Chinni Serial Today Episode శ్రేయ అలిసిపోయి వసంతకి పిలిచి తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకురా అని అంటుంది. ఇంతలో కాఫీ గదిలో ఎవరూ ఉండరు కానీ కాఫీ కప్ మాత్రం వస్తుంది. అది చూసిన శ్రేయ ఇదేంటి ఇంత ఫాస్ట్‌గా మమ్మీ కాఫీ పంపించింది అని అనుకుంటుంది. శ్రేయ కాఫీ కప్ తీసుకోబోతే కప్ మామయై మరో చోటుకి వెళ్తుంది. ఇదేంటి ఇక్కడి నుంచి కప్ అక్కడికి ఎలా జంప్ అయింది అని శ్రేయ చెమటలు పట్టేస్తుంది. దూరం నుంచి అదంతా లోహిత చూసి చాలా భయపడుతుంది. 

Continues below advertisement

లోహిత గదిలోకి వెళ్లి కప్ తీసుకోవాలని చూస్తే కప్ మాయం అవుతుంది. ఇద్దరూ చాలా కంగారు పడతారు. ఇంతలో చిన్నిలోకి కావేరి ఆత్మ వచ్చి శ్రేయ గదిలోకి వస్తుంది. నా గదిలోకి ఎందుకు వచ్చావ్ చిన్ని అని శ్రేయ అడిగితే నేను చిన్నిని కాదు.. కావేరిని అని లోహితను చూసి హంతకురాలు, దుర్మార్గురాలు అని నువ్వు అంటావే ఆ కావేరినే అని చిన్ని అంటుంది. నేను నమ్మను నువ్వు మీ అమ్మలా నటిస్తున్నావ్ అని శ్రేయ అంటే నమ్మవా అని చిన్ని శ్రేయ గొంతు పట్టేసి గోడ మీద నుంచి పైకి ఎత్తేస్తుంది. శ్రేయ విలవిల్లాడిపోతుంది. ఇప్పుడు నమ్ముతావా అని చిన్ని కావేరి ఆత్మ అంటే నమ్ముతా నన్ను వదిలేయ్ అని శ్రేయ అంటుంది. ప్రస్తుతానికి వదులుతా  అని వదిలేస్తుంది. శ్రేయ బయటకు పరుగున వెళ్లి చిన్ని వాళ్ల అమ్మ కావేరి దెయ్యంలా వచ్చిందని వరుణ్ ప్రమీలకు చెప్తుంది. 

వరుణ్ వాళ్లు వెళ్లి చూసే సరికి వసంత ఫేస్ ప్యాక్ వేసుకొని కనిపిస్తుంది. అందరూ వసంతని చూసి భయపడ్డారని అనుకుంటారు. లోహితతో ఏంటి నీకు చిన్ని చుక్కలు చూపించిందా అని అంటే అవును అని లోహిత అంటుంది. మరి నాకు ఎందుకు చెప్పలేదు అని అంటే ఇప్పుడు నువ్వు చెప్తే ఎలా నమ్మలేదు కదా నేను చెప్తే నమ్ముతారా అని చెప్పలేదు.. ఇప్పుడు నీకు ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి నువ్వు నమ్మావు.. అయినా నాకు ఒక డౌట్ నిజంగానే చిన్నిలోకి కావేరి ఆత్మ చేరిందా లేదంటే చిన్నినే అలా నటిస్తుందా అని లోహిత అంటుంది. మా మమ్మీకి సలహా అడుగుదాం పద అని ఇద్దరూ పరుగున వసంత దగ్గరకు వెళ్తారు. ఇద్దరూ వసంతకి విషయం చెప్తే ఇద్దరినీ తిడుతుంది. ఏఐ అంటూ ఉన్న ఈ జనరేషన్‌లో ఇంకా దెయ్యాలు ఏంటే అని తిడుతుంది. దమ్ముంటే ఆ కావేరిని నా దగ్గరకు రమ్మని చెప్పు అని అంటుంది. వద్దమ్మా నిజంగానే వచ్చేస్తుందని శ్రేయ అంటుంది. ఇక చిన్ని వచ్చి ఏమైందని అడుగుతుంది. నువ్వే వీళ్లని భయపెడుతున్నావ్ అని చిన్నిని వసంత అంటే నేను భయపెట్టానా అని అడుగుతుంది చిన్ని. లేదు లేదు అంటూనే అవును అని ఇద్దరూ వసంతకి చెప్తారు.

Continues below advertisement

చిన్నిని వసంత తిడుతుంటే వద్దు నోరు జారొద్దు అని ఇద్దరూ చెప్తారు. ఇక రాత్రి లోహిత డైనింగ్ టేబుల్ మీద బిర్యాని చూసి లోహిత తినడానికి వెళ్తే వెనక నుంచి కావేరి ఆత్మ వచ్చి కళ్లు మూసుకుంటుంది. వెనక నుంచి లోహిత చూసి పెద్దగా అరుస్తుంది. శ్రేయ, నాగవల్లి వచ్చి ఏమైందని అడుగుతారు. అర్ధరాత్రి వచ్చి బిర్యాని తింటున్నావేంటి అని నాగవల్లి అడుగుతుంది. తర్వాత లోహిత మళ్లీ బిర్యాని తినడానికి కూర్చొంటే ఆత్మ వచ్చి తింటావా లెగ్ పీస్ తింటావా అని అంటుంది. లోహిత మళ్లీ అరుస్తుంది. లోహితకు మాత్రమే దెయ్యం కనిపిస్తుంది. నాగవల్లి, శ్రేయ ఏం లేదు కదా అంటారు. ఇంతలో లోహిత కళ్లు తిరిగి పడిపోతుంది. రూంలో తిందువు గానీ పద అని లోహితని శ్రేయ తీసుకెళ్తుంది. 

ఉదయం మ్యాడీ బెడ్ మీద రివర్స్‌లో పడుకొని ఫోన్ చూస్తుంటే చిన్ని కాఫీ తీసుకొచ్చి మ్యాడీ కాలు మీద కాఫీ పెడుతుంది. రాక్షసి తీయ్యవే అని మ్యాడీ అంటాడు. అయినా నేను తీయను ఇప్పుడు తీయాలి అంటే నువ్వు నాకు ఐలవ్‌యూ చెప్పాలి.. లేదంటే నేను తెచ్చిన కాఫీ నువ్వు తాగాలి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.