Prema entha madhuram september 18th: ఈరోజు ఎపిసోడ్ లో నిన్ను అడ్డం పెట్టుకొని ఆర్య వర్ధన్ నీ ఎలా ఆడిస్తామో చూడు అని మాన్సి అంటుంది.


అను: మహా అయితే ఏం చేస్తావ్ పెళ్లి చేసుకోవాలనుకుంటావ్ అంతే కదా. అని ఛాయాదేవితో అనగా ఆ మాటకి ఛాయాదేవి మాన్సిలు ఇద్దరు ఒకరి ముఖాలకు చూసుకుంటారు.


ఛాయాదేవి: ఈ విషయం నీకెలా తెలుసు?


అను: మీరు నా విషయాలు ఎలా తెలుసుకున్నారు నేను కూడా మీ విషయాలు అలాగే తెలుసుకున్నాను. నువ్వు పెళ్లి గురించి ప్రపోజ్ చేయడం తెలుసు ఆర్య సార్ రియాక్షన్ ఏంటో కూడా తెలుసు. కుటుంబంలో అందరి దగ్గర చీ కొట్టుకున్నా సరే మళ్లీ అన్ని ఆశలు పెట్టుకుంటున్నావ్.


 ఆర్య వర్ధన్ జోలికి వెళ్లే అర్హత కూడా నీకు లేదు ఇంక పెళ్లి అంటున్నావ్. చూడు మాన్సి ఆ ఇంటి గురించి తెలిసిన నువ్వు ఇలాంటి మనుషులతో చేతులు కలిపి చాలా తప్పు చేస్తున్నావు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఎప్పటికైనా మంచే జరుగుతుంది ఇలాంటి వాళ్లతో స్నేహం చేస్తే ఎప్పటికైనా నీ పతనానికి నువ్వే దారి తీసుకునే దానివవుతావు జాగ్రత్త.


ఛాయాదేవి: టైం ఎప్పుడు ఎవరి చేతిలో ఉంటుందో తెలీదు. ఈరోజు నీది అయి ఉండొచ్చు కానీ రేపు నాదవుతుంది. ఈరోజు నీది అనుకున్న నీ భర్త రేపు నా వాడు అవుతాడు.


అయినా నువ్వు నీ మొగుడిని వదిలేసావు ఖాళీగా ఉన్న ల్యాండ్ ని కబ్జా చేయడమే నా పని అందుకే కబ్జా చేస్తాను. ఎలాగైనా నిన్ను వాడుకొని ఆర్య నీ నా వాడిని చేసుకుంటాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు కదా మళ్ళీ కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఛాయాదేవి, మాన్సీలు.


తర్వాత పిల్లలు అమ్మ మేము ఫ్రెష్ అయిపోయాము అని అనగా అను లోపలికి వస్తుంది. ఏది ఏమైనా నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను అని మనసులో అనుకుంటుంది అను.


మరోవైపు ఆర్య, నీరజ్, అంజలీలు హాల్లో కూర్చుని ఉండగా, ఆర్య ఫైల్స్ అన్ని చూస్తూ ఉంటాడు.


అంజలి: ఆ లాండ్ అంతా నా పేరు మీదే ఉండాలి సార్ అది ఎలాగ ఛాయాదేవి వైపు వెళ్ళిందో నాకు తెలియడం లేదు.


ఆర్య: వీటన్నిటి వెనుక ఉన్నది మదన్. నువ్వు ఇక్కడికి రాకముందు మీ పేరెంట్స్ మదన్ కి పవర్ ఇచ్చారు. వాడు దాన్ని దుర్వినియోగం చేశాడు అదే సమయంలో ఛాయాదేవి తనతో చేతులు కలిపి కుట్ర పన్నింది.


మరేం పర్వాలేదు జెండే దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నాడు. వన్స్ వి గెట్ ద ఇన్ఫర్మేషన్ వీ విల్ ఫినిష్ థెం.


అంజలి: నా సొంత అన్నయ్య కన్న ఎక్కువగా చూసాను వాడిని వాడు మా ఫ్యామిలీకి ఇలా చేస్తాడు అని అసలు అనుకోలేదు. సారీ సార్ మీకు హెల్ప్ చేద్దామని చెప్పి మీకు కొత్త సమస్యలు తెస్తున్నాను.


నీరజ్: ఇట్స్ ఓకే అంజలి నీకు మాత్రం ఏం తెలుసు నీ వెనుక ఇంత జరుగుతుందని.


ఆర్య: నువ్వు వీక్ గా ఉంటే ఛాయాదేవిని ఎదుర్కోలేవు స్ట్రాంగ్ గా లేకపోతే తను అందరినీ నాశనం చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తాది.


అంజలి: ఓకే సార్ థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అని అంటుంది.


ఆ తర్వాత రోజు ఉదయం అను పిల్లలు ఇద్దరినీ స్కూల్ దగ్గరికి దింపి, నేను కాకుండా మీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళతో వెళ్ళొద్దు. ఏం చెప్పినా వినొద్దు అని జాగ్రత్తలు అని చెప్తూ ఉంటుంది.


