Chinni Serial Today Episode విజయ్ ఉషతో మీరు అడ్రస్ ఇవ్వలేదు కాబట్టి నేను స్కూల్‌లో అడ్రస్ అడిగి వచ్చానని అంటాడు. ఇంకెప్పుడూ రావొద్దని స్కూల్ విషయాలు ఇంటికి వస్తే తప్పుగా అనుకుంటారని చెప్తుంది. విజయ్ వాళ్లని రాజు చూస్తాడు. తర్వాత గుర్తు చేసుకొని వీళ్లేంటి ఇక్కడికి వచ్చారని అనుకుంటాడు. ఉష ఇంటికి వెళ్లి తన ఆంటీని హగ్ చేసుకొని ఏడుస్తుంది.
ఉష ఏడుస్తూ కూతురికి దూరం అయిపోతానేమో అని భయంగా ఉందని ఏడుస్తుంది. విజయ్ పోలీస్ అనే భయంగా ఉందని అంటుంది. మీ శ్రేయాభిలాషికి చెప్పమని ఆంటీ అంటే ఉష కాల్ చేసి విజయ్ గురించి చెప్తుంది. అతను పోలీస్‌లా ఉన్నారని అంటుంది. కచ్చితంగా వాళ్లు పోలీస్ అని మీకు ఎలా అనిపిస్తుందని అంటే దానికి ఉష విజిటింగ్ కార్డు మీద పౌడర్ గురించి చెప్తుంది. పోలీస్‌లు ఫ్రింగర్ ప్రింట్స్ కోసం ఇలా చేస్తారని ఆయన ఏం అడిగినా భయపడకుండా సమాధానం చెప్పమని రాజు అలియాస్ శ్రేయాభిలాషి ఉషతో చెప్తాడు. జాగ్రత్తగా ఉండమని అంటారు.
చిన్ని టీచరమ్మ అని పిలుస్తూ వస్తుంది. ఆంజనేయ స్వామి తాడు రక్షగా కడుతుంది. ఇక విజయ్ వేలిముద్రల రిపోర్ట్స్ కోసం మాట్లాడుతుంటాడు. ఇక స్పందన కాఫీ ఇచ్చి పెళ్లి చేసుకోమని తనని ఉద్దేశించి మాట్లాడుతుంది. దానికి విజయ్ నువ్వేం కంగారు పడకు నాకు ఇప్పటికే పెళ్లి అయింది ఓ కూతురు కూడా ఉందని అంటాడు. స్పందన గుండె పట్టుకుంటుంది. విజయ్ ఏదో కామెడీగా పెళ్లి అయి కూతురు ఉంది అన్నాడని అనుకుంటే నిజంగానే ల్యాప్ టాప్‌లో ఓ పాప ఫొటో చూసి మిస్‌యూ కన్నా నువ్వు నాతో పాటు ఉండి ఉంటే ఈ పాటికి అచ్చం చిన్ని అంత ఉండే దానివి అని ఎమోషనల్ అవుతాడు. చిన్నిని చూస్తుంటే నువ్వే గుర్తొస్తున్నావ్ అని కన్నీరు పెట్టుకుంటాడు. స్పందన మళ్లీ వచ్చి సార్ మూడ్ ఆఫ్‌లో ఉన్నారు సరదాగా బయటకు వెళ్దామా అంటే విజయ్ సరే అంటాడు. గెంతులేసుకొని స్పందన బయల్దేరుతుంది.
దేవా లాయర్‌కి కాల్ చేసి ఇన్విస్టిగేటర్ ఎవరో తెలుసుకోమని అంటాడు. ఇక దేవా మాట్లాడుకుంటూ వెళ్తూ అటుగా వచ్చిన విజయ్‌ని ఢీ కొడతాడు. పైగా విజయ్‌ని తిడతాడు. దాంతో విజయ్ ఏరియాకి కొత్త కానీ గొడవకు కాదని అంటాడు. మరోవైపు సరళ కూతురు సరళతో అమ్మ టీచర్ అత్తలా ఉంటుంది కదా కొన్నాళ్లకి అత్తలా ఉన్న టీచర్ ఇళ్ల మనది అని మనల్ని గెంటేస్తే మనం అద్దె ఇంటికి వెళ్లాలి అని అంటుంది. వీలైనంత త్వరగా ఆమెను గెంటేయమని అంటుంది. మరోవైపు చిన్ని టీచర్ దగ్గరకు వెళ్లబోతే సరళ ఆపి ఎప్పుడు టీచర్ టీచరేనా అని తిట్టి మామయ్యకి బాక్స్ ఇవ్వమని పంపుతుంది. ఇక విజయ్ కావేరి ఇంటికి బయల్దేరుతాడు. నిన్న అడ్రస్ అనుకొని వెళ్లారు ఈ రోజు ఏం వంక పెట్టి వెళ్లాలా అనుకొని చిన్నిని అడ్డు పెట్టుకొని వెళ్లాలి అనుకుంటాడు. చిన్నిని డ్రాప్ చేస్తా అంటే ఇప్పుడే అవసరం లేదని పక్కనే షాప్ అని అంటుంది. దాంతో విజయ్ షర్ట్ చింపేసుకొని సత్య షాప్ దగ్గరకు వెళ్తాడు. చిన్ని షర్ట్ కుడుతుంది. ఇక చిన్నికి విజయ్ చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్స్ అంటాడు. ఇక తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. సత్య కూడా చిన్నిని పంపుతాడు. చిన్నిని తీసుకొని విజయ్ వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!