Chinni Serial Today Episode నాగవల్లి దగ్గరకు దేవా వచ్చి మ్యాడీ వచ్చాడా అని అడిగితే ఇంకా లేదు చిన్ని కోసం వెతుకుతూ ఉన్నాడు.. అయినా ఇంకెన్ని రోజుల్లే బావ గడువు దగ్గర పడింది కదా అని నాగవల్లి అంటుంది. దానికి దేవా అలా అని మనం రిలాక్స్ అయిపోకూడదు.. ఈ ప్రేమ అనేది ఎవరినైనా కలుపుతుంది. నా ముందు నోరు మెదపలేని వరుణ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. అది వాడి గొప్పతనం కాదు ప్రేమ గొప్పతనం.. చిన్నిని మ్యాడీ ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు తెలుసు కాబట్టి వాడి ప్రేమే వాళ్లని కలుపుతుందని నాకు భయంగా ఉంది అని దేవా అంటాడు.
మ్యాడీ ఎవరు కలుస్తున్నాడు.. ఏం చేస్తున్నాడు అన్నీ మనకు తెలియాలి.. మ్యాడీకి తెలియకుండా మన వాళ్లని ఫాలో అవ్వమని చెప్పు.. అని అంటాడు. అంతా నేను చూసుకుంటా అని నాగవల్లి అంటుంది. మ్యాడీ ఎక్కడున్నాడో తెలుసుకుంటానని మ్యాడీకి కాల్ చేస్తే ఫోన్ కలవదు.. తర్వాత పీఏకి కాల్ చేసి మ్యాడీ ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడేం జరుగుతుందో నాకు చెప్పు అని అంటుంది.
మ్యాడీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే కళ్లు లేని ఓ పాప దగ్గరకు వెళ్తాడు. గతంలో సీతాకోక చిలుక బొమ్మని గుర్తు చేసి తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ పాప మ్యాడీ చేయి తరిమి గుర్తు పడుతుంది. మధు కూడా అక్కడికి వస్తుంది. పాప మ్యాడీతో మీ ఫ్రెండ్ చిన్ని కనిపించిందా అని అడుగుతుంది. లేదు అని మ్యాడీ ఏడుస్తాడు. పాప మ్యాడీని తరిమి ఏడుస్తున్నావ్ ఎందుకు అన్న త్వరలోనే చిన్ని నీకు కనిపిస్తుందని చెప్తుంది. ఇక మ్యాడీ మధుని చూస్తాడు.
మధు కూడా ఆ పాపకి షేక్‌హ్యాండ్ ఇస్తుంది. పాప మధుని పట్టుకొని నిన్ను తాకుతుంటే ఎక్కడో కలిసినట్లు ఉందని అంటుంది. లేదు అని మధు అనేస్తుంది. మ్యాడీ పక్కకి వెళ్లి చాలా బాధ పడతాడు. మధు చూసి చిన్ని కనిపిస్తుందా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నాడు ఎలా అయినా ఆ బాధ పొగొట్టాలి అని అనుకుంటుంది. చిన్ని ఇప్పటికిప్పుడు ఎదురైతే ఏం చేస్తావ్ అని మధు అడుగుతుంది. నేనే నీ చిన్నీని.. ఇన్నాళ్లు నీకు కనిపించకుండా ఉన్న చిన్నిని నేనే అంటుంది. ఏంటి నువ్వే నా చిన్నినా అని మ్యాడీ ఎమోషనల్ అయితే అనుకో అలా అనుకొని చిన్నికి ఏం చెప్తావో నాకు అలా చెప్పు అంటుంది.
