Brahmamudi Serial Today Episode:  కావ్య, రాజ్ మధ్య రోడ్డు మీద గొడవ జరగుతుంది. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూస్తే గొడవలు అవుతాయని అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను. కానీ పోయి పోయి నీ ముఖం చూశాను ఇక పోయి పోయి ఎన్ని నిందలు పడాలో అంటాడు. దీంతో కోపంగా కావ్య తన సైకిల్‌ ను ఇంకా అడ్డంగా పెడుతుంది. మీరే ఆ కారును పక్క నుంచి తిప్పుకుని వెళ్లండి అంటుంది కావ్య. సరేనని వెళ్లిపోతాడు. విగ్రహం తీసుకోవడానికి వెళ్లిన రాజ్‌ కావ్య స్పెషల్‌ గా రెడీ చేసిన విగ్రహాన్ని చూసి బాగుందనుకుని కొంటాడు. విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజకు అంతా సిద్దం చేస్తాడు.


రాజ్‌: నాన్నమ్మ పూజకు అంతా సిద్దం చేసేశాను.


ఇందిరాదేవి: మంచిది. ఫోన్‌ చేయ్‌..


రాజ్‌: ఫోనా.. ఎవరికి నాన్నమ్మా..?


ఇందిరాదేవి: కావ్యకు ..


రాజ్‌: ఎందుకు?


ఇందిరాదేవి: ఈ పూజలో మీ దంపతులే కూర్చోవాలి.


రాజ్‌: అదంతా నాకు ముందే చెప్పలేదు.


ఇందిరాదేవి: పెళ్లైన వాళ్లు భార్య బతికి ఉండగా పూజ ఒంటరిగా చేయకూడదురా..


రాజ్‌: ఇప్పుడు అర్థం అయింది నన్ను ఎందుకు ముందుకు తోశారో..


అపర్ణ: అర్థమైంది కదా? పూజకు అన్ని సిద్దం చేసి భార్య లేకుండా పూజ చేస్తే.. ఆ లోటు లోటుగానే ఉంటుంది. ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటే నీకు కావ్య గుర్తుకు రాలేదా? పెళ్లి అయినప్పటి నుంచి ఏ పూజైనా తన చేతుల మీదుగానే ఏర్పాట్లు మొదలయ్యేవి.


సుభాష్‌: రేయ్‌ నువ్వు ఫోన్‌ చేసి రమ్మని చెప్పు చాలు నేను కారు పంపిస్తాను.


అపర్ణ: కావాలంటే నేను వెళ్తాను.


ప్రకాష్‌: వీడు అన్న మాటలకు కావ్య రావడానికి ఒప్పుకోకపోతే..


అపర్ణ: బ్రతిమిలాడుకుంటాను.


ప్రకాష్‌: అప్పటికి ఒప్పుకోకపోతే..


అపర్ణ: లాగిపెట్టి ఒక్కటి వేస్తాను.


ప్రకాష్‌: నన్నా…


అపర్ణ: చా ఎంత మాట అయ్యా.. నేను అన్నది ఆ కళావతిని. వినకపోతే దండం దశగుణం భవేత్‌ అన్నారు మరి.


సుభాష్‌: నువ్వు ఫోన్‌ చేయరా..


రాజ్: నమస్తే వినాయక. ఈ ఇంట్లో  పక్కన భార్య ఉన్నవాళ్లే పూజ చేస్తారట. నేను మాత్రం ఒక నమస్కారం,  రెండు గుంజుళ్లు, మూడు ప్రదిక్షణలు సమర్పించుకుంటాను. మమ్మీ డాడీ మీరు కూర్చుంటారా? పిన్ని బాబాయ్‌ మీరు కూర్చుంటారా? లేకపోతే నాలుగు జంటలు కూర్చోండి.


స్వప్న: రాజ్‌ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.. భర్త లేని భార్య, భార్య లేని భర్త… మా అత్తలాగా ఎండిపోయి పండిపోయి రాలిపోయి బతుకంతా బాధపడుతూనే అయ్యో అనాడే అందరి మాట వినుంటే ఎంత బాగుండు అని..


రాజ్‌: స్వప్నా ఇక ఆపు నా భవిష్యత్తును మరీ వర్ణన చేయకు. నాకు సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఒకటుంది. అమ్మా దేవుడిని అడ్డం పెట్టుకుని ఆ రాక్షసిని ఇంటికి తీసుకురమ్మంటారా? నేను రాజ్‌ ను మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌ ని ఎవ్వరి మాట వినను.


 అని రాజ్‌ చెప్పగానే ఇందిరాదేవి, సీతారామయ్య బాధపడతారు. తర్వాత చేతి కర్ర తీసుకుని రాజ్‌ను బెదిరిస్తూ  కావ్య చీర పక్కన పెట్టుకుని పూజ చేయమంటారు. ధాన్యలక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఓపెన్‌ చేస్తుంది. స్వప్న లోపలికి వెళ్లి కావ్య చీర తీసుకురావడానికి వెళ్తుంది.



ఇందిరాదేవి: రాజ్‌  గణపతి విగ్రహం చాలా బాగుంది. జీవకళ ఉట్టిపడుతుంది.


అపర్ణ: ఈ విగ్రహం చూస్తుంటే నాకెందుకో కళావతే చేసినట్టు ఉంది.


రాజ్: నువ్వు ప్రతి కళలోనూ కళావతిని వెతక్కు మమ్మీ..


 స్వప్న పైనుంచి కావ్య శారీ తీసుకొని వచ్చి రాజ్‌ పక్కన పెడుతుంది. దీంతో రాజ్‌ కావ్యనే వచ్చి తన పక్కన కూర్చున్నట్లు కళ కంటాడు. చీరను పక్కకు తోస్తాడు. అపర్ణ కూడా కావ్య వచ్చి రాజ్‌ పక్కన కూర్చుని పూజ చేస్తున్నట్టు కల కంటుంది. ఎమోషనల్‌ గా ఫీలవుతుంది.  మరోవైపు అప్పు, కళ్యాణ్‌ లు తమ రూంలో గణపతి పూజ చేస్తారు. బంటి హారతి ఇస్తాడు. నువ్వు కనక లేకపోతే మేము పూజ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్లం అంటాడు కళ్యాణ్‌. చాల్లే వీడిని మరీ మోయకు వీడు లేకపోతే యూట్యూబ్‌ లో వీడియో చూసి పూజ చేసేవాళ్లం అంటుంది అప్పు. ఇంతలో కళ్యాణ్‌ వెళ్లి పోలీస్‌ యూనిఫామ్‌ తీసుకొచ్చి గిప్టుగా ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!