Brahmamudi Serial Today Episode: అపర్ణకు రాజ్ నిజం చెప్పినట్టు అపర్ణ వెళ్లి కావ్యతో నిజం చెప్పినట్టు.. దీంతో కావ్య ఎమోషనల్ అవుతూ అన్ కాంన్సెస్ లోకి వెళ్లిన్టటు ఊహించుకుని రాజ్ భయంతో గట్టిగా అరుస్తాడు.
రాజ్ : ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అనుకుంటాడు. వాళ్లు కళావతికి చెప్పేస్తారు. ఫైనల్‌గా ఇదే జరుగుతుంది. కడుపులో బిడ్డను మోస్తే తన ప్రాణం పోతుందని తెలిసినా కళావతి బిడ్డను కనడానికే ఇష్టపడుతుంది తప్పా ఆ బిడ్డను చంపుకోవడానికి ఒప్పుకోదు.. నేను ఊహించింది జరగకూడదంటే ఈ నిజం బయటకు రాకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎన్ని అవమానాలు జరిగినా ఈ నిజం ఎవ్వరికీ చెప్పకూడదు..
అని డిసైడ్ అవుతాడు రాజ్. ఇంట్లో అందరూ కూర్చుని రాజ్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. ఇంతలో ధాన్యలక్ష్మీ వస్తుంది.
ధాన్యం: అక్కా గొడవ జరిగినప్పటి నుంచి ఎవ్వరూ కూడా ఏమీ తినలేదు.. కాస్త తిందురు రండి అక్కా
అపర్ణ: మనసే బాగా లేనప్పుడు ఆకలి మాత్రం ఎలా వేస్తుంది ధాన్యం..
ఇందిరాదేవి: ఉన్నపళంగా వాడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని నేను కలలో కూడా అనుకోలేదు
అపర్ణ: వాడికి ఏదో పిచ్చి పచ్చినట్టు ఉంది అత్తయ్యా లేదంటే ఇంత ఘోరమైన నిర్ణయం ఎలా తీసుకుంటాడు. నిన్నటి వరకు బిడ్డ పుడుతుందని మురిసిపోయాడు. మనకు ఏరోజు గ్లాసుడు మంచినీళ్లు ఇవ్వని రాజ్ కావ్య చేత పనులు మాన్పించేశాడు. కావ్యను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు. బిడ్డ పుట్టకముందే తన కోసం డ్రెస్సులు కొంటూ షాపింగులు చేస్తుంటే.. మురిసిపోయాను.. కానీ వాడు ఇలా సడెన్‌గా అబార్షన్ చేయించాలనుకోవడం అసలు ఎక్స్ ఫెక్ట్ చేయలేదు. అసలు వాడు ఎందుకిలా చేస్తున్నాడు.. బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్యా
ధాన్యలక్ష్మీ: మన ఇంటికి ఏదో పీడ పట్టుకుంది అక్క శాంతి చేయిస్తే కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేలా లేవు..
స్వప్న: అవును ఆంటీ మొన్నటి వరకు ఇబ్బంది పడ్డ కావ్యకు తన బిడ్డ కారణంగా సంతోషం వస్తుందని ఆశపడ్డాను.. కానీ ఇప్పుడు మరో కొత్త సమస్యకు ఆ బిడ్డే కారణం అవుతుందని అనుకోలేదు..
ప్రకాష్: అన్నయ్య ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కావ్య బాధకు కారణం ఏంటా అని కాదు. ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటా..? అని ఏదో ఒకటి చేసి రాజ్ మనసు మార్చాలి అన్నయ్యా.. దాని గురించి ఆలోచించండి
సుభాష్: ఆలోచించినా ఉపయోగం లేదేమోరా..?
ప్రకాష్: అదేంటి అన్నయ్య ఉపయోగం లేకపోవడం ఏంటి..?
సుభాష్: ఇందాక చూశాం కదరా..? వాడు ఎలా మాట్లాడాడో.. ఈ విషయంలో వాడు బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నాడు.. ఈ నిర్ణయంలో వాడు మన మాట వినడేమో
రాహుల్: అలా అని రాజ్ ను తన నిర్ణయానికే వదిలేస్తామా మామయ్య
రుద్రాణి: వదిలేయక ఏం చేయగలంరా
రాహుల్: చేయగలం మమ్మీ .. చీమలు తలుచుకుంటే పాముల్ని చంపేసినట్టు.. మనం తలుచుకుంటే ఏమైనా చేయోచ్చు.. అందరం కలిసి మాట్లాడితే రాజ్ కచ్చితంగా తన నిర్ణయం మార్చుకుంటాడు.
రుద్రాణి: అసలు మారడు అని సొంత తండ్రి చెప్తుంటే మారుతాడని ఎలా చెప్తావు
అంటూ రుద్రాణి అడగ్గానే రాజ్‌ను ఎలా మార్చాలో రాహుల్ తన ప్లాన్ చెప్తాడు. అందరూ సరే అన్నట్టు తలూపుతారు. తర్వాత కావ్య రూంలోకి రాజ్ రాగానే రాజ్‌ను నిలదీస్తుంది. కారణం ఏంటో చెప్పమని అడుగుతుంది. రాజ్ కారణం చెప్పకుండా వెళ్లిపోతాడు. మరుసటి రోజు అందరూ కలిసి రాజ్‌ను కన్వీన్స్ చేయాలని చూస్తారు. రాజ్ కన్వీన్స్ కాడు. పైగా కావ్యకు తాను ముఖ్యమో తన బిడ్డ ముఖ్యమో ఏదో ఒకటే చెప్పమని అడుగుతాడు. దీంతో కావ్య తనకు రాజ్ కన్నా తనకు పుట్టబోయే బిడ్డే ముఖ్యం అని చెప్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!