Brahmamudi Serial Today Episode: హాస్పిటల్‌ నుంచి ఇంటికి వచ్చిన అపర్ణకు స్వప్న హారతి ఇవ్వబోతుంటే.. అపర్ణ ఆపి హారతి నువ్వు ఇస్తున్నావేంటి..? కావ్య ఎక్కుడుంది అని అడుగుతుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. కావ్యను పిలవండి అని చెప్పగానే రుద్రాణి ఇంకెక్కడి నీ కోడలు వదిన కావ్య ఎప్పుడో వెళ్లిపోయిందిగా అంటుంది. దీంతో అపర్ణతో పాటు అందరూ షాక్‌ అవుతారు.


అపర్ణ: వెళ్లిపోవడం ఏంటి?


రాజ్‌: అంటే అమ్మా అది నీకు ఇలా జరగడంతో నీకు మంచి జరగాలని అమ్మవారికి మొక్కుకుందట. వారం నుంచి ప్రతిరోజు గుడికి వెళ్తూనే ఉంది వచ్చేస్తుందిలే మమ్మీ..


అపర్ణ: నేను కళ్లు తెరవగానే నా పక్కనే ఉంటుందనుకున్నాను. ఇప్పుడేమో ఇంట్లో కూడా లేదంటున్నారు. అసలు నేను ఇంటికి వచ్చిన విషయం తనకు చెప్పారా?


రాజ్: చెప్పాను మమ్మీ వెంటనే ఇంటకి రమ్మని కూడా చెప్పాను కానీ వ్రతం పూర్తి చేసి వస్తానంది. అలంటి పూజలన్నీ మధ్యలో ఆపకూడదంట కద మమ్మీ నీకు కూడా తెలుసు కదా? స్వప్న ఏంటి చూస్తున్నావు. త్వరగా దిష్టి తీయ్‌. అసలే అమ్మ చాలా నీరసంగా ఉంది.


 అని రాజ్‌ చెప్పగానే స్వప్న దిష్టి తీస్తుంది. రాజ్‌ అపర్ణను ఇంట్లోంకి తీసుకెళ్తాడు. వాళ్లిద్దరూ లోపలికి వెళ్లాక ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని తిడుతుంది. డాక్టర్లు ఏం చెప్పారు. కావ్య ఇప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోయిందని తెలిస్తే ఎలా? నీ పిచ్చి చేష్టలు అన్ని కొద్ది రోజులు ఆపేయ్‌ అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే ఏదో నోరు జారింది అమ్మా అంటుంది రుద్రాణి. నీ నోరు అదుపులో పెట్టుకో.. అపర్ణకు ఏదైనా జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించి లోపలికి వెళ్తుంది.


రుద్రాణి: ఉండకపోతే ఉత్సవ విగ్రహం లాగా ఊరంగా ఊరేగమ్మా.. నాకేంటి..? ఇప్పుడు నాకు కావాల్సింది. రాజ్‌ పిచ్చోడు కావడం. ఓంటరి వాడుగా మిగిలిపోవడం. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను.


రాహుల్‌: అయితే కావ్య విషయం అత్తయ్యకు నువ్వే చెప్పేస్తావా? మమ్మీ..


రుద్రాణి: రాజ్‌ కు అబద్దం చెప్పడం కూడా చేత కాదురా.. ఇలాంటి పరిస్థితుల్లో కావ్య ఏ ఊరికో వెళ్లిందని చెప్పాలి కాని గుడికి వెళ్లిందని ఎవరైనా చెప్తారా? రాత్రి అయ్యాక కూడా కోడలు ఇంటికి రాకపోతే మా వదిన ఊరుకుంటుందా?


రాహుల్: అత్తముందు నిజం చెప్పేస్తావు అంతే కదా?


రుద్రాణి: ఆ నిజం విన్నాక మా వదిన గుండె ఏకంగా పైకే పోతుందో.. లేక నరాలు చిట్లి పోతుందో కళ్లారా చూద్దాం.


 పద అని లోపలికి వెల్లిపోతారు. మరోవైపు కావ్య తనకు ఇంతకు ముందు డిజైన్‌ వేయించుకున్న సందీప్‌ తో మాట్లాడుతుంది. ఇప్పుడు డిజైన్స్‌ వేసే  అవకాశం ఇవ్వమని అడుగుతుంది.  


సందీప్‌: ఒకప్పుడు నువ్వు వేసిన డిజైన్స్‌ దుగ్గిరాల వారి కంపెనీకి అమ్మేవాణ్ని ఇప్పుడు నువ్వు అదే ఇంటికి కోడలు అయిపోయావు కదా ఇప్పుడు నేనేం చేయగలను.


కావ్య: పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా సందీప్‌ గారు. కాలాన్ని బట్టి మారిపోతుంది.


సందీప్: మీ మాటలు బట్టి చూస్తుంటే నువ్వు అత్తారింటికి దూరమై సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టావని అర్థం అవుతుంది. నేను ఇప్పుడు ఎవరితోనైనా కాంటాక్ట్‌ కుదుర్చుకుని డిజైన్స్‌ ఇస్తానని చెప్పాకా.. నువ్వు మళ్లీ తిరిగి వెళ్లిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా..? నీలా నేను డిజైన్స్‌ వేయలేను కదా?


కావ్య: అలాంటి పరిస్థితి మళ్లీ రానివ్వను మీకు కంటిన్యూగా డిజైన్స్‌ వేస్తాను.


 అని చెప్పగానే సందీప్‌ తాను పాత క్లయింట్స్‌ ను అడుగుతాను ఎవరైనా డిజైన్స్‌ కావాలంటే అప్పుడు నీకు చెప్తాను అంటాడు. మరోవైపు బెడ్‌ రూంలో కూర్చు్న్న అపర్ణ కావ్య గురించి ఆలోచిస్తుంది. ఇంతలో రాజ్‌ ట్యాబ్లెట్స్‌ వేసుకోమని ఇస్తాడు. కావ్య ఇంకా రాలేదా? అని అడుగుతుంది. దీంతో రాజ్‌ ఇంత లేట్‌ అయినందుకు వచ్చాకా నువ్వే గడి పెట్టు అని చెప్పి మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో నేను ఒక ఫోన్‌ చేసుకోవాలి అని బయటకు వెళ్తుంటే దానికేగా అదే కావ్యకేగా అని అపర్ణ అడగడంతో రాజ్ అవునని బయటకు వెళ్లిపోతాడు. తర్వాత తర్వాత అపర్ణ,  రుద్రాణిని నిలదీస్తుంది. రుద్రాణి నీ కోడలే చేయరాని తప్పు చేసి ఇంట్లోంచి వెళ్లిపోయిందనగానే స్వప్న జరిగింది మొత్తం అపర్ణకు చెప్తుంది. దీంతో అపర్ణ కోపంగా రాజ్‌ ను తిడుతూ నా కోడలును నువ్వే దగ్గరుండి ఇంటికి తీసుకురావాలని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్‌: పోలీసులకు దొరికిన బూచి – మధ్యలోనే ఆగిపోయిన షర్మిల ఠాగూర్ ఇంటర్వూ