Chinni Serial Today Episode మహి పంతులుతో మృత్యుంజయ హోమం జరిపిస్తే నాకు ఉన్న కీడు అంతా పోతుందా అని అడుగుతాడు. దానికి పంతులు అవును బాబు నీకు అంతా మంచే జరిగి ఆయురారోగ్యాలతో ఉంటావ్ అంటాడు. దాంతో వెంటనే మహి మరో పీట వేసి నాతో పాటు చిన్ని కూడా మృత్యుంజయ హోమం చేస్తుంది అని అంటాడు. దేవా, నాగవల్లి షాక్ అయిపోతారు. 

చిన్నితో నువ్వు చేయడం ఏంటి అని అడుగుతుంది నాగవల్లి. లోహిత మహితో మహి ఈ చిన్ని ఎక్కడ కాలు పెడితే అక్కడ అరిష్టం తనతో నువ్వు పూజ చేయడం ఏంటి తను మా ఇంటికి వచ్చినప్పటి నుంచి దరిద్రమే మా నాన్న కూడా దీనివల్లే చనిపోయాడు అంటుంది. దానికి మహి లేదు లోహిత మీ నాన్న ఎవరో దుర్మార్గుల వల్ల చనిపోయారు దానికి చిన్నికి సంబంధం లేదు అంటాడు. దేవా మనసులో వీడేంటి నన్ను తిట్టేస్తున్నాడు అనుకుంటాడు. నాగవల్లి మహి ఒక్కడినే కూర్చొమంటే.. నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి చిన్ని కారణం అందుకే చిన్నితోనే పూజ చేస్తాను అంటాడు. 

మహి చాలా గొప్పవాడని మహిని గొప్పగా పెంచారు దేవా గారు అని పంతులు దేవాని పొగుడుతాడు. మహి దేవా పర్మిషన్ అడుగుతాడు. దాంతో దేవా సరే అంటాడు. మహి చిన్నిని తీసుకొని వచ్చి పీటల మీద కూర్చొపెడతాడు. చిన్ని, మహి ఇద్దరూ హోమం చేస్తారు. తర్వాత చిన్ని తల్లిదండ్రుల మీద పడిన నిందలు పోయి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. చిన్ని కోరిక తీరాలి అని మహి కోరుకుంటాడు. కావేరి చిన్ని మహిల స్నేహం కలకాలం ఉండేలా దీవించమని తులసమ్మని కోరుకుంటుంది.  కావేరి దగ్గరకు దేవా వస్తాడు. కావేరి దేవాని చూసి పవిత్రమైన పూజ చేస్తూ ఇలాంటి నీచమైన పనులు చేస్తావేంట్రా అని దేవాని తిడుతుంది. 

దేవా కావేరితో బాలరాజుని మళ్లీ జైలుకి పంపిస్తా నువ్వు చిన్ని ఒంటరిగా ఉంటారు నేనే ఏమైనా చేయగలను అని అంటాడు. అప్పుడే బాలరాజు అక్కడికి వచ్చి దేవా మీద చేయి వేసి ఇలాంటి   ఎక్ట్రాలు చేస్తే చంపేస్తా ఇప్పటికే ఒక మర్డర్ కేసు ఉంది నాకు ఏం కొత్త కాదు అని అంటాడు. ఇక బాలరాజు లోపలికి వెళ్లడంతో మహి పరుగున వెళ్తాడు. తర్వాత తులాభారం కార్యక్రమం మొదలవుతుంది. మహిని తులాభారం తక్కెడ మీద కూర్చొపెడతారు. బంగారం,  డబ్బు, బెల్లం ముందే పెట్టి ఉంటారు. అయినా మహి తూగడు. ఫ్లాష్‌బ్యాక్‌లో లోహిత మహి బాలరాజు, చిన్నికి ప్రాముఖ్యత ఇస్తున్నాడని లోహిత కొంత బంగారం బెల్లం తీసేస్తుంది. 

మహి తూగకపోవడంతో నాగవల్లి, దేవా కంగారు పడతారు. ఇంకా బంగారం వేయండి అని పంతులు అంటే ఒంటి మీదవి మాత్రమే ఉన్నాయి అంటారు. బయట వాళ్లు కూడా వేయొచ్చా అని పంతుల్ని కావేరి అడిగితే మీరు అతని మంచి కోరే వారు కదా వేయండి అంటారు. నాగవల్లి బయట వారివి వద్దని తన బంగారం వేస్తుంది. అయినా తూగదు. తర్వాత తన పెద్దక్క ప్రమీల బంగారం వేయిస్తుంది. అయినా తూగదు. అందరూ డిసప్పాయిట్ అయిపోతారు. దేవా కూడా వేస్తాడు. కావేరి కూడా తన రింగ్ పెడుతుంది. అయినా ఏ మార్పు ఉండదు. ఇంతలో చిన్ని శ్రీ కృష్ణుడు బంగారానికి తూగలేదు తులసి ఆకుకు తూగాడు ఈ లీల గుర్తు చేయడానికే స్వామి ఇలా చేస్తున్నాడు అనుకొని చిన్ని దేవుడి దగ్గరకు వెళ్లి దండం పెట్టి తులసి ఆకులు తీసుకొని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!