Chinni Serial Today Episode బూత వైద్యుడు చిన్నిలో దెయ్యాన్ని పొగొట్టడానికి హాల్‌లో పెద్ద ముగ్గు వేస్తాడు. ఆ ముగ్గులో చిన్నిని కూర్చొపెట్టమని చెప్తాడు. మ్యాడీ చిన్నిని తీసుకొచ్చి అక్కడ కూర్చొపెడతాడు. బూత వైద్యుడు మంత్రాలు చెప్తూ పొగరు బోతు దెయ్యం, వగలమారి దెయ్యం రావే అని పిలుస్తాడు. చిన్ని చాలా భయపడుతుంటుంది. ఇంతలో లోహిత మీదకు ఆత్మ వచ్చి వచ్చాను అని అరుస్తుంది.
బూత వైద్యుడు మంత్రాలు చెప్పి లోహితను పట్టుకోవాలని చూస్తే ఆత్మ లోహితను పరుగులు పెట్టిస్తుంది. దాంతో బూత వైద్యుడు లోహితను మంత్ర దండంతో కొడతాడు. దాంతో లోహిత కింద పడిపోతుంది. లోహితకు దెయ్యం వదిలిన తర్వాత మంట మంట అని లోహిత అరుస్తుంది. తర్వాత దెయ్యం శ్రేయ మీదకు వస్తుంది. తర్వాత బూత వైద్యుడు శ్రేయని కొడతాడు. శ్రేయ లేచి మంట మంట అని అరుస్తుంది. తర్వాత ఆత్మ చిన్నిలోకి వస్తుంది. చిన్ని పెద్ద పెద్దగా నువ్వుతుంది. అందరూ చూసి భయపడతారు. రేయ్ నన్నేం చేయలేవురా.. నీలాంటి వాళ్లు వంద మంది వచ్చినా ఏం చేయలేరురా అని చిన్ని నవ్వుతుంది. బూత వైద్యుడు చిన్నిలో ఉన్న దెయ్యాన్ని సీసాలో పట్టి మూత పెడతాడు. అందరూ అది చూసి చాలా భయపడతాడు. మీ ఇంటికి పట్టిన దెయ్యం వదిలిపోయింది అని చెప్పడంతో అందరూ సంతోషపడతారు.
చిన్నిని మీదకు తీసుకెళ్లమని చెప్పడంతో మ్యాడీ తీసుకెళ్తాడు. దెయ్యాన్ని మీ స్థానంలోనే పూడ్చాలి అని బూత వైద్యుడు అంటే ఆ పని మీరే చేయండి అని నాగవల్లి అంటుంది. ఇక చిన్ని మ్యాడీతో మ్యాడీ కళ్లు మూత పడుతున్నాయి.. ఒళ్లంతా భారంగా ఉంది.. నేను బతికే ఉన్నానా మ్యాడీ అని అడుగుతుంది. చిన్ని అలా అడగడంలో మ్యాడీ చాలా ఫీలై చిన్నిని గుండెలకు హత్తుకుంటాడు. నువ్వు ఇక్కడే నా దగ్గరే ఉన్నావ్ నీకు ఏం కాలేదు చిన్ని నీకు ఏం కాదు కూడా.. నీకు ఏం కానివ్వను అని మ్యాడీ అంటాడు. చిన్నికి పడుకోపెడతాడు. మ్యాడీ మా అమ్మ తప్పు చేయలేదు.. మా అమ్మ మీ అమ్మని చంపలేదు.. అమ్మ తప్పు చేయదు.. చేస్తే అది తప్పు కాదు.. మా అమ్మ నిర్దోషి.. ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవించి అని నిద్రలో కలవరిస్తుంది. మ్యాడీ చిన్నితో తెలుసుకుంటా చిన్ని మీ అమ్మ నిజంగా నిర్దోషి అయితే అసలు దోషి ఎవరో తెలుసుకుంటా అని అంటాడు.
నాగవల్లి దేవా దగ్గరకు వెళ్లి దెయ్యం పని అయిపోయింది అని చెప్పి చెట్టుకి వేలాడ దీసిన గాజు సీసాలోని ఆత్మని చూపిస్తుంది. దేవా చాలా సంతోషపడతాడు. ఇంటికి పట్టిన దెయ్యం వదిలిందన్నమాట అని దేవా చాలా హ్యాపీ అయిపోతాడు. వీలైనంత త్వరగా చిన్ని చాప్టర్ క్లోజ్ చేయాలని అంటాడు. ఉదయం చిన్ని స్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటే మ్యాడీ చూస్తూ ఉంటాడు. ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు అని అడిగితే నిన్నటి వరకు భయపడిన చిన్నిని చూశా ఇప్పుడు రిలాక్స్ అయిపోయావ్ అని అంటాడు. ఇంతలో ఎస్‌ఐ కాల్ చేస్తాడు. నీకు ఎస్‌ఐ కాల్ చేయడం ఏంటి అని చిన్ని అడిగితే మా మమ్మీ కేసు రీ ఓపెన్ చేయిస్తున్నా అని మ్యాడీ అంటాడు.
ఎస్‌ఐతో మాట్లాడి కేసు రీ ఓపెన్ చేయమని అంటాడు. చిన్ని మ్యాడీని హగ్ చేసుకొని థ్యాంక్స్ మ్యాడీ.. నిన్నటి వరకు నేను మాత్రమే మా అమ్మ నిర్దోషి అని నిరూపించాలని ప్రయత్నించాను ఇప్పుడు నువ్వు కూడా సాయం చేస్తున్నావ్ అంటుంది. నిజంగా మీ అమ్మ నిర్దోషి అయితే నేను సాయం చేయాలి కదా చిన్ని అని మ్యాడీ అంటాడు. పోలీస్ దేవాకి కాల్ చేసి విషయం చెప్తాడు. కేసు రీ ఓపెన్ చేస్తున్నామని చెప్పు.. ఎప్పుడెప్పుడు ఏం చేయాలో ఏం చెప్పాలో నేను చెప్తా అని దేవా అంటాడు.
నాగవల్లి దేవా దగ్గరకు వచ్చి ఏంటి బావ కేసు రీ ఓపెన్ చేయిస్తున్నారా.. మనకే మంచిది కదా.. కావేరినే అక్కని చంపిందని మరోసారి రుజువు అవుతుంది అని అంటుంది. దేవా మనసులో అప్పుడు బయట పడేది నేను అని అనుకుంటాడు. ఇంతలో చిన్ని మ్యాడీ దేవా దగ్గరకు వస్తారు. మమ్మీ కేసు రీ ఓపెన్ చేయిస్తున్నా డాడీ అని మ్యాడీ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
