Brahmamudi Serial Today Episode:  గార్డెన్‌లోకి కళ్యాణ్‌ పిలిచి సారీ చెప్తాడు రాజ్‌. అప్పుకు అలా జరగడానికి కారణం నేనే అంటూ ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో డాక్టర్‌ ఫోన్‌ చేస్తుంది.

Continues below advertisement

రాజ్‌: హలో డాక్టర్‌ చెప్పండి

డాక్టర్‌: ఇంకా ఎం చెప్పాలండి ఎన్ని సార్లు చెప్పాను నేను అసలు ఏం చేస్తున్నారండి మీరు నేను అంత క్లారిటీ గా చెప్పినా కూడా మీరు ఎందుకు కావ్య గారికి నిజం చెప్పడం లేదు

Continues below advertisement

రాజ్‌: నాకు చెప్పాలనే ఉంది డాక్టర్‌ కానీ చెప్పాక కళావతి ఎక్కడ ఒప్పుకోదో అని చాలా భయంగా ఉంది

డాక్టర్‌: మీరిలా భయపడుతూ ఉంటే చివరికి ఎది జరగకూడదో అదే జరుగుతుందని చెప్పడానికే ఫోన్‌ చేశాను

రాజ్‌: ఏంటి డాక్టర్‌ మీరు అనేది

డాక్టర్‌: కావ్య గారికి ఫిప్త్‌ మంత్‌ రావడానిక ఇక ఎంతో టైం లేదు.. అందుకే వీలైనంత ఫాస్ట్‌గా కావ్య గారికి ఈ విషయం చెప్పి కావ్య గారిని ఒప్పిస్తారో ఏం  చేస్తారో మీ ఇష్టం ఒక డాక్టర్‌గా నేను చెప్పాల్సింది చెప్పాను.. ఇక నిర్ణయం మీదే

అని ఫోన్‌ కట్‌ చేస్తుంది.

కళ్యాణ్‌: అన్నయ్య డాక్టర్‌ గారు ఏం  చెప్పారో విన్నావు కదా వెంటనే వదినకు నిజం చెప్పు అన్నయ్య

రాజ్‌: లేదురా నిజం చెప్పి తనను దూరం చేసుకోవడం కన్నా ఈ అబద్దాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఎలాగైనా తనను కాపాడుకుంటాను

అని చెప్తాడు. మరోవైపు రూంలో పడుకున్న అప్పు రాజ్‌, కావ్య గొడవ పడిన విషయం గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లేస్తుంది. వెంటనే కావ్యతో మాట్లాడాలని బయటకు వెళ్లబోతుంటే.. ధాన్యలక్ష్మీ వస్తుంది.

ధాన్యం: లేచావా..? నీ కోసం జ్యూస్‌ తీసుకొచ్చాను తాగు

అప్పు: నాకు వద్దు అత్తయ్యా

ధాన్యం: ఏంటి వద్దు నువ్వేమైనా ఇంకా చిన్న పిల్లను అనుకుంటున్నావా..? ఇలా వద్దు అంటూనే పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇంత జరిగాక కూడా మళ్లీ అదే మాట అంటావేంటి

అప్పు: అది కాదు అత్తయ్య తాగాలనిపించడం లేదు

ధాన్యం: నువ్వు తాగాల్సిందే.. ఇందాక డాక్టర్‌ నువ్వు నీరసంగా ఉన్నావని చెప్పి వెళ్లారు. ఇక నుంచి నీ మాట మేము వినము.. నువ్వే మా మాట వినాలి.. తాగు

అని గట్టిగా  చెప్పగానే అప్పు జ్యూస్‌ తాగి టాబ్లెట్‌ వేసుకుని పడుకుంటుంది. ధాన్యలక్ష్మీ బయటకు రాగానే రుద్రాణి వెళ్లి రెచ్చగొడుతుంది.

రుద్రాణి: చుట్టూ ఉన్న గొడవలు ఆ పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రభావం చూపుతాయో ఆలోచించావా..? ఇందాక డాక్టర్‌ కూడా చెప్పారు కదా ప్రెగ్నెంట్‌ తో ఉన్న వాళ్లు ఎంత హ్యాపీగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారు  అని మరి నువ్వేం చేయవా..? వాళ్లను ఏమీ అడగవా.. ఇలాగే నువ్వు సైలెంట్‌ గా ఉంటే ఇక నువ్వు నీ మనవడి గురించి మర్చిపోవాల్సిందే? నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం

అని రుద్రాణి రెచ్చగొట్టగానే ధాన్యలక్ష్మీ కోపంగా కిందకు వస్తుంది. మరోవైపు కావ్య రూంలో బాధపడుతుంటే అపర్ణ, ఇందిరాదేవి వెల్లి ఓదారుస్తారు. అయితే తాను అప్పుకు నిజం చెప్తానని కావ్య బయటకు వస్తుంది. అప్పుడే కిందకు వచ్చిన ధాన్యలక్ష్మీ కావ్యను తిడుతుంది. దీంతో రాజ్‌ వచ్చి ధాన్యలక్ష్మీని తిడతాడు. ధాన్యలక్ష్మీ ఇంట్లోంచి వెళ్లిపోతామని బెదిరిస్తుంది. వెళ్తే వెళ్లండి అంటాడు రాజ్‌. దీంతో సీతారామయ్య రాజ్‌ను తిడతాడు. కావాలనే కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావా..? అంటూ నిలదీస్తాడు. అయితే అబార్షన్‌ విషయంలో తన నిర్ణయం మారదని చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!