీ సరయు పే చేసిందని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ఆ బిల్స్ కూడా చూపిస్తాడు. ఇక అర్జున్ సరయుని పిలుస్తాడు. పార్వతి కేసు కోసం లాయర్‌కి ఎందుకు స్పాన్షర్ చేశారని అడుగుతాడు. పార్వతి మీకు ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతాడు. మిత్ర మీద పోటీతో పార్వతికి సపోర్ట్ చేస్తున్నారు కదా అని అంటాడు. మిత్రని దెబ్బ తీయాలని మిత్రకు ప్రాణమైన లక్కీని  దూరం చేయాలి అనుకున్నారు  కదా అంటే అర్జున్ ప్రశ్నలకు సరయు కళ్లు తిరిగి పడిపోతుంది. కథ అంతా అడ్డం తిరిగిందని మనీషా, దేవయాని తల పట్టుకుంటారు. మిత్ర రావడంతో మిత్ర దగ్గర లక్ష్మీ గురించి చాలా చెప్పమని అంటుంది. దాంతో లక్ష్మీ గురించి మనీషా తప్పుగా చేప్తే మిత్ర మాత్రం తప్పుగా అర్థం చేసుకోడు. ఇక జయదేవ్ లక్ష్మీని మున్నార్‌లో ఉండి కూడా మాకు ఎదురు పడలేదు ఎందుకు అని అడుగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఉండిపోవా నువ్విలా రెండు కళ్లలో ఇలా.. బావతో ఏకాంతంలో జ్యో.. దీప, కార్తీక్‌ల ఫస్ట్‌నైట్!