Brahmamudi Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఈరోజు మీరు ఎవరు చెప్పినా నేను వినను అంటూ స్వప్నని బయటికి గెంటెయ్యబోతోంది. ఇంతలో స్వప్న స్పృహ తప్పిపోతుంది.


రుద్రాణి : మళ్లీ మరో కొత్త నాటకం మొదలుపెట్టింది. నాలుగు పీకి బయటకు నెట్టేస్తే అదే కళ్ళు తెరుస్తుంది.


అందుకు సరే అంటాడు రాహుల్.


రాజ్ : రాహుల్ ని ఆగమని చెప్పి తను చేసింది తప్పే కావచ్చు కానీ స్పృహలో లేని ఆడదాన్ని బయటకు నెట్టేయవద్దు. ముందు తనకి ట్రీట్మెంట్ చేయిద్దాం తర్వాత మీ ఇష్టం అని చెప్పి డాక్టర్ కి ఫోన్ చేస్తాడు.


డాక్టర్ వచ్చి స్వప్నని టెస్ట్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్తుంది.


రుద్రాణి: మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టిందా అయినా నువ్వు ఎంతకీ అమ్ముడు పోయావు అని డాక్టర్ని అడుగుతుంది.


డాక్టర్: ఇంతకుముందు ఏ డాక్టర్ అలా చేసిందో నాకు తెలియదు గానీ అందరూ డాక్టర్లు అలా ఉండరు. స్వప్న ప్రెగ్నెంట్ అనేది నిజం నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అంటూ వెళ్ళిపోతుంది.


రాహుల్: తను ప్రెగ్నెంట్ అయితే అయి ఉండవచ్చు కానీ ఆ బిడ్డకి తండ్రిని మాత్రం నేను కాదు.


అలా అనటంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.


స్వప్న: రాహుల్ చెంప పగలగొడుతుంది. ఇంతసేపు మీరు ఏం మాట్లాడినా ఊరుకున్నాను ఎందుకంటే అందులో నా తప్పు ఉంది అంతేకానీ నా క్యారెక్టర్ మీద నిందలు వేస్తే ఊరుకోను.


రాహుల్: నీకు ఎంత ధైర్యం, ఇన్ని తప్పులు చేసి దొరికిపోయాక కూడా ఇంకా బుకాయిస్తున్నావా?


స్వప్న: నేను రిచ్ గా బ్రతకాలి అనుకున్నాను కానీ ఎలా పడితే అలా బ్రతకాలి అనుకోలేదు. పెళ్లికి ముందు నేను ఎవరి మీద మనసు పడలేదు పెళ్లయిన తర్వాత కూడా నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు.


రుద్రాణి : నువ్వు వాదించినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. ఎవరితోనో చేసిన పాపం నా కొడుక్కి అంటగట్టాలని చూస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ లెస్ ఆడదాన్ని ఈ కుటుంబం ఎలా భరిస్తుంది.


స్వప్న: భర్త వదిలేసిన మిమ్మల్ని ఈ కుటుంబం ఆదరిస్తుంది అలాంటిది నన్ను ఎందుకు ఆదరించదు. అయినా ఇంతవరకు వచ్చారు కాబట్టి ఈ బిడ్డ మీ బిడ్డ అని నిరూపించుకోవడానికి నేను ఎంత దూరం అయినా వెళ్తాను. అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను. నేను రెడీ, రాహుల్ నువ్వు రెడీయా అంటూ సవాల్ విసురుతుంది.


సీతారామయ్య : ఒక ఆడపిల్ల అంత గట్టిగా, అంతా కాన్ఫిడెంట్ గా తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది అంటే అందులో కూడా నిజం ఉండి ఉండవచ్చు నిజా నిజాలు తెలియకుండా నిందలు వేయవద్దు నిజం తెలిసే వరకు ఎలాంటి ముందడుగు వేయడానికి వీల్లేదు అంతవరకు ఓపిక పట్టండి అని తల్లి కొడుకులని మందలించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


ఆ తరువాత గదిలో తన కొడుకు చెంప పగలగొడుతుంది రుద్రాణి.


రుద్రాణి : అదృష్టం అందలం ఎక్కిస్తానంటే బుద్ధి గాడిదలు కాచిందం. నీ జీవితాన్ని ఎవరో నాశనం చేయక్కర్లేదు నువ్వే చాలు అంటూ కోప్పడుతుంది.


రాహుల్: అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. అయినా నన్ను ఎంతసేపని తిడతావు ఈ సమస్య నుంచి గట్టెక్కే ఉపాయం ఆలోచించి.


రుద్రాణి: ఇక చేయటానికి ఏమీ లేదు ఇప్పుడు మనం ఏం చేసినా నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం మనమే అంటారు. ఆ బిడ్డ నీ బిడ్డ కాదు అని రుజువు అయ్యేవరకు నువ్వు తనతో ఎలాంటి గొడవ పడొద్దు.


రాహుల్: తను అంత కాన్ఫిడెంట్గా డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధం అంటుంది ఏం చేయటం.


రుద్రాణి : మామూలు ఆడది తనే అంత చేయగలిగినప్పుడు ఇంత సర్కిల్ ఉన్న మనం ఏమి చేయలేమా? స్వప్న చెప్పింది అబద్ధం అని అందరి ముందు నిరూపిద్దాం. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.