Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్‌ రుక్మిణి, ఆనంద్‌ల పెళ్లికి ముహూర్తం పెట్టించి రాజుకి ఓ మంచి అమ్మాయిని చూడమని రాజుకి రెండో పెళ్లి చేస్తానని అంటారు. సూర్యప్రతాప్‌ నిర్ణయంతో అందరూ షాక్ అయిపోతారు. రుక్మిణిలా ఉన్న రూప బిత్తరపోతుంది. రాజు సూర్యప్రతాప్‌ ముందు మోకాళ్ల మీద పడి కూర్చొని తప్పుగా అనుకోవద్దు పెద్దయ్యా అమ్మాయి గారు అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు.. నా జీవితంలో అమ్మాయిగారికి తప్ప మరొకరికి చోటు ఇవ్వలేను అంటాడు.

Continues below advertisement


సూర్యప్రతాప్‌ రాజుతో నువ్వు చెప్పింది నిజమే కానీ నేను బంటీ కోసం ఆలోచిస్తున్నా ఈ వయసులో బంటీకి ఓ అమ్మ కావాలి అని అంటారు. దానికి బంటీ నాకు అమ్మ కావాలి అమ్మ ప్రేమ కావాలి కానీ ఈ అమ్మే కావాలి అంటాడు. దానికి సూర్యప్రతాప్‌ అలా మాట్లాడొద్దు బంటీ నీ కోసం దేవుడు ఓ మంచి అమ్మని పంపిస్తాడు అని అంటారు. దానికి బంటీ రుక్మిణిని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ నాకు ఈ అమ్మే కావాలి అని ఏడుస్తాడు. రాజు బంటీని పిలిస్తే బంటీ రాడు.. రాజు బలవంతంగా బంటీని తీసుకెళ్తాడు. బంటీ ఏడుస్తూ ఈ అమ్మే కావాలి అని బతిమాలుతాడు. రాజు మనసులో సారీ బంటీ నిజం చెప్పకుండా నిన్ను ఏడిపిస్తున్నా అని అనుకుంటాడు. 


సూర్యప్రతాప్‌ పంతులుతో ఈ సారి వచ్చిన అమ్మాయి మమల్ని ఎప్పటికీ వదిలి వెళ్లిపోకూడదు అని అంటాడు. పంతులు ఓ అమ్మాయి ఉందని తను అనాథ అని తన పేరు కీర్తి మీకు సమ్మతమే అయితే ఒకసారి చూడండి అంటారు. సూర్యప్రతాప్‌ తమకు ఇష్టమే అని రాజు, బంటీల గురించి చెప్పి తనకు ఇష్టమైతే ఇంటికి తీసుకురండి మాట్లాడుదాం అని అంటాడు. పంతులు వెళ్లిపోతాడు. బంటీ మళ్లీ నాకు ఈ అమ్మే కావాలి అని ఏడుస్తాడు. రుక్మిణి బంటీ దగ్గరకు వెళ్లి నీకు ఎప్పటికీ నేనే అమ్మను అవుతాను అని అంటుంది. సూర్యప్రతాప్‌ బంటీతో ఈ అమ్మ నీకు అమ్మగా ఉంటుంది కానీ మీ నాన్నకి భార్యగా ఉండలేదురా ఈ అమ్మ ఇంకొకరి భార్యరా నీ కోసం కాకుండా మీ నాన్న గురించి ఆలోచించు అని అంటాడు. 


విరూపాక్షి సూర్యతో నా బిడ్డ బిడ్డని చూసుకోవడానికి నేను ఉన్నాను. వాడిని ఇంకెవరో చూసుకోవడం ఏంటి అంటుంది. నా నిర్ణయానికి ఎవరూ ఎదురు చెప్పొద్దు అని సూర్యప్రతాప్‌ బంటీని తీసుకొని వెళ్లిపోతారు. విజయాంబిక, దీపక్‌లు పంతుల్ని కలవాలి అని వెళ్తారు. సుమ రాజుని పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. పెద్దయ్య గారు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారేంటి అని రాజు బాధగా వెళ్లిపోతాడు. విరూపాక్షి, రూప, మందారం రాజు దగ్గరకు వెళ్తారు. ముందు నుంచే చెప్తున్నా కదా మీరు వినలేదు ఇప్పుడు చూడండి అని విరూపాక్షి అంటుంది. మరోవైపు ఆనంద్‌ విజయాంబిక, దీపక్‌లతో మా నాన్న పెళ్లికి రాకపోతే పాడి అయినా ఎక్కుతా కానీ పెళ్లి చేసుకోను అంటాడు. 


దీపక్, విజయాంబికలు మీ నాన్న కోసం మా వాళ్లు వెతుకుతున్నారు. పెళ్లి తంతు మొదలైన వరకు వెయిట్ చేస్తా లేదంటే వెళ్లిపోతా అంటాడు. ఆలోపే తీసుకొస్తామని అంటారు. మరోవైపు బంటీ తనకు రుక్మిణి అమ్మే కావాలి తను మా అమ్మలా ఉంది నాకు తనే కావాలి మీరు తనని ఉండిపోమని చెప్పండి అని అంటాడు. రుక్మిణి ఉండిపోవడం మాకు ఇష్టమే కానీ తను వేరే ఒకర్ని ఇష్టపడుతుందని సూర్యప్రతాప్ అంటాడు. నిన్ను కన్న బిడ్డలా చూసుకునే అమ్మనే ఇస్తాను ప్రామిస్ బంటీ అని సూర్యప్రతాప్‌ అంటాడు. మరోవైపు తల్లీకొడుకులు రాజుకి పెళ్లి చేస్తే రుక్మిణికి సూర్యప్రతాప్‌ ఆస్తి ఇవ్వడు అని అనుకుంటారు. 


మందారం పంతులు చెప్పిన అమ్మాయికి మనం విషయం చెప్దాం అంటే రుక్మిణి తను నాన్నకి చెప్తే కష్టం అని అంటుంది. ఇక విజయాంబిక పంతులు చెప్పిన అమ్మాయి అనాథ కాబట్టి మన వైపు తిప్పుకుందాం అంటుంది. రాజు ఆనంద్ వాళ్లతో రాఘవ కోసమే మనం అంతా ఈ నాటకం ఆడుతున్నాం కాబట్టి రాఘవని తీసుకొచ్చి నిజం చెపిస్తే అన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అని అంటాడు. రాజు మనసులో పెద్దయ్య గారి మాటకు అడ్డు చెప్పలేకపోతున్నా అలా అని ఊరుకుంటే ఘోరం జరిగిపోతుంది. వెంటనే పంతుల్ని కలిసి ఆ అమ్మాయి ఇంటికి రాకుండా ఆపాలి అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!