Chinni Serial Today Episode మహి మీద నీకు ప్రేమ లేదు అని వరుణ్ చెల్లిని అనడంతో అది నిరూపించుకోవడానికి శ్రేయ చేయి కోసుకుంటుంది. మహితో బావ నీకు చిన్ని అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలీదు కానీ నువ్వు అంటే నాకు చచ్చేంత ఇష్టం. అందుకే నా ప్రేమని నిరూపించుకోవడానికి నేను చావడానికి కూడా నేను వెనకాడను. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రపంచం. నీ ప్రపంచం తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. ఐలవ్యూ బావ.. ఐలవ్‌యూ సోమచ్. నీ విషయంలో నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయ్. ఒకటి నిన్ను పెళ్లి చేసుకోవడం రెండు నన్ను నేను చంపుకోవడం అంతే అని చెప్పి శ్రేయ వెళ్లిపతుంది.
దేవా మహితో నీ మరదలికి నువ్వు అంటే ఎంత ఇష్టమో చూశావా ప్రేమ మనుషుల్ని బతికించాలి కానీ చంపకూడదు అని చెప్తాడు. మధు నిశ్చితార్థానికి రెడీ అవుతుంది. మహి షర్ట్ చూసి ఏడుస్తుంది. ఫోన్ చెక్ చేస్తుంది. ఇంతలో మ్యాడీ 20కి పైగా కాల్స్ చేసుంటాడు. మధు చూసి మ్యాడీ ఇన్నిసార్లు చేస్తున్నాడేంటి? పెళ్లి సంబంధం ఏమైందో అడగటానికి చేసుంటాడు. నేను మాట్లాడితే ఈ పెళ్లి వద్దని అంటాడు. వద్దులే మాట్లాడకపోవడమే మంచిది అనుకుంటుంది. ఇంతలో మళ్లీ మాట్లాడకపోతే ఏం అనుకుంటాడో అని మాట్లాడుదామని కాల్ చేస్తుంది. ఇంతలో తల్లి వచ్చి తీసుకెళ్లిపోతుంది.
మధు తల్లిదండ్రులు తాంబూలాలు తీసుకుంటారు. మూడు రోజుల్లో పెళ్లి అని చెప్తారు. మధు, మధు తల్లిదండ్రులు కూడా షాక్ అయిపోతారు. అబ్బాయి సింగపూర్ వెళ్లిపోవాలి అందుకే అమ్మాయిని కూడా పంపించాలని 3 రోజుల్లో పెళ్లి ఏర్పాటు చేశామని అంటారు. మధు ఏడ్చేస్తుంది. అబ్బాయి తల్లి మధుతో ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మా ఇప్పుడు కాకపోతే మళ్లీ 6 నెలల వరకు ముహూర్తం లేదు అంత ఆలస్యం అయితే ఎవరి మనసు ఎలా మారుతుందో తెలీదు కదా అని అంటుంది. మొదటి శుభలేక మధుతో కలిసి దేవుడి దగ్గర పెట్టమని కొడుకుతో చెప్తే ఆ అబ్బాయి తల్లిదండ్రుల దీవెన తీసుకోవాలని మధుని పిలుస్తాడు.
మధు దీవెన తీసుకోవడానికి వెళ్తూ ఆ అబ్బాయిని మహిలా ఊహించుకొని సంబర పడిపోతుంది. చంటి మధుతో అక్క ఈరోజు కాలేజ్‌కి వెళ్లాలి అన్నావ్ టైం అయిపోతుందని అంటే నేను వెళ్లి డ్రాప్ చేస్తానని అబ్బాయి అంటాడు. కాలేజ్ నుంచి కూడా నేనే రిసీవ్ చేసుకుంటా అని అంటాడు. అందరూ మధుని వెళ్లమని చెప్తే మధు చీర మార్చుకొని వస్తానని చెప్తుంది. నాగవల్లి ఫోన్ మాట్లాడుకుంటూ కిందకి వస్తుంది. అప్పుడే అనుకోకుండా పేపర్ చూసి అందులో చిన్ని వేసిన సీతాకోకచిలుక డ్రాయింగ్ ఉంటుంది అది చూసి పేపర్ చూస్తుంది. ఈబొమ్మ గీసిన వారి ఆచూకి ఈ కింది నెంబరు తెలియజేయండిఅని యాడ్ చూసి షాక్ అయిపోతుంది. దేవాకి చూపిస్తుంది. మహి వాడి ప్రయత్నంలో వాడు ఉన్నాడు. వాడి ప్రయత్నం ఫలించకూడదు అని అనుకుంటారు. ఇంతలో మహి కిందకి వస్తాడు.
మహి ఇద్దరికీ విష్ చేస్తాడు ఇద్దరూ రెస్పాండ్ అవ్వరు. ఏమైంది అని మహి అడిగితే పేపర్ చూసి ఏంటి ఇది అని అడుగుతాడు దేవా. నా చిన్నిని నేను వెతుక్కోవాలి కదా డాడీ. నాకు ఇచ్చిన గడువు చాలా తక్కువ అందుకే కనిపించిన ప్రతీ దారిలో వెళ్లిలి అనిపించిన ప్రతీ ప్రయత్నం చేయాలి అని అంటాడు. పదేళ్లలో లేనిది ఇప్పుడు ఎలా తన ఆచూకి దొరుకుతుందని దేవా అంటే దానికి మహి ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడు ఈ బొమ్మ దొరికింది కదా చిన్ని నా చుట్టే ఉందని అంటాడు. నీకు ఇచ్చిన గడువులో 20 రోజులు అయిపోయింది. ఇంకా 70 రోజులు ఉంది ఈ లోపు చిన్ని దొరకకపోతే శ్రేయని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని వల్లి అంటే జరగదు శ్రేయ నా పెళ్లి జరగదు. శ్రేయ నువ్వు కూడా నా మీద ఆశలు పెంచుకోకు. చిన్ని దొరక్క నేను ఆ బాధ అనుభవిస్తున్నా నువ్వు ఆ బాధ అనుభవించకూడదు అని చెప్తున్నా అంటాడు. శ్రేయ దేవా, వల్లితో బావ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి బావ దక్కకపోతే నేను చనిపోతా అంటుంది. అలాంటి పరిస్థితి రాదు అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఇక మహికి చిన్ని అని ఓ నెంబరు నుంచి కాల్ వస్తుంది. చిన్ని అనే ట్రూకాలర్‌లో పేరు చూసి మహి తన చిన్నినేమో అని హ్యాపీగా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.