Chinni Serial Today Episode సత్యంబాబు, సరళ, చిన్నిల పక్కనే బాలరాజు కూర్చొంటాడు. ఇంతలో నర్సు వచ్చి ఉష స్ఫ్రుహాలోకి వచ్చిందని చెప్తారు. అందరూ సంతోషంగా చూడటానికి వెళ్తారు. డాక్టర్ వాళ్లతో మీరు చాలా అదృష్టవంతులు తను లేచిందని అంటారు. కావేరిని చూసి సత్యంబాబు ధైర్యం చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు. అది చూసి కావేరి బాధ పడుతుంది.
సరళని ఇంటికి పంపి మందులు తీసుకొస్తానని సత్యంబాబు వెళ్తాడు. చిన్ని తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. కావేరి తనకు ఏం కాలేదని ఊరుకో అని అంటుంది. ఇక చిన్నిబాలరాజు నిప్పుల గుండం తొక్కడం గురించి చెప్తుంది. కావేరి బాలరాజు చేయి పట్టుకొని థ్యాంక్యూ చెప్తుంది. బాలరాజు చేతికి గాయం చూస్తుంది. ఏమైందని అడుగుతుంది. చిన్న దెబ్బ తగిలిందని రాజు అంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని అంటుంది.
చిన్ని కావేరికి అన్నం తినిపిస్తుంది. చిన్నిని డాక్టర్‌కి పిలవమని చిన్నికి పంపుతాడు. తర్వాత కావేరితో మనం వీలైనంత త్వరగా వెళ్లిపోవాలి ఆ దేవాకి నువ్వే కావేరి అని తెలిసిపోయింది. అందుకే స్వీట్‌లో విషం కలిపాడని చెప్తాడు. రేపే ఊరి నుంచి వెళ్లిపోదామని అంటాడు. అది విన్న సత్యంబాబు వచ్చి గొడవ పడతాడు. ఒకసారి నా చెల్లిని తీసుకెళ్లి దాని జీవితం నాశనం చేశావు. మళ్లీ ఇప్పుడు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నావ్రా అని అడుగుతాడు. కావేరి అడ్డుకోబోతే వద్దని వీడు ఓ మృగం అని బాలరాజు కాలర్ పట్టుకొని గెంటేస్తాడు. ఒకసారి తన జోలికి వస్తే చంపేస్తా అంటాడు. నేను తన భర్తని నా భార్యపిల్లని నేనే కాపాడుకోవాలని అంటాడు. ఇప్పుడు నీకు తను భార్య అని గుర్తొచ్చిందా అని బాలరాజుని కొడతాడు.
బాలరాజు సత్యంతో నువ్వు కొట్టినా తిట్టినా పడున్నాను అంటే ఏం చేయలేక కాదు నా భార్యపిల్లల కోసం అని అంటాడు. నాలో పాత రాక్షసుడు వస్తే ఎవర్నీ వదలను నా భార్య పిల్లల కోసం ఎవర్ని అయినా చంపేస్తా అంటాడు. దానికి సత్యం అయితే ఏంటి నన్ను చంపేస్తావా అని గట్టిగా అడుగుతాడు. దాంతో బాలరాజు సత్యంబాబు మీదకి కత్తి తీస్తాడు. అక్కడున్న ఓ వ్యక్తి అదంతా రికార్డ్ చేస్తాడు. కావేరితో కావేరి నీకు చెప్పాల్సింది అంతా చెప్పాను నువ్వు మీ అన్నలా మూర్ఖంగా కాకుండా మంచిగా నిర్ణయం తీసుకో అంటాడు. ఇంతలో చిన్ని వచ్చి ఏమైందని అడుతుంది. ఏం కాలేదని చెప్తారు.
కావేరిని సత్యంబాబు ఇంటికి తీసుకెళ్తాడు. సరళ దిష్టి తీస్తుంది. బాలరాజు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. బాలరాజుని అస్సలు నమ్మొద్దని కావేరితో సత్యంబాబు చెప్తాడు. బాలరాజు, దేవేంద్ర వర్మ ఏదో కుట్ర చేస్తున్నారని అంటాడు. నిన్ను నా దగ్గర ఉంటే నిన్ను నిర్దోషిలా బయటకు తీసుకొస్తానని నిన్ను నా నుంచి దూరం చేయాలి అని చూస్తున్నారని నువ్వు వాళ్ల మోసాలకు కుట్రలకు బలి కావొద్దని నీకు ఏం కాకుండా ఈ అన్నయ్య చూసుకుంటాడని అంటాడు. కావేరి అన్నయ్యని పట్టుకొని ఏడుస్తుంది. నేను వెళ్లను అని కావేరి ఇన్ డైరెక్ట్‌గా చెప్తుంది. తర్వాత చిన్ని తల్లికి పాలు తీసుకొని వెళ్లి ఇస్తుంది. నేను అంతా విన్నానమ్మా ఇప్పుడేం చేద్దాం. నాన్నతో వెళ్లిపోతామా.. ఇక్కడే ఉంటామా అని అడుగుతుంది. నాన్న చెప్పినట్లు చేస్తే మామయ్య వాళ్లని వదిలేసి వెళ్లిపోవాలి అలా వెళ్లాలి అంటే బాధగా ఉందని ఎలాగోలా అందరం కలిసే ఉందామమ్మా నాన్నని ఒప్పించు అని అంటుంది. ఏం తేల్చుకోలేకపోతున్నా అని కావేరి అంటుంది. మరోవైపు బాలరాజు బట్టలు సర్దుకొని కావేరి, చిన్ని, తనకోసం టికెట్ తెప్పిస్తాడు. కావేరికి ఫోన్ చేసి రాత్రి 12కి చిన్నిని తీసుకొని వచ్చేయమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!