Brahmamudi Serial Weekly Episode: కావ్య హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను కలిస్తే కావ్యకు క్యాన్సర్‌ వచ్చిందేమోనని రాజ్‌ భ్రమ పడతాడు. దీంతో హాస్పిటల్‌లో బాధపడుతూ కూర్చుంటాడు. కావ్య, డాక్టర్‌ను కలిసి బయటకు రాగానే రాజ్‌ ఎమోషనల్ అవుతాడు. కావ్య తికమక పడుతుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అడుగుతుంది. రాజ్‌ మీకు క్యాన్సర్‌ అని నాకు తెలిసిపోయింది అంటాడు. కావ్య నిజం చెప్పినా నమ్మడు. ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అపర్ణ, ఇందిరాదేవిలకు నిజం చెప్పి రాజ్‌ బాధపడుతుంటే కావ్య తాను కలిసిన డాక్టర్‌కు ఫోన్‌ చేసి రాజ్‌కు క్లారిటీ ఇస్తుంది. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు.

Continues below advertisement


తర్వాత కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లిన అప్పు తనకు పుల్లగా ఏదైనా తినాలని ఉందని మామిడికాయలు దొరికితే తీసుకురమ్మని చెప్తుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్‌ కాదని కావాలంటే కిచెన్‌లోకి వెళ్లి చింతపండు తిను అని చెప్తూ కళ్యాణ్‌ ఆశ్చర్యపోతాడు. అప్పు… నిజమా అని అడుగుతాడు. అప్పు అని కన్‌ఫం చేస్తుంది. విషయం ఇంట్లో అందరికీ చెప్పాలని కళ్యాణ్‌ కిందకు పరుగెత్తుకొస్తాడు. అందరికీ అప్పు నెల తప్పిందని చెప్తాడు. అందరూ హ్యాఫీగా ఫీలవుతాడు. రుద్రాణి అందరి మధ్య గొడవలు పెట్టాలని ప్లాన్ చేస్తుంది. కానీ అందరూ రుద్రాణినే తిట్టి వెళ్లిపోతారు.


స్వప్న, కనకానికి ఫోన్‌ చేసి అప్పు ప్రెగ్నెన్సీ విషయం, రాజ్ ప్రేమను కావ్య రిజెక్ట్‌ చేసిన విషయం చెప్తుంది. దీంతో కనకం కోపంగా కావ్యను తిడుతుంది. రేపే ఇంటికి వచ్చి దాని సంగతి చెప్తాను అంటుంది. మరోవైపు అప్పు మామిడికాయ ముక్కలు తీసుకెళ్లి కావ్యకు ఇస్తుంటే.. రుద్రాణి చూస్తుంది. కావ్య కూడా నెల తప్పిందా అని అడుగుతుంది. దీంతో అప్పు, కావ్య నాటకం ఆడి రుద్రాణిని పూల్‌ చేస్తారు. అప్పుడే అక్కడకు వచ్చిన ఇందిరాదేవి ఆ రుద్రాణితో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. మరుసటి రోజు కనకం వచ్చి కావ్యను తిడుతుంది. కనకానికి అపర్ణ నిజం చెప్పగానే కావ్య దగ్గరకు వెళ్లి బాధపడుతుంది కనకం.


తర్వాత కావ్య, రాజ్‌ను గుర్తు చేసుకుని బాధపడుతుంటే.. అపర్ణ, ఇందిరాదేవి చూసి కావ్యన ఎలాగైనా రేపటి నుంచి హ్యాపీగా ఉంచాలని అనుకుంటారు. మరుసటి రోజు కావ్య కిచెన్‌లోకి వెళ్లి కాఫీ చేస్తుంటే.. అపర్ణ, ఇందిరాదేవి వెల్లి కావ్యను తిట్టి పైకి పంపిస్తారు. అప్పుడే కిచెన్‌లోకి వచ్చిన అప్పు కాఫీ కలుపుతుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మీని పిలిచి కడుపుతో ఉన్న నీ కోడలితో పనులు చేయిస్తున్నారు. కావ్య మాత్రం ఇప్పుడే రెస్ట్‌ తీసుకుంటుంది అని రెచ్చగొడుతుంది. కానీ దాన్యలక్ష్మీ రుద్రాణిని తిట్టి వెళ్లిపోతుంది. తర్వాత ధాన్యలక్ష్మీ అపర్ణ, ఇందిరాదేవి దగ్గరకు వెళ్లి అప్పు చేత వరలక్ష్మీ వ్రతం చేయిస్తానంటుంది. ఒక్కరితో కాకుండా అందిరితో చేయిద్దామని అపర్ణ చెప్తుంది.


వరలక్ష్మీ వ్రతం కోసం రాజ్‌ను ఇంటికి రప్పించాలని అపర్ణ జూనియర్‌ స్వరాజ్‌ ను తీసుకుని ఇంటికి రమ్మని రాజ్‌కు చెప్పమని ఇందిరాదేవికి చెప్తుంది. ఇందిరాదేవి, రాజ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పగానే రాజ్‌ హ్యాపీగా ఫీలవుతుంటాడు. రాజ్‌ను హ్యాపీ మూడ్‌లో చూసిన యామినికి రుద్రాణి ఫోన్‌ చేసి కావ్య ప్రెగ్నెంట్‌ అని చెప్తుంది. దీంతో రాజ్‌ ముందే కావ్య ప్రెగ్నెంట్‌ అయిందన్న విషయం తెలిసేలా వరలక్ష్మీ వ్రతంలో నాటకం ఆడాలని యామిని చెప్తుంది రుద్రాణి సరే అంటుంది. కాల్‌ కట్‌ చేసి రాజ్‌ దగ్గరకు వెళ్లిన యామిని.. రాజ్‌ మనసులో కావ్యపై కోపం వచ్చేలా చేయాలనుకుంటుంది. కానీ రాజ్‌ కావ్యను సమర్థిస్తాడు.


రాజ్‌ స్వరాజ్‌ను తీసుకుని ఇంటికి వస్తాడు. మరోవైపు అప్పు వేసుకునే టాబ్లెట్‌ను రాహుల్ చేత మార్చేస్తుంది రుద్రాణి. ఆ మార్చిన టాబ్లెట్‌ నే అప్పు వేసుకుంటుంది. మరోవైపు రూంలో కావ్య, కనకంతో బాధపడుతుంటే అప్పుడు రుద్రాణి, ధాన్యలక్ష్మీని రూం దగ్గరకు తీసుకెళ్తుంది. చాటు నుంచి వింటుంటారు. అప్పుడే కావ్య తనకు అప్పులాగా అదృష్టం లేదని బాధపడుతుంది. దీంతో చూశావా కావ్య ఎలాంటిదో నీ కోడలి మీద ఏడుస్తుంది అని మరోసారి రుద్రాణి, ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టాలని చూస్తుంది. ఇంతటితో గడిచిన వారం బ్రహ్మముడి అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!