Chinni Serial Today Episode బాలరాజు కావేరి, చిన్ని వాళ్ల కోసం వంట చేస్తాడు. అందరూ కలిసి తినే టైంకి చందు వస్తాడు. మీరు అందరూ బాగా గుర్తొస్తున్నారు అత్తయ్య అందుకే చూడాలి అని వచ్చాను అంటాడు. కావేరి కన్నీరు పెట్టుకొని చందుని దగ్గరకు తీసుకుంటుంది. బాలరాజు చందుతో అల్లుడు మంచి టైంకి వచ్చావ్ నీకు ఇష్టమైనా చికెన్ వండాను అంటాడు.
చందు ఓ పట్టు పడతాను అంటే చందుని బాలరాజు, చిన్నిలు కుంభకర్ణుడు అంటారు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ తింటారు. చందు తింటూ పొలమారితే కావేరి తల మీద తట్టి నీరు తాగిపిస్తుంది. చందు ఏడుస్తూ నేను పొలమారినప్పుడు నాకు నాన్న ఇలాగే చేశావారు అత్తయ్య నిన్ను చూస్తుంటే నాకు నాన్న గుర్తొస్తున్నారు అని చందు ఏడుస్తాడు. నిన్ను చూస్తే నాకు మా అన్నయ్య గుర్తొస్తున్నాడు అని కావేరి కన్నీరు పెట్టుకుంటుంది. అందరూ తిన్న తర్వాత చిన్ని, చందు, ఆఫ్ టికెట్ ఆడుకోవడానికి వెళ్తారు.
కావేరికి ఓ కొత్త నెంబరు నుంచి ఫోన్ వస్తుంది. కావేరి ఎవరు అని అడుగుతుంది. నేను కావేరి పాత నెంబరు నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే ఎత్తుతావో లేదా అని కొత్త నెంబరు నుంచి చేశాను అంటాడు. ఎందుకు చేశావ్ అని కావేరి అడిగితే ఎందుకు చేశానో నీకు తెలీదా అంటాడు. కావేరి టెన్షన్ చూసి ఫోన్ తీసుకొని ఎందుకురా ఫోన్ చేశావ్.. ఇంకోసారి కాల్ చేస్తే చంపేస్తా అని తిడతాడు. కావేరితో రేపు వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు నువ్వు, చిన్ని జాగ్రత్తగా ఉండాలి అంటాడు. సరే బాల అని కావేరి అంటుంది.
చిన్ని, బాలరాజు రాత్రి కొబ్బరి రేకులతో రాత్రి పూట మహి కోసం గిఫ్ట్ చేస్తుంటారు. ఇంతలో భారతి కావేరి దగ్గరకు వచ్చి మల్లెపూలు ఇచ్చి కట్టుకొని పెట్టుకో అంటుంది. కావేరి మల్లెపూలు కడుతూ ఉంటుంది. చిన్ని బాలతో నాన్న ఎప్పుడూ నాకే సాయం చేస్తావా అమ్మకి చేయవా అంటుంది. బాలరాజు కావేరికి మల్లెపూలు అందిస్తాడు. కావేరి మల్లెపూలు కట్టిన తర్వాత చిన్ని బాలరాజుకి తల్లి జడలో పూలు పెట్టమని అంటుంది. బాలరాజు కావేరి జడలో పూలు పెడతాడు. ఆఫ్ టికెట్, భారతి ముగ్గురినీ చూసి చూడముచ్చటగా ఉన్నారు ఈ ముగ్గురికీ ఎవరి దిష్టి తగలకూడదు అనుకుంటారు.
చిన్ని నాన్న ఒడిలో పడుకొని కథ చెప్పమని అడుగుతుంది. బాలరాజు కావేరిని చూసి ఓ కోట రాణి ఆ కోట రాణిని పేట రాజు ప్రేమించాడు అని కావేరి, బాలరాజుల కథని చిన్నికి చెప్తాడు. చిన్ని నిద్ర పోతుంది. కావేరి రాజుతో అది ఎప్పుడో నిద్ర పోయింది అంటుంది. మరి ముందే చెప్పొచ్చు కదా అని బాల అంటే నేను వింటున్నాను కదా అని అంటుంది.
మహి కోసం నాగవల్లి ఇంటిని అలంకరిస్తుంది. మహి కోసం మొత్తం కృష్ణుడి పాదాలు వేస్తుంది. మహి పిన్నితో థ్యాంక్స్ పిన్ని అమ్మలా చూసుకుంటున్నావ్ అంటాడు. నేను కాకుండా అమ్మలా నిన్ను ఇంకెవరు చూసుకుంటారు అని నాగవల్లి అడిగితే మహి పిన్నిని హగ్ చేసుకొని ఐలవ్‌యూ పిన్ని అని అంటాడు. ఇంతలో మహి ఫ్రెండ్స్ వస్తారు. నాగవల్లి మహిని రెడీ అవ్వమని చెప్తుంది. నాగవల్లి అక్క ఫొటో దగ్గర నిల్చొని ఏడుస్తుంది. మహికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా కానీ నువ్వు లేని లోటు తీర్చలేకపోతున్నా కానీ త్వరలో ఆ లోటు తీర్చుతా అంటుంది.
చిన్ని లంగావోణి కట్టుకొని బయల్దేరితే ఆఫ్ టికెట్ చిన్నిని శ్రీవల్లి శ్రీవల్లి అని ఏడిపిస్తాడు. బాలరాజు చిన్నితో మమల్ని అక్కడ తల్లిదండ్రులుగా చూడొద్దు అని అమ్మా నాన్న అని పిలవొద్దు అని చెప్తారు. చిన్ని కావేరి ఫంక్షన్‌కి వెళ్లిన తర్వాత బాలరాజు ఆఫ్ టికెట్‌తో మేం ముగ్గురం సంతోషంగా ఉంటామారా.. ఆ దేవా మమల్ని వదులుతాడా. అని బాధ పడతాడు. దేవుడు ఉన్నాడు అన్నా మీ ముగ్గురు సంతోషంగా ఉంటారు అని ఆఫ్ టికెట్ అంటాడు. దేవా, నాగవల్లి రావడంతో మహి చూసి ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని అంటాడు. మహిని నాగవల్లి రెడీ అవ్వమని చెప్తే చిన్ని వాళ్లు వస్తే రెడీ అవుతాను అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!