Chinni Serial Today Episode లోహిత రాత్రి జరిగిందే తలచుకొని అసలు రాత్రి ఏం జరిగింది.. నేను చూసిందే జరిగిందా.. ఏదో జరిగింది అని నేను ఊహించుకున్నానా.. చిన్నిని అడిగి తెలుసుకుంటే బెటర్ అని గదిలోకి వెళ్లి చిన్ని అంటుంది. ఏంటి అని చిన్ని అనగానే లోహిత వణికిపోతుంది. నువ్వు రావడం చూసే ఇలా అన్నాను అని చిన్ని అంటుంది. చిన్నగా అరవడం ఏంటి దెయ్యంలా అంతలా అరిచావ్ అంటుంది. ఏంటి దెయ్యం దెయ్యం అంటున్నావ్ అని చిన్ని అంటే లేదు రాత్రి నువ్వు చాలా చేశావ్ గుర్తు చేసుకో అని అంటుంది. 

Continues below advertisement

చిన్ని ఆలోచించి రాత్రి నువ్వు ఎక్కువ కలలు కనేశావ్.. నేను అసలు లేవలేదు.. అంతా నీ భ్రమ నువ్వు నా లైఫ్‌ మీద ఫోకస్ చేయడం మానేసి నీ జీవితం ఆలోచించుకో అని అంటుంది. ఆలోచిస్తూ వెళ్తున్న లోహితను శ్రేయ వచ్చి పట్టుకోగానే లోహిత పెద్దగా అరుస్తుంది. ఎందుకు అరిచావ్.. రాత్రి నుంచి తేడాగా ప్రవర్తిస్తున్నావ్.. నువ్వు చిన్నికి భయపడుతున్నావా అని శ్రేయ అడిగితే నేను చిన్నికి భయపడటం ఏంటి.. దెయ్యానికి కూడా భయపడను అంటుంది లోహిత. నీ ముఖం చూస్తుంటే నువ్వు నిజంగానే భయపడుతున్నట్లు ఉంది.. నీ కంటే నేనే బెటర్ అని అనుకొని శ్రేయ వెళ్తుంది. 

చిన్ని బతకడం ఏంటి.. ఎలా బతికింది అని దేవా తన మనిషికి కాల్ చేస్తాడు. చిన్నిని చంపాలని ప్రయత్నించిన మన వాళ్లని చిన్నినే చంపబోయింది.. అందరూ హాస్పిటల్‌లో ఉన్నారు.. చిన్నికి ఏదో ఆవహించినట్లు ఆదిశక్తిలా మారిపోయింది అంట సార్ అని చెప్తాడు. నాగవల్లి దేవా దగ్గరకు వచ్చి నాకు తెలీకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది బావ.. ఎప్పుడూ లేనిది మ్యాడీ చిన్నితో కలిసి బయటకు వెళ్లడం ఏంటి.. కావేరి భర్త్‌డే అని స్వీట్స్ పంచడం ఏంటి.. ఎప్పుడూ లేనిది పొద్దెక్కే వరకు నేను లేవకపోవడం ఏంటి.. రాత్రి తిన్న స్వీట్ ఏమైనా తేడా చేసుంటుందా.. నువ్వు ఆ స్వీట్ తిన్నావా బావ అని అడుగుతుంది. తిన్నాను కానీ నాకు ఏం కాలేదు అని దేవా అంటాడు. ఈ తలనొప్పులు కాదు ముందు మనం ఆ బాలరాజు సంగతి తేల్చాలి అని దేవా అంటాడు. 

Continues below advertisement

చిన్ని తండ్రి బాలరాజుని కలుస్తుంది. నిన్ను మ్యాడీ బాబుని పక్కపక్కన చూసి చాలా హ్యాపీగా ఉంది.. మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని అంటాడు. ఏం హ్యాపీ నాన్న అమ్మ నిర్దోషి అని నిరూపించకపోతే మ్యాడీ నాకు దగ్గరవ్వడు అని అంటుంది. నేను అందుకే ప్రయత్నిస్తున్నాను.. మీ అమ్మ క్లాస్ మేట్ హరి అని ఒక లాయర్ ఉన్నాడమ్మా.. గతంలో నన్ను, మీ అమ్మని ఆ కేసుల నుంచి బయట పడేయడానికి చాలా ప్రయత్నించాడు.. ప్రస్తుతం హరి ఎక్కడున్నాడో తెలీదు.. నేను, ఆఫ్ టికెట్ కలిసి హరిని వెతుకుతాం అని అంటాడు. వద్దు నాన్న.. మీ కోసం వెతుకుతున్నారు. మీరు బయటకు వెళ్తే చాలా పట్టేస్తారు.. నా సిమ్ కూడా ట్రేస్ చేస్తున్నారు.. అందుకే కొత్త సిమ్ వేసుకున్నా అని చెప్తుంది. నిన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి నాన్న లేదంటే అమ్మానాన్న లేని అనాథ అయిపోతా అని ఏడుస్తుంది. దాంతో బాలరాజు వెళ్లను అమ్మ ఇక నుంచి నేను ఇంటి నుంచి వెళ్లను అని అంటాడు. ఆ లాయర్ డిటైల్స్ నాకు ఇవ్వు నాన్న అంటుంది. బాలరాజు చెప్తాడు.

లోహిత కావేరి ఫొటో చూస్తూ చిన్ని చేసిన బీభత్సం గురించి ఆలోచిస్తుంది. శ్రేయ వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగితే మ్యాడీ గురించి ఆలోచించి బాధ పడుతున్నా.. తన తల్లిని చంపినది తన తల్లి ఫొటో పక్కనే ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించు అని అంటుంది. మన ఇంట్లో వాళ్లని హత్య చేసిన హంతకురాలి ఫొటోని మన ఇంట్లో ఉంచుకుంటామా,, తీసి పడేస్తామా.. అని అంటుంది. దాంతో శ్రేయ కావేరి ఫొటో తీయడానికి వెళ్తుంది. ప్రమీల చూసి ఎందుకు ఇలా చేస్తున్నావ్.. అని అంటుంది. శ్రేయ ఫొటో తీసుకెళ్లి పడేయబోతే చిన్ని వచ్చి అడ్డుకుంటుంది. గడువు పూర్తి అయ్యే వరకు ఈ ఫొటోని మీ అత్తయ్య, మామయ్య, మీ బావ తీసేయాలి అని అనుకోరు.. గడువు అయిపోయిన తర్వాత తీయాల్సిన అవసరం రాదు.. అని అంటుంది. ఈ ఇంటి ఇల్లాలిని దారుణంగా చంపేసిన హంతకురాలి కూతిరివి నీకే అంత ధైర్యం ఉంటే నాకు ఇంకెంత ఉండాలి.. అసలు మీ అమ్మ అని శ్రేయ అంటే శ్రేయ అసలు నీకు ఏం తెలుసు మా అమ్మ గురించి నిజం తేలిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడు అంత వరకు ఒక్క మాట మాట్లాడినా ఈ చిన్ని విశ్వరూపం చూడాల్సి వస్తుందని అంటుంది. తర్వాత చిన్ని కావేరి ఫొటో తీసుకెళ్లి పెడుతుంది. శ్రేయ గదిలోకి వెళ్లి రోజు రోజుకి చిన్ని ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. చిన్నిని దాని ఓవర్ యాక్షన్‌ని కట్ చేయాలి అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.