Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ డాక్టర్‌ని పిలిపించి మనీషా ప్రెగ్నెంట్ కాదు అసలు మిత్ర, మనీషాలు కలవనే లేదని డాక్టర్ తేల్చేస్తుంది. మనీషా మిమల్ని చీట్ చేసిందని మిత్రని సొంతం చేసుకోవడానికి జరగని తప్పు జరిగింది అని చెప్పి రాని కడుపు వచ్చిందని నాటకం ఆడిందని జాను అరవిందతో చెప్తుంది. మిత్ర కోపంతో రగిలిపోతాడు. అరవింద మాత్రం లక్ష్మీ బిడ్డ మీద ఆశలు పెట్టుకోవడం వల్ల మనీషా కడుపుతో లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంటుంది.
మిత్ర తప్పు చేయలేదని సంతోష పడాలా.. మిత్ర గండాల నుంచి కాపాడే బిడ్డ మనీషా కడుపులో లేదని బాధ పడాలా అర్థం కావడం లేదని అరవింద బాధ పడుతుంది. దేవయాని మనసులో మనీషా ఎలా కవర్ చేస్తుందో దాన్ని చూశాక వీళ్ల లెక్క మారుతుందో లేక అదే జనాభా లెక్కల్లో లేకుండా పోతుందో అని అనుకుంటుంది. మిత్ర లక్ష్మీ దగ్గరకు వెళ్లి లక్ష్మీని వాటేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. నన్ను గిల్ట్ నుంచి బయట పడేశావ్ ఇన్ని రోజులు పడిన బాధని బయట పడేశావు థ్యాంక్యూ సో మచ్ అంటాడు. మనకి ఇది నిజంగా కొత్త సంవత్సరమే అని అంటాడు. నేను దూరంగా ఉన్నప్పుడే మీరు తప్పు చేయలేదు దగ్గర ఉన్నప్పుడు తప్పు చేస్తారంటే నేను ఎలా నమ్ముతానని లక్ష్మీ అంటుంది.
మిత్ర: మనీషా ఎందుకు అలా చేసిందో అర్థం కావడం లేదు ఎందుకు నన్ను మోసం చేసింది లక్ష్మీ.లక్ష్మీ: ఎందుకు తను కళ్లు తెరిచిన తర్వాత తనే చెప్తుంది. మనీషా: నిద్ర లేచి మొత్తం గుర్తు చేసుకుంటుంది. లక్ష్మీ అన్నంత పని చేసిందా నేను నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏంటో అని కిందకి వెళ్తుంది. వివేక్: పెద్దమ్మ మనీషా వస్తుంది. జయదేవ్: రా మనీషా నువ్వు చేసిన మోసం ద్రోహం మొత్తం బయట పడింది.మనీషా: అత్తయ్య అసలేం జరిగింది అంటే అనగానే అరవింద కొడుతుంది. అరవింద: ఇది నువ్వు నా కొడుకుని మోసం చేసినందుకు. ఇది వాడి మీద అభాండం వేసినందుకు. ఇది నాకు అబద్ధం చెప్పినందుకు. మచ్చలేదని మిత్ర మీద నింద వేశావ్. రాని కడుపు ఉందని అబద్ధం చెప్పావ్ నిన్ను.మనీషా: ఆగిపోయారేంటి అంటీ నన్ను కొట్టండి నన్ను నేను మోసం చేసుకున్నందుకు కొట్టండి.జయదేవ్: చేసింది చాలా ఇక ఆపు మనీషా ఇంకో నాటకం మొదలు పెట్టావా.మనీషా: నాటకం ఏంటి అంకుల్.మిత్ర: నాటకం కాక ఇంకేంటి మనీషా. ఎందుకు ఇలా చేశావ్. మన స్నేహాన్ని ఇలా వాడుకున్నావా. నేను నిన్ను ఎంతగానో నమ్మాను మనీషా కానీ ఇంత దారుణంగా మోసం చేస్తావనుకోలేదు.మనీషా: నేను ఎవరిని మోసం చేయలేదు మిత్ర నాకు నేనే మోసం చేసుకున్నా రీ యూనియన్‌లో మన మధ్య అలా జరిగాక నాలో ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించాయి. రిపోర్ట్స్ కూడా అది కన్ఫమ్ చేశాయి కదా. దేవయాని: ఏం జరిగింది అని మా మధ్య అది జరిగాక అని దీర్ఘాలు తీస్తున్నావ్ అసలు మీ మధ్య ఏం జరగలేదని డాక్టర్ చెప్పింది. మనీషా: మనసులో దేవుడా డాక్టర్ అది కూడా చెప్పేసిందా ఇప్పుడెలా..అరవింద: మీ మధ్య ఏం జరగనప్పుడు లక్షణాలు ఎలా వస్తాయి. నువ్వు భ్రమలో ఉన్నావా మమల్ని ఉంచుతున్నావా.
జాను, వివేక్ అందరూ మనీషాకి శిక్ష పడాలి అంటారు. మత్తులో ఉన్నానని నువ్వు మత్తులో ఉన్నావని మనీషా కవర్ చేస్తుంది. లక్ష్మీ మనీషాతో నీ ఆటలు అన్నీ అయిపోయావి ఇక నువ్వు బ్యాగ్ తీసుకొని వెళ్లిపో అని అంటుంది. దానికి మనీషా ఇది నీ మాట ఇంటి పెద్ద అరవింద ఆంటీ మాట అని అడుగుతుంది. దానికి మిత్ర నా మాట నువ్వు ఇప్పుడే వెళ్లిపో మనీషా అని అంటాడు. దానికి మనీషా ఎలా వెళ్తాను మిత్ర మన మధ్య తప్పు జరగకపోవచ్చు నా కడుపులో బిడ్డ లేకపోవచ్చు కానీ నా మెడలో నువ్వు కట్టిన ఈ తాళి ఉంది కదా అని అంటుంది. ఆ తాళి కూడా అబద్దం అని లక్ష్మీ అంటుంది. కాదు అని అందుకు అంకులే సాక్ష్యం అని మిత్ర నా మెడలో తాళి కట్టడం అంకుల్ చూశారని మనీషా అంటుంది. నేను బయటకు వెళ్తే మన ముగ్గురి జీవితాలు బయట పడతాయని అంటుంది. అరవిందతో నేను వెళ్లిపోతే మీ సమస్య పోతుందా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అని అడుగుతుంది.
మిత్ర లక్ష్మీతో మీ అందరూ కలిసి నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడుగుతాడు. మిత్ర వెళ్లిపోతే అన్ని సమస్యలు పోతాయని లక్ష్మీ అంటుంది. దానికి మనీషా నేను సమస్య కాదు పరిష్కారం ఆ విషయం ఆంటీకి బాగా తెలుసు. జయదేవ్ వాళ్లు మనీషాని క్షమించొద్దని పంపేయమని అంటారు. కానీ అరవింద మాత్రం ఈ సమస్య తీరే వరకు నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు మనీషా ఈ ఇంట్లోనే ఉండు అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీ ఆపాలని చూస్తే లక్ష్మీ నాకు ఏది ముఖ్యమో నీకు తెలుసుకదా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!