Chinni Serial Today Episode సత్యంబాబు బాలరాజుని కొట్టేయడంతో కావేరి రాజుకి ఫస్ట్‌ ఎయిడ్ చేస్తుంది. చిన్ని చాలా బాధ పడుతుంది. చిన్ని అమ్మానాన్నల ఇద్దరికీ ముద్దు పెట్టమని అడుగుతుంది. ఇద్దరూ చిన్నికి ముద్దు పెడుతుంది. ఇక రాజు కావేరికి థ్యాంక్స్ చెప్తాడు. కావేరి, చిన్ని వెళ్లిపోతారు.  

నా గిఫ్ట్ ఎక్కడ..

కావేరి, చిన్నిలను సత్యంబాబు చూస్తూ చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిలో తల్లీకూతుళ్లని చూస్తున్నా అనుకుంటాడు. ఇక సరళ వచ్చి మన చిన్ని మీద ఆ టీచరమ్మ ఎంత ప్రేమ కురిపిస్తుందో చూడు అంటుంది. ఇక సరళ గిఫ్ట్ తీసుకువచ్చావా అని అడుగుతుంది. లేదని కావేరి చెప్తే ఇంటి ఓనర్‌కి రెంట్ ఇస్తే సరిపోదు. నేను చెప్పిన పని చేయాల్సిందే అంటుంది. గిఫ్ట్ ఆర్డర్ ఇచ్చి వచ్చాం వస్తుందని ఉష అంటుంది. 

నాకు అంతా తెలుసు ఆంటీ..

ఉషగా ఉన్న కావేరి రాజుని తన అన్నయ్య కొట్టడం గుర్తు చేసుకొని బాధ పడుతుంది. భారతి రావడంతో భారతిని వాటేసుకొని ఏడుస్తుంది. ఈ రోజు శ్రేయాభిలాషిని కలిశాను అని చెప్తుంది. ఎవరిని కలిశావని భారతి అడిగితే మీ అబ్బాయి బాలరాజుని కలిశాను నన్ను కాపాడింది కాపాడుతుంది మీ అబ్బాయే అని తెలుసుని ఉష చెప్తుంది. భారతి చాలా సంతోషిస్తుంది. నీకు సాయం చేసింది తానే అని తెలిస్తే నువ్వు అర్థం చేసుకుంటావో లేదో అని చాలా బాధ పడ్డాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీ ఇద్దరూ కలిసి పోయారు. నా సొంత కోడలు ఎదురుగానే ఉన్నా పరాయి దానిలా చూశానని అని ఏడుస్తుంది. 

మీ కొడుకుని నా భర్తలా చూడలేను.. 

దాంతో కావేరి మిమల్ని కూడా నేను నా అత్తయ్యలానే చూసుకుంటా ఆంటీ కానీ మీ అబ్బాయిని మాత్రం భర్తలా చూసుకోలేను అంటుంది. బాలరాజు మారిపోయాడు కదామ్మా అలా అంటావేంటి అని భారతి అడిగితే నా తలరాతని నేను నమ్మలేను ఆంటీ చిన్ని కోసం మాత్రం ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. చిన్ని కోసం ఆయన మన ముగ్గురం ఈ ఊరు వదిలి వెళ్లిపోదాం అంటే అందుకే ఆలోచించుకోవడానికి టైం అడిగాను అంటుంది. ఇద్దరూ త్వరలోనే కలిసిపోవాలని భారతి కోరుకుంటుంది.

రాజుకి కాల్ చేసిన కావేరి..

సరళ, లోహిత రెడీ అయి వస్తే చందు చాలా బాగున్నారని అంటాడు. చెల్లిని ఆటపట్టిస్తాడు. కావేరి కూడా రెడీ అవుతుంది. నాగవల్లి పిలిచింది అంటే కారణం ఏమై ఉంటుంది. వెళ్లాలా వద్దా అని అనుకుంటుంది. రాజుకి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. కాల్ చేస్తుంది. నాగవల్లి వాళ్లు వచ్చి పిలిచారు అని చెప్తుంది. అన్నయ్య వాళ్లు వెళ్తున్నారా నేను ఏం చేయాలో తెలీడం లేదని అంటుంది. దాంతో బాలరాజు నిన్ను పిలిచారు అంటే ఏమైనా ప్లాన్ చేసుంటారు. అలా అని నువ్వు వెళ్లకపోతే చిన్నికి అనుమానం వస్తుంది. దేవేంద్ర వాళ్లు కూడా నువ్వే కావేరి అనుకుంటారు. నువ్వు వెళ్లు కానీ చాలా జాగ్రత్తగా ఉండు అంటాడు. ఓకే బాల అని కావేరి అంటుంది. బాలరాజు చాలా సంతోషపడతాడు. 

దేవా ఏదో ప్లాన్ చేసే ఇలా పిలిచాడు..

బాలారాజు దేవేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కావాలనే ఏదో ప్లాన్ చేసి ఇలా పిలిచుంటాడని అనుకుంటాడు. ఇంతలో ఆఫ్‌ టికెట్ వచ్చి కావేరిని కోనేటిలో తోసేసిన అమ్మాయి దొరికిందని చెప్తాడు. దాంతో రాజు వెళ్లాడు. ఆమెను ప్రశ్నిస్తాడు. నాగవల్లి డబ్బు ఇచ్చి అలా చేయమని చెప్పిందని ఆ అమ్మాయి చెప్తుంది. కావేరిని ఆ భర్త్‌డే పార్టీకి వెళ్లమని తప్పు చేశానా అని బాలరాజు అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!