Brahmamudi Serial Today Episode:  ఆఫీసుకు వెళ్లిన కావ్య ఫైల్స్ చెక్‌ చేస్తుంది. ఇంకోవైపు ట్యాబ్లెట్స్‌ వేసుకున్న అపర్ణ కింద పడిపోయి కొన ప్రాణాలతో కొట్టుకుంటూ కావ్యకు ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ దూరంగా ఉండటంతో కావ్య ఫోన్‌ లిఫ్ట్‌ చేయదు. రాజ్‌కు కాల్ చేస్తుంది అపర్ణ. అమ్మ కాల్ చేస్తుందేంటీ అని కాల్ లిఫ్ట్ చేస్తాడు రాజ్. నాకు ఏదోలా అయిపోతుంది. నిలబడలేకపోతున్నాను. కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది. మీరు త్వరగా రండి అని అపర్ణ చెప్పగానే రాజ్‌ టెన్షన్‌ గా అందరికీ విషయం చెప్తాడు. కావ్య అక్కడే ఉందిగా అని ఇందిరాదేవి అంటుంది. వెంటనే అందరూ ఇంటకి వెళ్తారు. రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. ఇంట్లో అపర్ణ పడిపోయి ఉంటుంది. అంతా ఏమైందని కంగారుపడతారు.


రాహుల్‌: మమ్మీ మన ప్లాన్ సక్సెస్ అయింది.


రుద్రాణి: సక్సెస్ అయిందో లేదో అప్పుడే ఎలా తెలుస్తుంది. ముందు వదిన చచ్చిందో లేదో తెలియాలి కదా


రాజ్‌ కారులో అపర్ణను హాస్పిటల్‌ కు  తీసుకెళ్తుంటాడు.  అప్పుడే ఇంటికి వస్తున్న కావ్య, రాజ్‌ కారును  చూసి ఫాలో అవుతుంది. అపర్ణకు హాస్పిటల్‌లో చెక్ చేస్తుంటారు.


సుభాష్‌: నాన్నా రాజ్‌ ఏం కాదు నువ్వు టెన్షన్‌ పడకు..


ఇందిరాదేవి: అంతా బాగానే ఉందిగా, ధైర్యంగా ఉందిగా.. ఇంతలోనే ఇలా ఎందుకు సీరియస్ అయింది.


ప్రకాష్‌: వదినకు ఇంత ప్రమాదంగా ఉంటే.. కావ్య ఎందుకు పక్కన లేదు. అసలు ఎక్కడికి వెళ్లింది.


ఇంతలో కావ్య వస్తుంది.


కావ్య: అక్క, అత్తయ్యకు ఏమైంది.  


 అని అడుగుతుండగానే రాజ్‌ కోపంగా కావ్యను తిడతాడు. మా అమ్మను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లావు అంటూ కోప్పడతాడు. దీంతో సుభాష్‌, రాజ్‌ను ఓదారుస్తాడు. కావ్యను తిట్టొద్దంటాడు. అయితే మా అమ్మకు ఏమైనా జరగాలి. నిన్ను చంపేస్తాను అంటూ రాజ్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో అందరూ షాక్‌ అవుతారు. రుద్రాణి మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో డాక్టర్‌ బయటకు వస్తుంది.


డాక్టర్‌: ఆమెకు సడెన్‌గా బీపీ పెరిగింది. దానివల్ల మెడ నరాలపై ఎఫెక్ట్ పడి సన్నటి క్లాట్ ఏర్పడింది. అందువల్ల కోమాలోకి వెళ్లిపోయింది.


   అందరూ షాక్‌ అవుతారు. రాహుల్‌, రుద్రాణి హ్యాపీగా ఫీలవుతారు.


సుభాష్‌: తన ప్రాణాలకు ప్రమాదం ఏం లేదుగా డాక్టర్‌.


డాక్టర్‌: చెప్పలేం. మేమిచ్చే మెడిసిన్‌కు రెస్పాండ్ అయితే తప్పా ఏం చేయలేం.


రాజ్‌: ఏంటీ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేం అన్నారా? ఏం మాట్లాడుతున్నారు.. ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుందా.. పొద్దున బాగానే ఉందిగా. అందరితో మంచిగా మాట్లాడిందిగా.. ఇక బతకదని మీరు ఎలా అంటారు.. మీరే బతకించాలి.


సుభాష్‌: నాన్నా రాజ్‌ ఊరుకో.. మీ అమ్మకు ఏం కాదు. నువ్వు టెన్షన్‌ పడకు.


డాక్టర్‌: ఐసీయూ ముందు ఇంతమంది ఉంటే మాకు ఇక్కడి పేషెంట్స్‌ కు  ఇబ్బందిగా ఉంటుంది. ఒకరిద్దరు మాత్రమే ఇక్కడ ఉండండి.


ఇందిరాదేవి: మా కోడలిని వదిలి మేము ఎలా ఉండగలం


రాజ్‌: ఉండి ఏం చేస్తావ్. ప్రాణం పోస్తావా.. పోయే ప్రాణం నిలబెడతావా, అందరూ వెళ్లిపోండి.. డాక్టరే చేతులు ఎత్తేసిందిగా.. మీకు చెప్పే ఓపిక నాకు లేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. బతికించండి ఫ్లీజ్‌..


 అని రాజ్‌ డాక్టర్‌‌ తో పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతుంటాడు. తర్వాత కావ్యను తిడతాడు. నువ్వు ఎదురుగా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ అరుస్తాడు. ఇంతలో కళ్యాణ్‌ వస్తాడు. పెద్దమ్మకు ఏమైందని అడుగుతాడు. కోమాలోకి వెళ్లిందంటున్నారు. ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేం అంటున్నారు అని సుభాష్‌ చెప్పగానే కళ్యాణ్‌ ను చూసిన రాజ్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి ఘనస్వాగతం పలికిన అపూర్వ – చంద్రను చూసి ఎమోషన్ అయిన భూమి