Chinni Serial Today Episode విజయ్ కావేరి(ఉష) గురించి తెలుసుకోవడానికి చిన్నితో స్నేహం చేస్తాడు. చిన్నిని ఇంటికి డ్రాప్ చేస్తానని కారులో తీసుకెళ్తాడు. చిన్న సార్ సార్ అంటూ ఉంటే నువ్వు నా దగ్గర మనిషిలా ఉన్నావ్ నన్ను సార్ అనొద్దు అని అంటాడు. అంకుల్ అననా అని చిన్ని అంటే ఫ్రెండ్స్‌ని అంకుల్ అనరు కదా విజ్జు అని పిలవమని చెప్తాడు. పెద్ద వాళ్లకి పేరు పెట్టి పిలవకూడదు కదా అని చిన్ని అంటే ఫ్రెండ్స్‌ని పిలవొచ్చని అంటాడు.


ఉష(కావేరి) విజయ్ పోలీస్‌ని ఆయనకు దొరికిపోతే చిన్నీకి దూరం అయిపోతానేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో చిన్ని విజయ్ కారులో రావడం చూసి ఉష షాక్ అయిపోతుంది. విజయ్ ఉషని చూస్తూ ఉంటాడు. విజయ్ దగ్గరకు వెళ్లి మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఇద్దరూ బయట కలుసుకుంటారు. ఎవరు మీరు అని అడుగుతుంది. నేను పీటీ టచర్ అంటే కాదు అని అంటుంది.


ఉష: మొన్న మీరు వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చి.. ఇచ్చినట్లే ఇచ్చి దాన్ని జాగ్రత్తగా తీసుకున్నారు. ఎందుకు ఇలా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఎందుకు చిన్నీతో కలిసి ఎందుకు వచ్చారు. చిన్న పిల్లని అడ్డు పెట్టుకొని ఏమైనా సాధించాలి అనుకుంటున్నారా.
విజయ్: ప్రతీ ఒక్కరు జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు. నేను నేను అనుకున్నది సాధిస్తాను. 
ఉష: మీరు ఇలా మాట్లాడటం వల్లే మీరు పీటీ టీచర్ కాదని నాకు అనిపిస్తుంది. మా మాటల్లో ఏదో తేడా ఉంది. చూపులో తేడా ఉంది. పీటీ టీచర్ దగ్గర బ్యాట్‌ బాల్స్ ఉండాలి. మీ దగ్గర రివాల్వర్ ఎందుకు ఉంది.  అందుకే మీరు పీటీ టీచర్‌ కాదని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను అంతే కాన్ఫిడెంట్‌గా నువ్వు పోలీస్ ఆఫీసర్ అని చెప్తాను.
విజయ్: అవును నేను పోలీస్ ఆఫీసరే. మీరు ఎంత స్మార్టో షార్పో నాకు తెలుసిపోయింది. పోలీసులు క్రిమినల్స్‌ని ఈజీగా గుర్తు పడతారు. అలాగే క్రిమినల్స్ కూడా గుర్తు పడతారు. మీరూ అలాగే గుర్తు పట్టారు కదా మిసెస్ కావేరి. మాట్లాడరేంటి మిసెస్ కావేరి. షాక్ అయ్యారా షేక్ అయ్యారా లేక మెంటల్‌గా వీక్ అయ్యారా.
ఉష: కావేరి కావేరి ఎవరు ఆ కావేరి. అందరిలా మీరు పొరపాటు పడుంటారు. 
విజయ్: అందరూ పొరపాటు పడతారు కానీ ఏసీపీ విజయ్ పొరపాటు పడదు. రేపు మీ ఫింగర్ ప్రింట్స్ వస్తాయ్ అవి కచ్చితంగా మ్యాచ్ అవుతాయి. అప్పుడు మీ మిమల్ని అందరూ చూస్తుండగా అరెస్ట్ చేస్తా. అలా కాకూడదు అంటే రేపు ఉదయం మీరు కావేరి అని లొంగిపోవాలి. 


కావేరి(ఉష) టెన్షన్ పడి ఏడుస్తూ జరిగింది అంతా తన శ్రేయాభిలాషి అయిన రాజుకి చెప్తుంది. రాజు  కాఫీ షాప్‌కి వెళ్లమని ఏం చేయాలో చెప్తాడు. తన ప్రాణం అడ్డువేసి అయినా చిన్ని కావేరి కలిసి ఉండేల చేస్తానని అనుకుంటాడు. ఉష మేడ మీద పడుకున్న చిన్ని దగ్గరకు వెళ్లి రేపటి నుంచి మన జీవితాలు ఇంకెలా ఉంటాయో పేరు మార్చుకుని వచ్చే బదులు నా రూపం మార్చుకొని వచ్చి ఉంటే బాగుండేది అని అనుకుంటుంది. నేను మళ్లీ జైలుకి వెళ్తే నీకు మామయ్యకి ఎన్ని కష్టాలు వస్తాయో.. ఓ వైపు ఆ బాలరాజు. మరోవైపు దేవా వాళ్ల నుంచి నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలీడం లేదని ఏడుస్తుంది. ఇంతలో భారతి ఇచ్చి చిన్ని దగ్గర అలా మాట్లాడొద్దని లోపలికి తీసుకెళ్తుంది. 


దేవాకి లాయర్ ఫోన్ చేసి కావేరి కేసు ఇప్పుడు ఏసీపీ విజయ్ చేతిలో ఉందని అంటాడు. ఇక విజయ్ అసిస్టెంట్‌గా ఉన్న స్పందనను వేరే కేసుకు బదిలీ చేయడంతో ఆ స్థానంలోకి కుందన( గీతూ రాయల్) వస్తుంది. కుందన కూడా సేమ్ స్పందన లాగే మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. విజయ్, కుందన వెళ్తుండగా కారు పంక్చర్ అవుతుంది. మీరు స్టెఫినీ మార్చాతారా అని కుందన అంటుంది. కారులో జాకీ లేకపోవడంతో అక్కడే ఉన్న దేవాకి వెళ్లి అడుతుంది. కుందన తీసుకొని వెళ్తుంది. విజయ్ టెన్షన్‌లో పడి దేవా వెనక ఉండే దేవాని చూసుకోడు. ఇక లాయర్ విజయ్ ఫొటో పంపడంతో దేవా షాక్ అయిపోతాడు. ఇక కారు అద్దంలో టైరు మార్చుతున్న విజయ్‌ని చూసి బయటకు వస్తాడు. విజయ్ వచ్చి దేవాకి థ్యాంక్స్ చెప్తాడు. విజయ్‌తో మాట్లాడుతాడు. విజయ్ బిజినెస్ చేస్తున్నా అని చెప్పడంతో బిజినెస్ మాట్లాడుకుందామని విజిటింగ్ కార్డు ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!