Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను, వివేక్‌లు మిత్ర గురించి టెన్షన్ పడుతుంటే వివేక్ చెల్లి సంజన ఇంటికి వస్తుంది. జయదేవ్ కూడా రావడంతో పెద్దనాన్న అని పలకరిస్తుంది. మిత్ర అన్నయ్య గురించి అడుగుతుంది. ఇక దేవయాని కూతుర్ని చూసి సంతోషపడుతుంది. అన్నయ్యలకు రాఖీ కట్టడానికి వచ్చానని సందడి చేస్తుంది. మరోవైపు లక్కీ డోర్ వేసుకొని గదిలో నుంచి రాదు. అరవింద పిలిస్తే నాన్న వచ్చే వరకు బయటకు రాను అని మొండికేస్తుంది. మరోవైపు సంయుక్తలా ఉన్న లక్ష్మీ మిత్ర గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది. దేవుడికి దండం పెట్టుకుంటుంది.
అరవింద: లక్కీ నాన్న ఎప్పుడొస్తాడని అడుగుతుంది సంయుక్త దానికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అసలు మిత్ర ఎప్పుడు వస్తాడో నాకు అర్థం కావడం లేదు.
సంయుక్త: కంగారు పడొద్దు అంటీ మిత్ర గారు వచ్చేస్తారు.
అరవింద: నీకు ఒక విషయం తెలీడం లేదు సంయుక్త మిత్రకు వచ్చే గండాలు అన్నీ మామూలువి కాదు. ప్రాణాలు తీసేవిలా ఉంటాయి. ఏ నిమిషం అయినా మృత్యువు కబళించేలా ఉంటాయి. దీక్షితులు గారు మరీ మరీ హెచ్చరించారు. నాకు ఏం అవుతుందా అని కంగారుగా ఉంది.
సంజన సంయుక్తని చూసి వదిన అని వెళ్లి హగ్ చేసుకుంటుంది. నువ్వు బతికే ఉన్నావా వదినా అంటూ సంతోషపడుతుంది. వదిన బతికే ఉందని నాకు ఎందుకు ఎవరూ చెప్పలేదని అందర్ని ప్రశ్నిస్తుంది. అందరూ సైలెంట్ అయిపోతారు. దేవయాని తను మీ వదిన కాదు అని చెప్తుంది. సంజన షాక్ అయిపోతుంది. తాను సంయుక్త అని తన గురించి చెప్తుంది. సంజన సంయుక్తకి సారీ చెప్తుంది. ఇక రాఖీ కట్టాలని మిత్ర గురించి అడుగుతుంది.
అరవింద: మిత్ర లేడు సంజన. ఎక్కడికి వెళ్లాడో ఎప్పుడు వస్తాడో తెలీదు. అసలు వీళ్లంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు. వివేక్ చెప్పరా మిత్ర ఏడి. చెప్పు వివేక్. అరవింద అందర్ని పేరు పేరున మిత్ర గురించి అడుగుతుంది. ఏడుస్తుంది. అబద్దాలు చెప్పొద్దని అరుస్తుంది. అందర్ని ప్రాధేయపడుతుంది. నిజం చెప్పమని ఏడుస్తుంది.
జయదేవ్: అరవింద మిత్రని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ మాట వినగానే అరవింద కళ్లు తిరిగి పడిపోతుంది.
అరవింద: మిత్రను కిడ్నాప్ చేయడం ఏంటండి. నా కొడుకు మీద ఎందుకు పగ పట్టారు. ఏవండీ నాకు చాలా భయంగా ఉందండి. వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడని కంగారుగా ఉందండి. దయచేసి నా కొడుకుని కాపాడండి.
సంయుక్త: ఆంటీ మీరు కంగారు పడొద్దు మిత్ర గారికి ఏం కాదు.
అరవింద ఏడిస్తే సంయుక్త ఓదార్చుతుంది. ఇక అర్జున్ జున్ను మిత్ర ఇంటికి వస్తారు. లక్కీకి మిత్ర కనిపించడం లేదనే విషయం చెప్పొద్దని అర్జున్ జున్నుతో అంటాడు. జున్ను సరే అంటాడు. ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. జున్ను జయదేవ్ దగ్గరకు వెళ్లి లక్కీ రాఖీ కడతానని చెప్పిందని ఏదని అడిగితే గదిలో ఉందని చెప్తే తాను బయటకు తెస్తానని జున్ను వెళ్తాడు. ఇక అర్జున్ అరవింద దగ్గరకు వెళ్లి తప్పని పరిస్థితుల్లో మిత్రలా మాట్లాడానని సారీ చెప్తాడు. అరవింద ఏం పర్లేదు అంటూనే మిత్ర గురించి చెప్తూ ఏడుస్తుంది. అర్జున్ అరవిందకు ధైర్యం చెప్తాడు. జున్ను లక్కీని బయటకు రమ్మని పిలిస్తే లక్కీ రాను అని చెప్తుంది. తన కోసం బయటకు రావా నాకు నువ్వు ఇచ్చే విలువ ఇదేనా అని అంటాడు. ఇక జున్ను మిత్ర అంకుల్ చాలా క్షేమంగా ఉన్నాడని ఆఫీస్‌కి వెళ్లి మాట్లాడానని జున్ను అంటాడు. రాఖీ కడతానని చెప్పావని వచ్చానని రాఖీ కట్టను అంటే వెళ్లి పోతానని జున్ను అంటే లక్కీ బయటకు వస్తుంది. ఇక సంజనతో అత్త అనుకుంటూ లక్కీ తన బాధ చెప్తుంది. ఇక సంయుక్త డాడీ వచ్చేస్తారని రాఖీ కట్టించుకోవడానికి డాడీ రమ్మని పిలిస్తే అత్త వచ్చిందని చెప్తే లక్కీ హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: వాంతులు చేసుకున్న సత్య ఇది అదేనా.. మైత్రితో క్లోజ్‌గా హర్ష, ఫీలవుతున్న నందిని!