మ్యాడీ బాధగా ముందుకి వెళ్లి తర్వాత వెనక్కి తిరిగి చూసి దూరం నుంచి పరుగున చిన్ని చిన్నీ అనుకుంటూ వచ్చి ఏంటి.. చిన్ని అలా చూస్తున్నావ్.. గుర్తు పట్టలేదా.. నేను నీ మహి అని అంటాడు. మహి అంటే అని మధు అంటే అదే చిన్నప్పుడు నువ్వు, నేను, లోహి, చందు మర్చిపోయావా అని అంటాడు. లేదు మహి మర్చిపోలేదు అని చిన్ని అంటుంది. చిన్ని, మ్యాడీల మాటలు దూరం నుంచి మధు ఫ్రెండ్ మొత్తం వీడియో తీస్తుంది.
మ్యాడీ చిన్నితో ఏంటి చిన్ని నువ్వు చిన్నప్పుడు నాకు చెప్పకుండా ఎలా వెళ్లిపోయావ్.. నాకు ఎంత టెన్షన్‌గా ఉందో తెలుసా.. అని అంటాడు. టెన్షన్ ఎందుకు అని మధు అంటే ప్రేమ అని అంటాడు. చిన్నతనంలో ప్రేమనా అని అంటే ప్రేమో ఏమో తెలీదు కానీ నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యావ్.. నా ప్రాణాలు కాపాడి నువ్వు నా ప్రాణం అయ్యావ్.. తర్వాత అనుకోని విధంగా విడిపోయాం.. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ గురించి ఆలోచించని రోజు లేదు క్షణం లేదు.. అప్పుడు అర్థమైంది నాకు నీకు నాకు మధ్య స్నేహబంధమే కాదు ప్రేమ బంధం కూడా ఉందని అప్పటి వరకు నా లైఫ్‌లో మా అమ్మనాన్నల స్థానం తర్వాత నీది అనుకున్న కానీ నీ తర్వాతే వాళ్లని అర్థమైందని నీ కోసం వెతుకుతున్నా నీ కోసం కలలు కంటున్నా.. అని చెప్తాడు.
మ్యాడీ విషయం చెప్పగానే మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత మ్యాడీతో నువ్వు ప్రేమ అనగానే నేను నిన్ను ప్రేమించాలా.. నేను ఎవరినైనా ప్రేమించుంటే పైగా మీ లాంటి డబ్బున్న వాళ్లు ప్రేమ అంటే నమ్మొచ్చా అని అడుగుతుంది. నా ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి వచ్చి చెప్తే నమ్ముతావా అని అంటాడు. నేను ఇప్పటికే చనిపోయి ఉంటే నన్ను మర్చిపోయేవాడివి కదా మీ అమ్మానాన్నలు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా.. ఏం చేసేవాడివి అని అడుతుంది. ఏం చేయాలి అన్నా నేను బతికుండాలి కదా.. నువ్వే లేని మహి ఎలా బతికుంటాడు చిన్ని అని మ్యాడీ ఎమోషనల్ అయిపోతాడు.
మధు చాలా చాలా సంతోషంగా వెనక్కి తిరిగి ఉన్న మహిని హగ్ చేసుకొని ఐలవ్‌యూ మహి ఐలవ్‌యూ అని చెప్తుంది. మ్యాడీ కూడా ఒక్క నిమిషం చిన్నినే అనుకుంటాడు. తర్వాత మధు లేచి చిన్ని ఇలాగే రియాక్ట్ అవుతుంది మ్యాడీ అని చెప్తుంది. చిన్ని చాలా అదృష్టవంతురాలు అని అంటుంది. తొందర్లోనే చిన్నిని నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది అని చిన్ని ప్రామిస్ చేస్తుంది. ఇక మ్యాడీకి దేవా కాల్ చేయడంతో వెళ్లిపోతాడు. మధు స్వప్నని చూసి ఎప్పుడొచ్చావే అని అంటే నీకు మ్యాడీ లవ్ ప్రపోజ్ చేసినప్పుడు వచ్చా అని అంటుంది. లోహిత మా మాటలు వినేస్తుంది. త్వరలోనే నేను చిన్ని అన్న విషయం చెప్పేస్తా అని మధు అంటే ఇప్పుడే చెప్పు అనిస్వప్న అంటే రేపు చెప్తా అని మధు అంటుంది. లోహిత షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.