Brahmamudi Serial Today Episode: రాజ్‌కు నిజం చెప్పావా..? చెబితే ఎలా రియాక్ట్ అయ్యాడు.. అక్కను కన్వీన్స్‌ చేస్తా అన్నాడా..? అంటూ రూంలోకి వచ్చిన కళ్యాన్‌ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అప్పు. దీంతో కళ్యాణ్‌ చెప్పానని చెప్తాడు.

Continues below advertisement


కళ్యాణ్‌: కానీ అసలు నిజం చెప్పి తప్పు చేశావేమో.. తన ప్రాణంగా చూసుకునే బిడ్డ ప్రాణాలు తీసేయాలంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు చెప్పు.. నిజాన్ని అయితే చెప్పగలిగాను కానీ అన్నయ్య మన నిర్ణయానికి ఒప్పుకోవడం లేదు పొట్టి


అప్పు: ఏమంటున్నావు కూచి


కళ్యాణ్‌: అవును పొట్టి అన్నయ్య వదినను కానీ తన కడుపులో ఉన్న బిడ్డను కానీ వదులుకోవడానికి ఒప్పుకోవడం లేదు


అప్పు: కానీ ఆ బిడ్డ వల్ల అక్క ప్రాణాలకు ప్రమాదం కదా ఆ విషయం చెప్పలేదా నువ్వు


కళ్యాణ్‌: చెప్పాను పొట్టి అన్ని విషయాలు చెప్పాను.. కానీ మళ్లీ రేపు డాక్టర్‌కు దగ్గరకు వెళదాం మళ్లీ టెస్టులు చేపిద్దాం అంటున్నారు. ఒక్క చిన్న చాన్స్‌ ఉన్నా ప్రయత్నిద్దాం అంటున్నాడు


అప్పు: ఇప్పటికే డాక్టర్‌ లేట్‌ అయిందని చెప్తుంది. మళ్లీ టెస్టులు అని అక్కను ఒప్పించాలంటే టైం పడుతుంది. అది అక్కకే ప్రమాదం కదా


కళ్యాణ్‌: ఏం కాదు పొట్టి ఒకవేళ అన్నయ్య అన్నట్టు ఒక్క చిన్న చాన్స్‌ ఉన్నా మంచిదే కదా


అని కళ్యాణ్‌ చెప్పగానే.. అప్పు ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు తన రూంలోకి వెళ్లిన రాజ్‌ నిద్రపోతున్న కావ్య పక్కన కూర్చుని ఎమోషనల్ అవుతుంటాడు. కళ్యాణ్‌ చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటాడు.


రాజ్‌: కళ్యాన్ ఏదేదో చెప్తున్నాడు కళావతి.. నువ్వు బిడ్డను త్యాగం చేస్తేనే నువ్వు బతుకుతావట.. కానీ వాడికేం తెలుసు నువ్వు ఆ బిడ్డ మీద ఎంత ప్రేమను పెట్టుకున్నావని.. డాక్టర్లు చెప్పినా ఆఖరికిఆ దేవుడు చెప్పినా సరే నిన్ను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను నేను కాపాడతాను. నాకు ఏ కష్టం వచ్చినా ముందు నీకే చెప్పేవాడిని కానీ ఈరోజు నీకు ఆవిషయం చెప్పలేను. ఈ దారిలో నేను ఒంటరిగా పోరాడాలి. పోరాడతాను.. చివరి క్షణం వరకు పోరాడతాను. ఆ విధి రాతను ఎదిరించే ప్రయత్నంలో నా ప్రాణం పోతున్నా సరే నా బిడ్డను నీ చేతుల్లో పెట్టైనా సరే శ్వాస వదిలేస్తాను. మాటిస్తున్నాను కళావతి నీకు మన బిడ్డకు ఏ ప్రమాదం రానివ్వను


అని రాజ్‌ వెళ్లిపోతుంటే.. చేయి పట్టుకుని తన దగ్గరకు లాక్కుంటుంది కావ్య. రాజ్‌ షాక్‌ అవుతాడు. నిద్రమత్తులోనే కావ్య మాట్లాడుతుంది.


కావ్య: ఎక్కడికి వెళ్లిపోతారు.. నా దగ్గరే ఉండండి.. ఎప్పుడూ చూడు ఏదో ఒక గొడవతో నాకు దూరంగా వెళ్లిపోతారు. ఇక నుంచి మన బిడ్డ పుట్టే వరకు మీరు నాతోనే నా పక్కనే ఉండాలి.


రాజ్‌: ఉంటాను కళావతి ఎప్పుడు నీతోనే నీ పక్కనే ఉంటాను.. ధైర్యంగా ఉండు


అంటూ రాజ్‌ ఎమోషనల్ అవుతాడు. మరునాడు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండగా జగదీష్‌ వస్తాడు. అందరిని చూసి డోర్ దగ్గరే నిలబడిపోతాడు.   


ఇందిరాదేవి: అందేంటి అబ్బాయి అక్కడే నిలబడిపోయావేం.. లోపలికి రా


రుద్రాణి: ఎలా వస్తాడమ్మా ఒకప్పుడు ఇదే ఇంటికి డ్రైవర్‌ గా పని చేశాడు. ఇప్పుడు అల్లుడు హోదాలో అడుగుపెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది. పైగా మన ఇంటి బిడ్డను దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు కదా ఎవరు ఏమంటారోనని భయపడుతున్నాడు. నార్మల్ గా అయితే ఈ ఇంట్లో నువ్వు అడుగుపెట్టే అర్హత లేదు. కానీ ఈ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా సిగ్గు లేకుండా అడుగుపెట్టొచ్చు


స్వప్న: అయన రేవతిగారిని పెళ్లి చేసుకుని అర్హత తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఏ అర్హత లేని వాళ్లు ఇంట్లో పడి బతుకుతున్నారు


రుద్రాణి: ఏయ్‌ ఎవరినే నువ్వు అనేది..


స్వప్న: ఇంకెవరిని అంటాను మిమ్మల్నే


రుద్రాణి: నువు నాకు నీతులు చెప్తున్నావా..?


ఇందిరాదేవి: రుద్రాణి ఆగు.. నీతుల గురించి నువ్వు మాట్లాడాలా..? అపర్ణ మీరు ఇద్దరూ కలిసి ఆ అబ్బాయిని లోపలికి పిలవండి. మీరు పిలిస్తే అతను తప్పకుండా లోపలికి వస్తాడు.


అని చెప్పగానే అపర్ణ, సుభాష్‌ డోర్‌ దగ్గరకు వెళ్లి పిలుస్తారు. జగదీష్‌ లోపలికి వస్తాడు. అందరం ఇక్కడే కలిసి హ్యాపీగా ఉందామని ప్రకాష్‌ అనగానే.. లేదని తాను భర్తతో తమ ఇంటికి వెళ్తానని.. అక్కడ ఉండటమే తనకు గౌరవం అని చెప్పి రేవతి, జగదీష్‌, స్వరాజ్‌ వెళ్లిపోతారు. తర్వాత రూంలోకి వెళ్లిన రాహుల్‌.. రుద్రాణిని తిట్టి ఇక నేను మంచివాడిగా నటించి మొత్తం ఆస్థి కొట్టేస్తానని ప్లాన్‌ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!