Chinni Serial Today Episode: చందుకు కనిపించకుండా లోహి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. అప్పుడు మధు కావాలనే చందును డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకొస్తుంది. దీంతో డైనింగ్ టేబుల్ కింద లోహిత భయంతో వణికిపోతుంది. అక్కడే కూర్చుని చందు....టీ తాగేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత లోహిత మధుపై మండిపడుతుంది. చందును ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని నిలదీస్తుంది. అదేంటి నిన్న నువ్వే నాకు వార్నింగ్ ఇచ్చావు...ఈ బర్త్‌డే ఫంక్షన్‌కు రావొద్దని చెప్పావు...ఇవాళ నువ్వే భయంతో వణికిపోయావ్ అంటూ గేలి చేస్తుంది. అనవసరంగా నన్ను భయపెట్టాలని చూస్తే....నేను ఇలాగే భయపెడతాను అని హెచ్చరిస్తుంది. నేను నీలా వార్నింగ్‌లు ఇవ్వను....డైరెక్ట్‌గానే భయపెడతానని చెబుతుంది.
నేను మీ అన్నయ్యను తీసుకొస్తేనే డైనింగ్ టేబుల్ కింద దాక్కున్న దానివి...నేను అసలు విషయం చెబితే ఎక్కడ దాక్కుంటావ్ అని ప్రశ్నిస్తుంది. నువ్వు నన్ను నీ మేనత్త కుమార్తెనని భావించకపోయినా...నీను నిన్ను ఇంకా నువ్వు నా మేనమామ కూతురువని అనుకుంటున్నాను. అందుకే నువ్వు ఎన్ని కుట్రలు చేసినా...నేను ఇంకా క్షమించి వదిలేస్తున్నాను. ఇకపై నువ్వు నాతో ఎలా ప్రవర్తిస్తావో దాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుందని మధు లోహితకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇప్పటికైనా మారి అందరికీ నిజం చెప్పమని సలహా ఇస్తుంది. ఏదో ఒకరోజు అత్త, చందు నిన్ను వెతుక్కుంటూ వస్తారని...అప్పుడు ఎక్కడికి పారిపోతావంటూ నిలదీస్తుంది.
మ్యాడీ కోసం శ్రేయ సర్‌ప్రైజ్ బర్త్‌డే గిఫ్ట్ తెచ్చి ఇస్తుంది. గ్రీంటింగ్‌కార్డు చూసి ఎంతో మెచ్చుకున్న మ్యాడీ ఆ తర్వాత శ్రేయ ఇచ్చిన నెమలి పించం చూసి మాత్రం కోపంతో రగిలిపోతాడు. చిన్నప్పుడు తాను చిన్నికి ఇచ్చిన నెమలి పించం గుర్తుకు వచ్చి అలా చేస్తాడు. ఎంతో ప్రేమగా గిఫ్ట్ ఇస్తే దాన్ని అలా పడేశావేంటని శ్రేయ ప్రశ్నిస్తుంది. నువ్వు గిప్ట్ ఇచ్చావు తీసుకున్నా...ఇక దీని గురించి వదిలేయమంటాడు.అలా మొక్కుబడిగా తీసుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందని శ్రేయ ఏడుస్తుంది. దీంతో నాగవల్లి వచ్చి ఎందుకు ఇలా చేశావ్ మ్యాడీ అని అడుగుతుంది. నువ్వు బర్త్‌డే సెలబ్రేషన్లు చేసుకునే మూడ్‌లో లేకున్నా మా అందరినీ సంతోషపెట్టేందుకే ఈపార్టీకి ఒప్పుకున్నావని మాకు తెలుసు. అలాగే శ్రేయను కూడా సంతోషపెట్టేలా ఆమె గిప్ట్ తీసుకోమని తండ్రి చెప్పడంతో మ్యాడీ కొంచెం మెత్తబడతాడు. మూడ్ ఆఫ్‌లో ఉండి అలా చేశానంటూ శ్రేయకు మ్యాడీ సారీ చెప్పడంతో అక్కడ అంతా సంతోషిస్తారు.
చిన్నప్పుడు మ్యాడీ పుట్టినరోజుకు చేసినట్లే తులాభారం ఏర్పాట్లు చేస్తారు. దీన్నిచూసి మ్యాడీకి మళ్లీ చిన్ని గుర్తుకు వస్తుంది. ఇలా ఎందుకు చేశారని తల్లిదండ్రులను మ్యాడీ అడగ్గా...ఎప్పుడో చిన్నప్పుడు నీ బర్త్‌డే చేశాం. మళ్లీ ఇన్నాళ్లకు చేస్తున్నాం కదా అందుకే ఇలాంటి ఏర్పాట్లు చేశామని చెబుతారు. తులాభారంలో ఒకవైపు మ్యాడీని కూర్చోబెట్టి మరోవైపు బెల్లం పెడుతుంటారు. శ్రేయ బెల్లాన్ని తులాభారంలో పెడుతూ ఉంటుంది. బెల్లం అయిపోవడంతో అందూ తమ వద్ద ఉన్న బంగారం ఆభరణాలు త్రాసులో వేస్తుంటారు. అయినప్పటికీ మ్యాడీ తూగడు.