Brahmamudi Serial Weekly Episode: రాజ్‌ను పూర్తిగా తాగుబోతులా మార్చేసి తర్వాత సింపథీతో తాను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది యామిని. అందుకోసం రాజ్‌ అడిగినప్పుడల్లా మందు బాటిల్ ఇస్తుంది. ఫుల్లుగా మందు తాగిన రాజ్‌ రోడ్ల మీదకు వెళ్లి పడిపోతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న కావ్య, రాజ్‌ను చూసి తన కారులో తీసుకెళ్లి యామిని వాళ్ల ఇంట్లో వదిలేస్తుంది. ఇంటికి వెళ్లిన కావ్య రాజ్‌ పరిస్థితి గురించి ఇంట్లో వాళ్లకు చెప్తుంది. దీంతో రాజ్‌ను ఎలాగైనా మార్చాలని అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి నచ్చజెప్పాలని చూస్తారు. కానీ రాజ్‌ వారి మాట వినడు దీంతో ఇద్దరు ఇంటికి వెళ్లిపోతారు.

ఇంటికి వెళ్లాక రాజ్ పరిస్థితి చూసి బాధపడతారు. ఏదో ఒకటి చేసి రాజ్‌ను మార్చాలనుకుంటారు. చివరికి నిజం చెప్పైనా సరే రాజ్‌ను మార్చాలని అపర్ణ డిసైడ్‌ అవుతుంది. మరోవైపు పుల్లుగా మందు తాగుతున్న రాజ్ ను యామిని రెచ్చగొడుతుంది. కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెబితే అప్పుడు కూడా తనను నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పు అంటుంది. రాజ్ కూడా యామిని ఐడియా బాగుందని తనను మాత్రం పెళ్లి చేసుకుంటానని కానీ ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకుంటానని దుగ్గిరాల ఇంటికి వెళ్తాడు.

అందరూ హాల్లో కూర్చుని ఉండగా పుల్లుగా తాగిన రాజ్‌ అందరినీ తిడుతూ కావ్య ఎక్కడుందని అడుగుతాడు. ఇంతలో కావ్య కిందకు రాగానే.. కావ్యన తిడుతూ తనను ఎందుకు మోసం చేశావని అడుగుతాడు. దీంతో కావ్య తాను ఎప్పుడూ రాజ్‌ను ప్రేమించలేదని చెప్తుంది. దీంతో రాజ్ తమ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు గుర్తు చేస్తాడు. తర్వాత జరిగిందేదో జరిగిందని అంతా మర్చిపోదామని.. నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయిపోయాను అని చెప్తాడు రాజ్‌. దీంతో సంతోషిస్తారు. రుద్రాణి, రాహుల్ షాక్‌ అవుతారు. ఇంతలో రాజ్ కానీ ఒక్క కండీషన్ అంటూ కావ్య కడుపులో పెరుగుతున్న తండ్రి ఎవరో చెప్పాలంటాడు. దీంతో అందరూ సైలెంట్‌ గా చూస్తుంటారు. ఇంతలో అక్కడకు యామిని వస్తుంది. తన కడుపులో బిడ్డకు తండ్రెవరో కావ్యకు కూడా తెలియదు ఎందుకంటే తాను ఎప్పుడూ పబ్బుల వెంట తిరిగేది అక్కడ ఎవరితో ఎలా మూవ్ అయిందో తనకే తెలియడం లేదు అంటుంది. దీంతో రాజ్‌ కూడా కావ్యను నిజం చెప్తావా..? యామిని చెప్పిందే నిజం అనుకోవాలా అని అడుగుతాడు. వెంటనే అపర్ణ రాజ్‌ను కొట్టి కావ్య నీ భార్య. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అంటూ జరిగిందంతా చెప్తుంది.

అంతా విన్నాక రాజ్‌ స్పృహ తప్పి పడిపోతాడు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అందరూ ఏడుస్తుంటారు. ఐసీయూలో రాజ్‌కు ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. రెండు రోజుల తర్వాత రాజ్‌ కు అవుటాప్‌ డేంజర్‌ అని డాక్టర్లు చెప్తారు. తర్వాత రాజ్ కళ్లు తెరవగానే కావ్యను అడుగుతాడు. రాజ్ గతం అంతా గుర్తుకు వస్తుంది. అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్తారు. అయితే రాజ్‌కు గతం మర్చిపోయిన తర్వాత ఏం జరిగిందనేది తెలియదు. దీంతో అపర్ణ మెల్లగా మొత్తం జరిగిన విషయం చెప్తుంది. దీంతో రాజ్‌ పైకి కావ్య దగ్గరకు వెళ్లి ఎమోషనల్‌ అవుతాడు. ఇంతటితో గడిచిన వారం బ్రహ్మముడి అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!