Meghasandesam Serial Today Episode: అకాడమీ ఓపెనింగ్ ను భూమి తనకు కాబోయే భర్త ఉదయ్ చేత చేయిస్తే ఇక గగన్ గాడి ఇగో మీద కొట్టే ఆఖరి దెబ్బ అవుతుంది ఇంక వాడు కోలుకోడు పిన్ని నువ్వు వద్దు నీ అకాడమీ వద్దు అని పారిపోతాడు అని చెప్తుంది అపూర్వ. మరోవైపు చెర్రి దగ్గర ఉంటుంది భూమి.
భూమి: అలా వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటి చెర్రి..
సుజాత: ఓపెనింగ్ రోజే అకాడమీ క్లోజింగ్ రోజు అవుతుంది.
భూమి: అలా జరిగితే నా పరువు పోతుంది అంతేనా..? గవర్నమెంట్ అకాడమీ ఇచ్చిన లైసెన్స్ పోతుంది. నేను సాధించాలి అనుకున్న అమ్మ ఆశయం కూడా దూరం అయిపోతుంది చెర్రి.
చెర్రి: అబ్బా పెద్ద చిక్కే పడింది భూమి.
భూమి: చెర్రి ఏదో ఒకటి చేసి నువ్వు అకాడమీని మీ అన్నయ్య చేతుల మీదుగా ఓపెన్ చేయించాలి. ఆయన గారిది లక్కీ హ్యాండ్ చెర్రి.
చెర్రి: అవునా..?
భూమి: అంతే కాదు ఆయనతో ఓపెన్ చేయించానన్న ఆనందం నాకు మిగులుతుంది.
చెర్రి: నీకు మిగులుతుంది. అంతా బాగానే ఉంది కానీ అన్నయ్యతో అకాడమీ ఓపెన్ చేయించడం ఎలా..? ఇది ఆలోచించు..
అని చెప్పగానే భూమి ఆలోచిస్తుంది. మరోవైపు అపూర్వ, సుజాత నవ్వుకుంటుంటారు. ఇంకోవైపు గగన్ రెడీ అయి కిందకు వస్తాడు.
శివ: బావ నేను రెడీ బావ.
గగన్: ఏంటి బావనా..?
పూరి: భూమిని అక్కా అన్నందుకు వీడు నిన్ను బావ అని పిలుస్తున్నాడు అన్నయ్య. వీడు అలా పిలుస్తుంటే నాకు పరమ ఇరిటేటింగ్ గా ఉంది అన్నయ్య. కాస్త ఆ పిలుపు ఆపమని చెప్పు అన్నయ్య.
గగన్: పూరి చెప్తుంటే.. నాక్కూడా కరెక్టే అనిపిస్తుంది శివ. ఇక మన లైఫ్‌లో భూమి అనే మనిషి లేదు. అంటే నీకు భూమి అనే అక్క లేదు. నువ్వు ఇంక నన్ను బావ అని పిలవకు. అన్నయ్య అని పిలవవచ్చు కదా..?
శివ: అంటే బావమరిది బావ బతుకు కోరుకుంటారు అంటారు కదా బావ. నువ్వు నాకు బతుకునిచ్చావు నేను నీ బతుకుని కోరుకుంటాను కదా..?
శారద: మంచి మాట చెప్పాడు నాన్న. అయినా అలవాటు అయిపోయిన వరసలు ఇప్పుడు కొత్తగా మార్చుకోవడం ఎందుకు..?
గగన్: ఈ టాఫిక్ మన పూరినే రైజ్ చేసింది అమ్మా..
శారద: చేస్తుందిరా..? శివ వచ్చినప్పటి నుంచి శివా అంటే దీనికి పడటం లేదు. శివ గురించి మనకు ఏదో ఒకటి ఎక్కిస్తూనే ఉంటుంది.
పూరి: అమ్మా ఇది మరీ టూ మచ్.. నువ్వు శివను బాగా సపోర్టు చేస్తున్నావు. వాడు నన్ను చపాతీ అన్నాడు. మరి దానికి ఏమంటావు.
శారద: చూశావా..? మళ్లీ ఇంకో కంప్లైంట్. మేము నిన్ను ముద్దుగా పూరి అని పిలుస్తున్నాం. వాడు నిన్ను ఫస్ట్ టైం చూడగానే వాడికి నువ్వు చపాతీలా కనిపించావు. ఒకటే ఇంట్లో ఉంటున్నాం. సర్దుకుపోవాలే..?
అని శారద అనగానే పూరి అలిగి వెళ్లిపోతుంది. గగన్ వెంటనే డాన్స్ అకాడమీ ఓపెనింగ్ కు వెళ్దాం రెడీ అవ్వమని చెప్తాడు. దీంతో శారద తను రానంటుంది. గగన్, శివ మాత్రమే ఓపెనింగ్ క వెళ్తారు. అకాడమీ దగ్గరకు గగన్ వెళ్లగానే.. అప్పుడే ఉదయ్ ని తీసుకుని శరత్ చంద్ర వస్తాడు. ముగ్గురూ లోపలికి వెళ్తారు.
పంతులు: ఎవరి చేత ప్రారంభం చేయించాలి అనుకుంటున్నారో వారి చేత చేయించండి.
భూమి రిమోట్ తీసుకుని వెళ్తుంటే.. అప్పుడే గగన్‌కు కాల్ వస్తుంది. గగన్ పక్కకు వెల్లిపోతాడు. వెంటనే శరత్ చంద్ర ఉదయ్‌ని వెళ్లమని చెప్తాడు. ఉదయ్ వెళ్లి రిమోట్ తీసుకుని ఆన్ చేస్తే ఆన్ కాదు. రిమోట్ చూడమని భూమి చెర్రికి చెప్తుంది. అప్పటికే రిమోట్ మార్చిన చెర్రి తన దగ్గరున్న వర్జినల్ రిమోట్ గగన్‌కు ఇచ్చి ఉదయ్ చేతిలో ఉన్న డమ్మీ జేబులో వేసుకుంటాడు. వర్జినల్ రిమోట్ తీసుకుని అకాడమీ ఓపెన్ చేస్తాడు గగన్. భూమి, చెర్రి హ్యాపీగా ఫీలవుతారు. శరత్, అపూర్వ, ఉదయ్, సుజాత షాక్ అవుతారు. గగన్ ఆశ్చర్యపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!