Chinni Serial Today Episode: చిన్ని మ్యాడీ ఆఫీసులో చేరిందని  లోహి ద్వారా తెలుసుకున్న నాగవల్లి మ్యాడీ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఆరా తీయడం మొదలు పెడుతుంది. ఆఫీసులో అంతా కంఫర్ట్‌గానే ఉందా అని అడుగుతుంది. ఇవాళ కూడా కొత్త ఢీల్‌ ఓకే చేశావని తెలిసిందని అంటుంది. అయితే మీ టీం చాలా ఫాస్ట్‌గా ఉందని అంటుంది. అవును మమ్మీ నా టీం చాలా మంచిగా కుదిరిందని మ్యాడీ సమాధానమిస్తాడు. 
 
ఇంతలో దేవా కలుగజేసుకుని మీ ఆఫీసులో ఎవరో కొత్తగా ఓ అమ్మాయిని జాయిన్ చేశారని విశ్వప్రసాద్‌గారు చెప్పారని దేవా అంటాడు. అవును డాడీ ఆ అమ్మాయి వల్లే ఈ ఢీల్‌ ఓకే అవుతున్నాయని చెప్పగా....ఆ అమ్మాయితో నీకు కంఫర్ట్‌గానే ఉంది కదా అని నాగవల్లి అంటుంది. బాగానే ఉందని మ్యాడీ చెప్పగా....నీకు చిన్నప్పటి నుంచి చిన్నితోనే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది కదా... మరి ఆ అమ్మాయి కూడా చిన్నినేనా అని అడుగుతుంది. దీనికి మ్యాడీ ఏం సమాధానం చెప్పకపోయేసరికి... దేవా చాలా కోప్పడతాడు. 
 
నువ్వు మళ్లీ ఆ చిన్నిని ఎందుకు ఆఫీసుకు రానిచ్చావని అడుగుతాడు. తనవల్ల ఇంత గొడవ జరిగినా మళ్లీ నువ్వు ఎందుకు తీసుకున్నావని అంటే...నాకేం తెలియదని మ్యాడీ అంటాడు. ఆ విశ్వప్రసాద్‌గారే తన టాలెంట్ చూసి తీసుకున్నారని అంటాడు. అయితే ఈ విషయం మాదగ్గర ఎందుకు దాచిపెట్టావని దేవా మండిపడతాడు.
 
లోహి కలుగజేసుకుని ఇంట్లో ఎలాగూ  భార్యభర్తల్లా కలిసి ఉండటం కుదరలేదని ఆఫీసులో ఉందామని పెట్టుకున్నట్లు ఉన్నాడని అంటుంది. దీంతో మ్యాడీకి కోపం వచ్చి అలా ఎప్పటికీ జరగదని చెబుతాడు. దీంతో నాగవల్లి కల్పించుకుని ఇప్పుడు నీ ఆఫీసులోకి వచ్చిన  అమ్మాయి... మెల్లగా నీ మనసుకు దగ్గరై ఈ ఇంటికి కోడలిగా మళ్లీ మన నెత్తిన ఎక్కుతుందని అంటుంది. 
 
మీ అమ్మ చావుకు కారణమైన ఆ చిన్నిని మళ్లీ నువ్వే ఈ ఇంటి కోడలిగా తీసుకొస్తావా అని నిలదీస్తుంది. అది ఎప్పటికీ జరగనని పని అంటాడు. నువ్వు కట్టిన తాళి దాని మెడలో ఉన్నంతకాలం అది నీకు భార్యేనని...ఎప్పటికైనా మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెడుతుందని అంటాడు. దీంతో మ్యాడీ చిన్నికి త్వరలోనే విడాకులు ఇవ్వనున్నాని...దీంతో మా మధ్య బంధం శాశ్వతంగా తెగిపోనుందని చెప్పడంతో అందరూ ఎంతో సంతోషపడతారు. ఇంతలో వాళ్ల పెద్దమ్మ ప్రమీల వచ్చి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇస్తుంది. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పివెళ్లిపోతాడు.
 
తండ్రి బాలరాజును తప్పించి తీసుకొచ్చిన చిన్ని... తన మేనేజర్ రామానుజం ఇంట్లోనే అద్దెకు ఉంచుతుంది. బయట ఎక్కడ ఉంచినా... దేవా మనుషులు కనిపెడారని, అదే వాళ్ల కంపెనీలో పనిచేసే మేనేజర్ ఇల్లు అయితే వెతకరని ఆ పనిచేస్తుంది. అక్కడ హాఫ్‌టిక్కెట్‌ను ఉంచి తండ్రికి కావాల్సినవి అన్నీ చూసుకోమని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో రౌడీలు దేవాకు ఫోన్ చేసి చిన్ని తన తండ్రిని తప్పించుకుని తీసుకెళ్లింది చెప్పడంతో దేవా మండిపడతాడు. 
 
ఒక ఆడపిల్లను ఆపలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన నాగవల్లి..ఏం పర్వాలేదు బావా మ్యాడీ ఎలాగూ చిన్నికి విడాకులు ఇస్తానని చెప్పాడు కదా అని అంటుంది. వాడు విడాకులు  ఇచ్చిన తర్వాత ఆ తండ్రీ కూతుళ్లు ఇద్దరూ కుమిలికుమిలి చచ్చిపోతారని చెబుతుంది. కాబట్టి వాళ్లిద్దరినీ చంపడానికి నువ్వే ప్రయత్నాలు చేయవద్దని చెబుతుంది. 
 
వాళ్లను చంపడానికి ఇంకా ఏదైనా కారణం ఉందా అని నిలదీస్తుంది. అలాంటిదేమీ లేదని దేవా బదులిస్తాడు. మరి అయితే ఎందుకు నువ్వు పదేపదే ఆ చిన్నిని, వాళ్ల నాన్ను చంపాలని చూస్తున్నావు అని అడుగుతుంది. మ్యాడీ జీవితం బాగు చేయడం కోసమే ఇలా చేస్తున్నానని చెప్పడంతో నాగవల్లి నమ్ముతుంది. కానీ చిన్ని, వాళ్ల నాన్న కలిస్తే....నా భార్యను నేనే చంపానన్న నిజం నీకు, మ్యాడీకి తెలిసిపోతుందని దేవా అనుకుంటాడు. రౌడీలకు ఫోన్ చేసి వాళ్లిద్దరూ ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయమని ఆదేశిస్తాడు.
 
తండ్రిని కలిసి ఆనందంతో ఇంటికి వచ్చిన చిన్ని ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పి సంతోషపడుతుంది. మరి ఇక్కడికి తీసుకురాకపోయావా అని అంటే ఆ దేవా మనుషులు మళ్లీ ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా పెట్టానని చెబుతుంది. అప్పుడే ప్రమీల అత్తయ్య అక్కడికి వచ్చి మ్యాడీ నీకు విడాకులు ఇవ్వనున్నట్లు చెప్పడంతో చిన్ని షాక్‌ తింటుంది.