Chinni Serial Today Episode దేవాకి మధునే చిన్ని అని అనుమానం వస్తుంది. నాగవల్లితో ఆ విషయం గురించి మాట్లాడుతాడు. నీకు మధుని చూస్తే చిన్ని అని అనుమానం రావడం లేదా అని అడుగుతాడు. లేదు బావ నాకు ఎందుకు అనుమానం వస్తుంది. నేను మధు ఆఫ్ టికెట్‌తో మాట్లాడటం చూడలేదు కదా అంటుంది. 

Continues below advertisement

దేవా నాగవల్లితో మధు చిన్నిలా నటించడం చూసి కూడా నీకు అనుమానం రాలేదా.. మ్యాడీ అంటే నటించాడు ఓకే మరి మధు ఎందుకు అంతలా ఇన్వాల్స్ అయి నటించిది.. అప్పుడైనా నీకు అర్థం కాలేదా.. అయినా నా దగ్గర చెప్పడం లేదా అని అడుగుతాడు. దాంతో నాగవల్లి షాక్ అయిపోతుంది. నాకు వచ్చినట్లే నీకు అనుమానం రావాలి కదా అంటే నాకు రాలేదు బావ అదంతా నటన అని నాకు తెలుసు కదా అంటుంది. అది నటన అని నాకు తెలిసే వాళ్లకి ఆ   కాన్సెప్ట్ ఇచ్చా అని అంటుంది. వాళ్లకి అది ఇవ్వడం ఏంటి మ్యాడీ డిస్ట్రబ్ అవుతాడు అని తెలీదా అని దేవా అడుగుతాడు.

మ్యాడీకి ఆ చిన్ని మీద ఉన్న ప్రేమ ప్లేస్‌లో ఎప్పటికప్పుడు మనం ద్వేషం పెంచుతూనే  ఉండాలి.. లేదంటే వాడి మనసులో చిన్ని ఉండిపోతుంది. అప్పుడు శ్రేయతో వాడు కాపురం చేయలేడు అంటుంది. ఇక దేవా మధు ఎందుకు నాకు అబద్ధం చెప్పింది ఆఫ్ టికెట్ విషయంలో అని అడుగుతాడు. మధు నిజమే చెప్పొచ్చు కదా,.. అది వదిలేసి ఆ ఆఫ్ టికెట్ గాడు ఈ ధైర్యంతో ఇక్కడికి వచ్చాడో అని ఆలోచించు.. వాడు మ్యాడీకి కూడా అదే విషయం అడిగి మ్యాడీ ద్వారా బాలరాజుని విడిపించాలని చూడొచ్చు అని అంటుంది. 

Continues below advertisement

మధు బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మ్యాడీ మధు దగ్గరకు వెళ్లి ఇంకా నువ్వు చిన్ని క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా.. ఆ క్యారెక్టర్లో ఎక్కువ సేపు ఉండకూడదు.. అయినా నేను బాధ పడాలి కానీ నువ్వు ఎందుకు ఆ చిన్నికి అంత కనెక్ట్ అవుతున్నావ్.. నువ్వే చిన్నివా అని అడుగుతాడు. మధు బిత్తరపోతుంది. చాలా కంగారు పడుతుంది. నువ్వే చిన్నివా.. ఆ నిజం దాచి ఇన్ని రోజులు నాతో స్నేహం చేశావా.. నువ్వు ఆ చిన్ని కాదు కదా అని అడుగుతాడు. నిజంగా ఆ చిన్ని ఎదురైతే తనని ఇన్ని తిట్టినా తను బాధ పడదేమో.. నువ్వు ఎందుకు బాధ పడుతున్నావ్ అని అడుగుతాడు. 

మధు తనతో చిన్ని గురించి చెప్పావ్.. చిన్ని నిన్ను కాపాడింది అని చెప్పావ్ అందుకే అని అంటుంది. చిన్ని వాళ్లు ఎదుటి మనుషులకు కీడు తలపెట్టే వాళ్లు కాదని అర్థమైంది కానీ సడెన్‌గా వాళ్ల అమ్మ మీ అమ్మని చంపింది అంటే నమ్మలేకపోతున్నా.. అందుకే చిన్ని వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తున్నా అని అంటుంది. చిన్ని వాళ్ల అమ్మే మా అమ్మని చంపింది అని నేను బలంగా నమ్ముతున్నా.. ఇంకెప్పుడూ వాళ్ల గురించి ఆలోచించకు వాళ్లు జీవితాంతం మనకు శత్రువులు అని గుర్తించుకో ఇంకేం ఆలోచించకు అని మహి అంటాడు.

ఆఫ్ టికెట్ చాటుగా విని పిచ్చి పిల్ల తన తల్లి మీద పడిన నింద పోవాలి అని చాలా ప్రయత్నిస్తుంది. చిన్నికి ఏ ప్రమాదం రాకుండా చూడు తండ్రీ అని ఆఫ్ టికెట్ మొక్కుకుంటాడు. ఇక మధు ఇంటికి రావడం లేట్ అవ్వడంతో సుబ్బు, స్వరూప అడిగితే అమ్మ ఆబ్దికం కదా ఆ ఏర్పాట్లు చేశానని త్వరగా అందర్ని రెడీ అవ్వమని చెప్తుంది. 

దేవా మనిషి చిన్ని, కావేరి ఫొటోలు దేవా ఫ్రేమ్ చేయించమన్నాడని చెప్పి తీసుకొస్తాడు. అది నాగవల్లి చూసి షాక్ అయిపోతుంది. బావ ఎందుకు ఇలా చేశాడు అని వెళ్తుంది. ఎందుకు ఇలా చేశావ్ అంటే ఈ రోజు మనం కావేరిని చంపిన రోజు అందుకే రెడీ చేయించా అంటాడు. మధునే చిన్ని అని నాకు తెలిసినా చెప్పలేకపోతున్నా అని నాగవల్లి అనుకుంటుంది.  దేవా మనసులో చిన్ని బతికి ఉంటే నేను పార్వతిని నేనే చంపాను అని బయట పెడితే అదే నాకు చివరి రోజు అవుతుంది అని అనుకుంటాడు. 

మ్యాడీ కావేరి, చిన్నిల ఫొటోలు చూసి ఆవేశంతో ఊగిపోతాడు. వాటిని తీసుకొని కోపంగా వెళ్తాడు. ఇక బాలరాజు అక్కడే ఉన్న క్యాలెండర్ చూసి కావేరి ఆబ్దికం అని గుర్తు చేసుకొని ఎలా అయినా తప్పించుకొని కావేరికి ఆబ్దికం చేయాలి అనుకుంటాడు. మ్యాడీ ఆవేశంగా వెళ్లి ఈ హంతకురాలు ఆమె కూతురి ఫొటో మన ఇంట్లో ఎందుకు ఉంది అని అడుగుతాడు. వాళ్లు మనకు ద్రోహం చేసినా మీ నాన్న వాళ్లకి తోడుగా నిలిచారు. అందుకే ఆవిడ పేరు మీద అన్నదానం చేయించాలని అనుకుంటున్నారని నాగవల్లి అంటుంది. మా అమ్మని చంపిన ఆవిడను నువ్వు క్షమిస్తావేమో కానీ నేను క్షమించను.. చిన్నిని కూడా నేను క్షమించను అని అంటాడు. ఆవిడ పేరు మీద అన్నదానం చేయిస్తావ్ కాబట్టి ఆవిడ ఫొటో ఓకే కానీ చిన్ని ఫొటో ఎందుకు అని కోప్పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.