Chinni Serial Today March 19th: చిన్ని సీరియల్: చిన్నినీ కన్నా అంటూ ఎమోషనలైన విజయ్.. నాగవల్లి ఈవిల్ ప్లాన్!
Chinni Today Episode విజయ్ హోళీ వేడుకలకు రావడం అందరూ కలిసి హోళీని ఎంజాయ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode ఏసీపీ విజయ్ తన టీమ్‌లో గౌతమ్ అనే ఓ ఆఫీసర్‌ని పిలిచి కావేరి కేసు గురించి చెప్పి డెహ్రాడూన్‌లో పెరిగి ఉష గురించి ఎంక్వైరీ చేయమని ఫుల్ డిటైల్స్ ఇచ్చి పంపిస్తాడు. కావేరి ఈ సారి నువ్వు నా చేతి నుంచి తప్పించుకోలేవని అనుకుంటాడు. చిన్ని తనని హోళీ వేడుకకు పిలవడం గుర్తు చేసుకుంటాడు.
రాజు దగ్గరకు చందు వెళ్లి మామయ్య నువ్వు చాలా మంచోడివి కానీ ఎందుకు నాన్న అత్తలు నిన్ను ఇష్టపడరు అని అంటాడు. రాజు ఏం చెప్పకుండా నవ్వుతాడు. చందు రాజుతో మాట్లాడటం చూసిన సత్య చందుని పిలిచేస్తాడు. వాడితో నీకేంట్రా అని తిడతాడు. మామయ్య కదా అని చందు అంటే అలాంటి దుర్మార్గుడు నీకు మామ ఏంట్రా అని వాడిని అలా అనొద్దు అని వరసలు కలపొద్దని అంటాడు. రాజు మనం కూడా కలిసిపోవాలి సత్యం అంటే కాలనీవాళ్ల కోసం ఆలోచిస్తున్నా కానీ లేదంటే నీ కాళ్లు చేతులు విరగ్గొట్టే వాడిని అంటాడు. రాజు అవేమీ పట్టించుకోకుండా పని చేసుకుంటాడు.
చందు రాజు దగ్గరకు మళ్లీ వచ్చి మీ నాన్న తిడితే కోపంగా లేదా అంటే నేను చేసిన పనికి ఇంకెవరు అయినా చంపేసేవాళ్లు మా సత్యం బావ బంగారం కాబట్టి నన్ను తిట్టాడు అంతే అంటాడు. ఉష పిల్లల్ని తీసుకొని వెళ్లి రంగులు స్నాక్స్ కొంటుంది. అటుగా నాగవల్లి వస్తుంటుంది. చిన్ని ఉషతో మీరు ఈ రోజు చాలా అందంగా ఉన్నారు టీచర్ అని అందరితో చెప్పి ఓ వేసుకోండి అంటుంది. సంతోషంగా పిల్లలతో కలిసి హోళీ ఆడుతున్న ఉషని నాగవల్లి చూసి రగిలిపోతుంది. తన రౌడీలకు కాల్ చేసి తన ప్లాన్ చెప్తుంది. వాళ్లని స్పాట్‌కి రమ్మని చెప్తుంది. చిన్ని వాళ్లు వెళ్లి సత్యం, సరళకు రంగులు పూస్తారు. ఉష సరళకు ఆంటీ అనడంతో సరళ కోపంతో ఎక్కువ రంగులు ఉష మీదకు వేస్తుంది. అందరూ సంతోషంగా హోళీ చేసుకుంటారు. రాజుతో తన ఫ్రెండ్ వచ్చే ఏడాది అయినా నువ్వు సంతోషంగా వాళ్లతో హోళీ జరుపుకోవాలి అన్న అంటే నాకు అంత అదృష్టం లేదురా అని రాజు అంటాడు.
ఏసీపీ విజయ్ అక్కడికి వస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. పీటీ మాష్టారు ఏంటి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అని సరళ అంటుంది. ఉషతో ఏదో పని మీద వచ్చుంటారు వదిలేయ్ అని సత్యం అంటాడు. రాజు తన ముఖం కనిపించకుండా రంగులు పూసుకుంటాడు. ఇక విజయ్‌ని చూసిన చిన్ని హాయ్ విజ్జు అని చెప్పి తానే పిలిచా అని అందరితో చెప్తుంది. విజయ్ ఉషకి హాయ్ చెప్తాడు. ఇక అందరూ హోళీ ఆడుతారు. విజయ్‌కి చిన్ని రంగులు పూస్తుంది. హోళీ ఆడుతుంటే విజయ్ కంట్లోకి రంగు వెళ్తుంది. దాంతో విజయ్ కళ్లు తెరవలేక ఇబ్బంది పడితే చిన్ని వచ్చి సపర్యలు చేస్తుంది. కంటి మీద వాటర్ వేసి కడిగి కళ్లు తెరవమంటే విజయ్ చూసే సరికి చిన్ని తన కూతురిలా కనిపిస్తుంది.
విజయ్ తన కూతురి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా ఆడుకుంటూ పాటలు పాడుతూ హాయిగా తన కూతుర్ని పడుకో పెట్టడం ముద్దాడటం గుర్తు చేసుకొని చిన్నిని హగ్ చేసుకొని తగ్గింది కన్నా అంటాడు. కన్నా ఎవరు అని సరళ అంటే చిన్ని అనకుండా కన్నా అనేశా అంటాడు. ఇలాంటి మేనకోడలు ఉన్న మీరు చాలా అదృష్టవంతులు అని ఇందాక గుడి దగ్గర సాయం చేయడం కూడా చూశానని అంటాడు. ఇక అందరూ మళ్లీ వేడుకల్లో మునిగిపోతారు. డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?