Chinni Serial Today Episode వరుణ్ తల్లితో మహి బావకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా పెళ్లి గురించి ప్రకటిస్తే బావ ఎలా ఫీలవుతాడు ఒకసారి చెప్దామని వరుణ్ అంటాడు. దానికి వసంత అవసరం లేదు మీ అత్తయ్య చెప్పకుండానే అనౌన్స్ చేద్దామని చెప్పింది నువ్వు దీని గురించి మాట్లాడినా మహికి చెప్పినా నా మీద ఒట్టే అని వసంత కొడుకుకి చెప్తుంది. ఒట్టేసి అమ్మ నా నోరు కట్టేసింది మహి బావ వస్తే ఎంత గొడవ జరుగుతుందో అని వరుణ్ బాధ పడతాడు.
మధుమిత ఫ్యామిలీ మొత్తం మహి, రాహుల్‌లకు భోజనం వడ్డిస్తారు. వంటలన్నీ గుమగుమలాడేస్తున్నాయని వరుణ్ అంటే ఈ వంటలన్నీ మధునే చేసిందని స్వరూప చెప్తుంది. మహి సుబ్బుతో అంకుల్ ఎందుకైనా మంచిది అంబులెన్స్‌ని పిలవండి మధు చేసింది అంటున్నారు రిస్క్ అవసరమా అని అంటాడు. మధు మందు టేస్ట్ చేసి తర్వాత నచ్చకపోతే హోటల్ నుంచి తీసుకొస్తానని అంటుంది. మహి సరే అని తింటాడు. మహి అలాగే ఉండిపోతే సుబ్బు అంబులెన్స్ తెప్పించాలా అంటే తెప్పించమని మహ అంటాడు అందరూ షాక్ అయిపోతారు. నా వంట బాలేదా అని మధు అంటే అమృతంలా ఉందని ఎక్కువ తినేస్తాం కాబట్టి కడుపు నొప్పి వస్తుంది హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తుందని మహి అంటాడు. ఇక మహికి మధు రొయ్యిల కూర వేస్తే వద్దు అని నా కోరిక నెరవేరాలి అని నాకు ఇష్టమైనా రొయ్యల కూర తినడం లేదని అంటాడు. పెరుగన్నంలో అరటి పండు కలుపుకొని తినడం కూడా మధు మహికి నేర్పిస్తుంది. లొట్టేలేసుకొని మహి తింటాడు.
మహి చంటికి ఫోన్ ఇచ్చి ఫొటో తీయమని చెప్తాడు. మరోవైపు నాగవల్లి, దేవేంద్రవర్మలు పార్టీలో అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఇక శ్రేయ సోషల్ మీడియా చూస్తూ మహి మధు వాళ్ల ఇంటికి వెళ్లినట్లు దిగిన ఫొటో చూసి షాక్ అయిపోతుంది. దీని ఇంటికి వెళ్లాడా.. కింద కూర్చొని తిన్నాడా వెంటనే అత్తయ్యకి చెప్పాలి అనుకుంటుంది. నాగవల్లి వరుణ్‌ని పిలిచి మహికి కాల్ చేయమని అంటుంది. శ్రేయ నాగవల్లి దగ్గరకు వచ్చి మహి ఫొటో చూపిస్తుంది. బావ దాని ఇంటికి లంచ్‌కి వెళ్లడం ఏంటి అత్తయ్య అంటుంది. వల్లి మనసులో నువ్వేం టెన్షన్ పడకు శ్రేయ దాన్ని ఎలా కట్ చేయాలో నేను కట్ చేస్తా అంటుంది. నాగవల్లి మనసులు చిన్ని నుంచి మహి మనసు ఎలా మార్చాలా అనుకుంటే ఈ మధు ప్రాబ్లమ్ ఒకటి మొదలైంది ముందు చిన్ని సంగతి తేల్చి తర్వాత మధు సంగతి చూస్తా అనుకుంటుంది.
మధు మహికి తన ఇళ్లు మొత్తం చూపిస్తుంది. అక్కడే చిన్ని చిన్నప్పటి ఫొటో ఉంటుంది కానీ మహి చూడడు. మహికి మధు తన రూమ్ కూడా చూపిస్తుంది. అక్కడ కూడా చిన్ని ఫొటోలు గోడకే ఉంటాయి కానీ మహి చూడడు. మహి అన్నీ చూస్తాడు కానీ అక్కడే ఉన్న పెళ్లి కొడుకు బొమ్మ చిన్నప్పడు ఇచ్చిన గడియారం మాత్రం చూడడు. ఇక మధు గదిలో ఉన్న నెమలి కన్ను కింద పడిపోవడంతో మహి పట్టుకుంటాడు. అది చిన్నప్పుడు మహి, చిన్నిలు కలిసి పట్టుకున్న నెమలి పింఛం గుర్తు చేసుకుంటారు. మహి చిన్నికి కృష్ణుడు అంటే ఇష్టమా అంటాడు. అవును అని మధు అంటుంది. మధు కూడా తనకు నెమల పింఛం అంటే ఇష్టమని అంటే మధు నెమలి పింఛం మహికి ఇస్తుంది.
మహి వాళ్లు అందరికీ చెప్పి బయల్దేరుతారు. మహి మధుకి సారీ చెప్తుంది. సారీ ఎందుకు అని మహి అడిగితే మొదట్లో నీతో చాలా గొడవలు పడ్డాను కదా అని అంటుంది. పద్దూ మధుని ఆటపట్టిస్తుంది. ఇక రాహుల్ మహితో అందరికీ 3 అడుగుల దూరం పాటిస్తావు కదా మహితో ఏంట్రా షేక్ హ్యాండ్‌లు ఇచ్చేస్తున్నావ్ అంటాడు. ఏమోరా అని మహి అనేస్తాడు. ఇక బాలరాజుకి ఓనర్ 5 వేలు ఇచ్చి బట్టలు కొనుక్కోమని అంటాడు. నీకు ఎవరూ లేరా అని ఓనర్ అడిగితే నాకు భార్య కూతురు ఉన్నారు వాళ్లని వెతుకుతున్నా అంటాడు. నువ్వు మంచోడివి బాలరాజు నీకు మంచే జరుగుతుంది అని చెప్తాడు. పక్కనే ఉన్న గుడి గురించి చెప్తాడు. మహి ఇంటికి వెళ్లి వరుణ్తో ఏంటి బావ ఇంత హడావుడి ఉంది అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.