Chinni Serial Today Episode పీటీ ఉష ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వెళ్లి స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ వచ్చారని త్వరలో స్పోర్ట్స్ మీట్ ఉందని చెప్తుంది. కన్వీనర్ వస్తే నన్ను కలవకుండా వెళ్లడం ఏంటి అని ప్రిన్సిపల్ మేడం అడుగుతుంది. బయటే ఉంటారు పిలుస్తాను అని ఉష వెనక్కి వస్తుంది. విజయ్ స్పందనతో కావేరి, ఉషల ఫింగర్ ఫ్రింట్స్ ఒకేలా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయమని అంటాడు.
విజయ్‌ని స్పందన ఢీ కొట్టడం కారు కీస్ కింద పడిపోవడంతో కిందకి వంగిన విజయ్ దగ్గర ఉష గన్ చూస్తుంది. చెమటలు పట్టేసి ముఖం కడుక్కుంటుంది. విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు తన చేతికి పౌడర్ అతుక్కోవడం గుర్తు చేసుకుంటుంది. అతని దగ్గర రివాల్వర్ ఉంది మాట తేడాగా ఉంది ఆయన పోలీస్ అయింటారా అని టెన్షన్ పడుతుంది. అదే ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని ఉంటే చిన్ని వస్తుంది. టీచరమ్మ ఏమైంది ఎందుకు డల్‌గా ఉన్నారని అంటుంది. పిల్లల్ని ఎక్కువ సేపు ఆడించడం వల్ల నీరసంగా ఉందని ఉష చెప్తుంది. ఇక చిన్ని ఉషతో పొద్దున్న నీ కోసం పీటీ సార్ వచ్చారు కలిశారా అంటుంది.
ఉష: వాళ్ల గురించి నీకు ఎలా తెలుసు.
చిన్ని: వాళ్లకి నీ గురించి చెప్పి నేనే గ్రౌండ్‌కి పంపాను. వాళ్లకి నువ్వు చెప్పిన మంచి మాటలు చెప్తే ఇక నుంచి నేను మీ అమ్మని ఫాలో అవుతాను అని చెప్పారు. నిన్ను ఫాలో అవ్వడం అంటే నీ మాటలు ఫాలో అవుతా అన్నారు.
ఉష: నేను మీ అమ్మ అని చెప్పావా.
చిన్ని: లేదమ్మా.
రాజు: చిన్నీ వాళ్లని స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి ఆటో తీసుకొచ్చి డల్‌గా ఉన్న ఉషని చూస్తాడు. ఏమైంది చిన్నీ డల్‌గా ఉన్నావ్.
చిన్ని: నేనేం డల్‌గా లేనే.
రాజు: అవునా చందు కూడా డల్‌గా ఉన్నాడేంటి.
చందు: నేనేం లేనే
రాజు: అవునా ఈరోజు ఎవరిని చూసినా డల్‌గా కనిపిస్తున్నారు.
ఉష: పచ్చకామెర్లోడికి లోకం అంతా పచ్చగానే ఉంటుందిలే. (రాజు పర్స్ కింద పడిపోవడంతో) నా జీవితం నాశనం చేసి పర్స్‌లో నా ఫొటో పెట్టుకొని తిరుగుతున్నాడేంటి ఈ దుర్మార్గుడు.
చందు: రాజు అంకుల్ నీ పర్స్ పడిపోయింది.
రాజు: ఇది పర్స్ కాదు చందు నా జీవితం.
చందు: రాజు అంకుల్ నీకు చిన్నీ, అత్త అంటే అంత ఇష్టం కదా మరి ఎందుకు మీరు విడిపోయారు.
రాజు: ఎందుకంటే నేను చేసిన ఓ తప్పు వల్ల నా జీవితాన్ని నాశనం చేసుకున్నా.
ఉష: నీదే కాదు వాళ్ల అత్తయ్యది నాశనం చేసుంటావ్.
రాజు: అవును చేశాను అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నా. అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథలా బతుకుతున్నా. సరే రండి వెళ్దాం.
మహిని అతని పెద్దమ్మ చదివిస్తుంటుంది. దేవా ఉష, కావేరి ఒకేలా ఉన్నారా లేక కావేరి ఉషలా నటిస్తుందా అని అనుకుంటాడు. ఇక ఓ లాయర్ దేవాకి కాల్ చేసి కావేరి బతికే ఉందని అనుమానంతో ఇన్విస్టిగేషన్ చేయడానికి ఓ ఆఫీసర్ సీక్రెట్‌గా పని చేస్తున్నారని చెప్తాడు. దాంతో దేవా టెన్షన్ పడతాడు. కావేరి ఉష ఒకరే అని తేలితే ఉష జైలుకి వెళ్తుందని అక్కడ తన భార్య పార్వతిని చంపిందని తానే అని తెలిసిపోతుందని టెన్షన్ పడతాడు. ఉష, కావేరి అది ఎవరైనా వాళ్లని చంపేయాలని అనుకుంటాడు. తన దగ్గరకు వచ్చిన విజయ్ పోలీసా లేక దేవా పంపిన వ్యక్తా అని ఆలోచిస్తుంది. ఉదయం విజయ్, స్పందనలు ఉష ఉన్న ఏరియాకు వస్తారు. తనని అబ్జర్వ్ చేయడానికి తిరుగుతారు. కావేరి వదిన వాళ్లని చూసి దొంగ కోళ్లు పట్టేవాళ్లలా అలా తిరుగుతున్నారేంటి అని అడుగుతుంది. స్పందన ఆమెతో గొడవకు దిగుతుంది. మేం ఎవరో తెలుసా అని అంటే విజయ్ స్పందనను స్సందించొద్దని అంటాడు. ఇంతలో సరళభర్త రావడంతో ఇంటి ముందు టచ్ ఆడుతున్నారని చెప్తుంది. ఆయన ప్రశ్నించడంతో అడ్రస్ కోసం వచ్చామని అంటారు. పీటీ టీచర్ కోసం వచ్చామని అంటారు. దాంతో ఆయన వాళ్లని లోపలికి తీసుకెళ్తారు. చిన్ని విజయ్‌ని చూసి పలకరిస్తాడు. టీచర్ లేరని చిన్ని చెప్తుంది.
ఇంతలో బయటకు వెళ్లిన ఉష వస్తుంది. ఉష విజయ్‌ని చూసి టెన్షన్ పడుతుంది. విజయ్ ఉష దగ్గరకు వెళ్లడంతో ఇలా వచ్చేరేంటి సార్ అని ఉష అడుగుతుంది. నేను నీ దగ్గరకు వచ్చాను అంటే నువ్వేం తప్పు చేశావో తెలీదా అని అడుగుతాడు. నేనేం చేయలేదు అని ఉష అంటుంది. మీ ఇళ్లు వెతుక్కుంటూ వచ్చాను అంటే ఏం చేశావో తెలీదా అంటాడు. ( ఈ డైలాగులు అన్నీ పర్సనల్‌లా ఉంటాయి) మీరే చెప్పేయండి సార్ అని స్పందన అంటే మేడం చెప్తారేమో అని చూస్తున్నా అంటాడు. తర్వాత ఉష దగ్గరకు వెళ్లి మీరు చేసిన తప్పు ఏంటో చెప్పమంటారా మేడం.. చెప్తే తప్పు ఒప్పుకుంటారనుకోండి అని అంటాడు. ముందు తప్పు ఏంటో చెప్పండి అని ఉష అడుగుతుంది. దాంతో విజయ్ మీరు మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వలేదని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!