అక్కి: ఎందుకమ్మా ఇన్ని జాగ్రత్తగా చెప్తున్నావ్?


అభయ్: అమ్మ ఏం చెప్తుందో అది చెయ్యు అక్కి. అమ్మ మన కోసమే కదా చెప్తుంది.


అను: ఊరికే చెప్పానమ్మా అని చెప్పి పిల్లలు ఇద్దరినీ స్కూల్ లోపలికి దింపుతుంది. తర్వాత ఆటో లో తిరిగి వెళుతుండగా తనకి ఒక ఫోన్ వస్తుంది.రాధమ్మ మీ పిల్లలు ఇద్దరినీ స్కూల్ బస్సు గుద్దేసింది. రక్తంతో వాళ్ళు అక్కడ పడిపోయారు.


 అని చెప్పగా కంగారుపడిన అను వెంటనే ఆటో వాడిని వెనక తిప్పమని చెప్తుంది. పరిగెత్తుకుంటూ స్కూల్ లోపలికి వెళ్లి ఆ టీచర్ తో ఏడుస్తూ పిల్లలు ఎక్కడ? రక్తం, బస్సు గుద్దేసింది అని సగం ముక్కలతో మాట్లాడుతుంది. ఇంతలో పిల్లలు ఇద్దరు రూమ్ లో నుంచి బయటకు వస్తారు. వాళ్ళని చూసిన అను వెంటనే వెళ్లి హద్దుకుంటుంది.


అక్కి: ఏమైందమ్మా అంత కంగారు పడుతున్నావు? నువ్వే కదా మమ్మల్ని దింపావు భయపడొద్దు. అని చెప్పగా వాళ్ళని గట్టిగా హద్దుకొని మీకు పాకెట్ మనీ ఇవ్వడం మర్చిపోయాను కదా అని డబ్బులు జేబులో పెట్టి, సాయంత్రం వచ్చి నేనే తీసుకెళ్తాను అని వాళ్ళిద్దరిని లోపలికి తర్వాత తనకి మళ్ళీ ఒక ఫోన్ వస్తుంది.


అను: ఎవరు నువ్వ ఎందుకు ఇదంతా చేస్తున్నావు?


ఛాయాదేవి: నేనే ఇదంతా చేశాను. ఒక్కసారి భయమంటే ఏంటో తెలిసిందా ఈరోజు అబద్ధం అయింది రేపు నిజమవ్వచు. ఆర్య ప్రాణాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రాణాలే లేకపోతే ఆర్య నా వాడు అవుతాడు కదా. 


ఇప్పటికైనా ఒప్పుకో ఆర్య నా సొంతమవుతాడు అని లేకపోతే మీ శారదా దేవి గారు గుడికి వెళుతున్నప్పుడు అలాగే దేవుడి దగ్గరికి వెళ్లిపోవచ్చు, నీ మరిది నీరజ్ నీ ఒక లారీ సడన్ గా వచ్చి గుద్దేయవచ్చు. నీ కొత్త తోటి కోడలు అంజలిని రౌడీలు కిడ్నాప్ చేయొచ్చు ఏదైనా జరగొచ్చు ఇది కేవలం శాంపిల్ మాత్రమే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.


అను: అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది అను.


మరోవైపు ఆర్య, జెండే లు అంజలి ఫైల్స్ గురించి చూస్తూ ఉండగా ఆర్య కి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో ఒక అమ్మాయి వెనక్కి తిరిగి ఉండగా తనకి చేతులు కట్టేసి ఉంటాయి.ఇంతలో ఛాయాదేవి ఆర్య కి ఫోన్ చేస్తుంది.


ఛాయాదేవి: ఆ వీడియోలో ఉన్నది అను నే. నువ్వు కాని పెళ్లికి ఒప్పుకోకపోతే తన ప్రాణాలు అక్కడికి అక్కడే పోతాయి. చెప్పాను కదా నేను తలచుకుంటే ఏవైనా చేస్తాను అని. నాకున్న కనెక్షన్స్ తో అనుని పట్టుకొని ఈ స్థితికి తీసుకొని వచ్చాను. ఇప్పటికైనా మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు.


ఆర్య: చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ ఛాయాదేవి. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది అసంభవం.


ఛాయాదేవి: అయితే నీకు ఇంకొక వీడియో కూడా వస్తుంది అది చూడు అని అనగా ఆ వీడియోలో అనుని వెనుక నుంచి కట్టేసిన తర్వాత చాలామంది పెద్దపెద్ద రోడ్ లతో కొడుతూ ఉంటారు. దాని ఆర్య చూస్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: Guppedanta Manasu September 18th: బాలయ్య స్టైల్ లో ఏంఎస్ఆర్ కి రిషి అదిరే వార్నింగ్- శైలేంద్ర గురించి జగతి నిజం బయటపెడుతుందా?


Join Us On Telegram: https://t.me/abpdesamofficial