Chinni Serial Today Episode మధు ఆఫ్‌టికెట్‌తో మ్యాడీ మా అమ్మే వాళ్ల అమ్మని చంపేసిందని పూర్తిగా నమ్ముతున్నాడని.. దాంతో చిన్నప్పటి నుంచి నా మీద పెంచుకున్న ప్రేమ దూరం చేస్తున్నాడు అని చిన్నిని చూడటమే ఇష్టం లేదని చెప్తున్నాడని.. వాళ్లమ్మని చంపాల్సిన అవసరం మా అమ్మకి ఏంటి.. వాళ్లమ్మని చంపేసి ఆ నింద మా అమ్మ మీద వేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అంటుంది. 

Continues below advertisement

ఆఫ్ టికెట్ ఆ దుర్మార్గుడు ఎవరో నాకు తెలుసు అంటాడు. మధు ఎవరు అనడంతో ఎవరో నాకు తెలీదమ్మా ఎవరో దగ్గర వాళ్లు అయింటారు అని అనేస్తాడు. ఆఫ్‌ టికెట్‌ చిన్నితో మీ నాన్న ఎక్కడున్నారో తెలిస్తేనే మహి వాళ్ల అమ్మని ఎవరు చంపారో తెలుస్తుంది అని అంటాడు. నాన్న ఎక్కడున్నారో తెలుసుకోవాలని.. అమ్మనిర్దోషి అని తెలియాలి అంటే వాళ్ల అమ్మని ఎవరు చంపారో తెలుసుకోవాలి అనుకుంటుంది. చందుకి తెలిసుంటుందేమో అని ఆలోచిస్తుంది.

మధు వాళ్ల ఇంటికి మ్యాడీ ఇంటికి వస్తాడు. మ్యాడీకి చూసి ఏదో జరిగింది అని మధు వాళ్ల తల్లిదండ్రులు ఏం జరిగింది అని అడుగుతారు. దానికి మ్యాడీ నేను ప్రాణంగా ప్రేమించిన చిన్ని వాళ్ల అమ్మ మా అమ్మని చంపేసింది.. అది తెలిసినప్పటి నుంచి నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నా అందుకే ఇక్కడికి వచ్చా అని అంటాడు. మధుతో మాట్లాడితే రిలీఫ్ ఉంటుందని అంటాడు. స్వరూప మాట్లాడుకోమని భోజనానికి ఏర్పాటు చేస్తా అని అంటాడు. చిన్ని వాళ్ల అమ్మ చేసిన ద్రోహాన్ని చిన్ని చేసిన మోసాన్ని అంత తేలికగా మర్చిపోను అని అంటాడు. చిన్ని నీకు మోసం చేయడం ఏంటి అని స్వరూప అంటే వాళ్ల అమ్మా మాఅమ్మని చంపింది అన్న నిజం దాచేసినాకు మోసం చేసింది అని అంటాడు.

Continues below advertisement

స్వరూప, సుబ్బులు మ్యాడీతో నువ్వు నిజం అన్ని నమ్మిన ఈ విషయం చిన్ని నమ్మకపోయి ఉంటుంది కదా.. అందుకే నీకు చెప్పలేదు అంటారు. నువ్వు నమ్ముతున్న ఈ విషయం నిజం కాకపోయి ఉంటుందని సర్ది చెప్పాలని ప్రయత్నిస్తారు. ఇక అక్కడే కావేరి ఫొటో ఉంటుంది. మ్యాడీ ఎక్కడ చూసేస్తాడా అని మధు చాలా కంగారు పడుతుంది. వంట సంగతి చూడమ్మా అని మధు ఇన్‌డైరెక్ట్‌గా స్వరూపకి ఫొటో చూపిస్తుంది. స్వరూప సుబ్బుతో ఫోన్ చార్జింగ్ పెట్టమని చెప్పి ఫొటో చూపిస్తుంది. దాంతో సుబ్బు ఆ గది డోర్ వేసేస్తాడు. 

మధు, మ్యాడీ మాట్లాడుకుంటారు. నిన్న విశ్వరూపం చూపించావు కదా,, ఇంకోసారి ఇలా ముక్కు మీద కోపాన్ని చూపించకు అని అంటుంది. మ్యాడీ ముక్కు పట్టుకొని లాగేస్తుంది. మ్యాడీ మధు వెంట పరుగులు తీస్తాడు. స్వరూప వాళ్లు చూసి సంతోషపడతారు. ఆర్టిస్ట్ కోసం వరుణ్ ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆర్టిస్ట్ వస్తాడు. చిన్నప్పటి చిన్ని ఫొటో చూపించి వేయమని అంటాడు. ఇంట్లో ఆర్టిస్ట్ చిన్ని ఫొటో గీస్తుండటం లోహిత చూస్తుంది. మ్యాడీ కూడా వస్తాడు. మ్యాడీకి విషయం తెలీకూడదు అని లోహిత అనుకుంటుంది. ఆ బొమ్మ మ్యాడీ చేయకూడదు అని శ్రేయకి చెప్తుంది. వెంటనే నాగవల్లి దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. చిన్ని బొమ్మగీస్తే మధునే చిన్ని అని తెలిసిపోతుందని చెప్తుంది. నాగవల్లి కోపంగా వచ్చి బొమ్మ మీద టీ పోసేస్తుంది. ఇంకెప్పుడు చిన్ని ప్రస్తావన రాకూడదు అని మ్యాడీతో చెప్తుంది. ఆర్టిస్ట్‌ని కూడా ఇంకెప్పుడు రావొద్దు అని చెప్తుంది. నీ మనసు పాడైతే ఇంట్లో అందరి మనసు పాడవుతుంది. ఇంకెప్పుడు చిన్నిని కలవాలి అన్న ఆలోచన వద్దు.. చిన్నిని కలవను అని నాకు మాటివ్వు అని అంటుంది. మ్యాడీ మాటిస్తాడు.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.