Brahmamudi Serial Today Episode: రూంలో కూర్చుని ఆలోచిస్తున్న కావ్య దగ్గరకు రాజ్‌ వెళ్లి ఏం జరిగిందని అడుగుతాడు. దీంతో కావ్య.. రాహుల్‌ గురించి చెప్తుంది.  రాజ్‌, కోపంగా రాహుల్‌ ను తిడతాడు.

Continues below advertisement

కావ్య:  ఆ రుద్రాణి ఎలాగూ రాహుల్‌కు బుద్ది చెప్పదు..కనీసం మనమైనా చెప్పాలి కదా మా అక్క అలా బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలనండి..

రాజ్‌: సరే నువ్వు టెన్షన్‌ పడకు రాహుల్‌తో నేను మాట్లాడతాను

Continues below advertisement

కావ్య: మాట్లాడటం కాదు ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్‌ ఇవ్వండి

రాజ్: నేను చెప్తాను అంటున్నాను కదా.. ఇవన్నీ ఆలోచిస్తూ నీ బుర్ర పాడుచేసుకోకు ముందు నువ్వు ఇది తిను

అంటూ చెప్పగానే.. కావ్య టిఫిన్‌ తింటుంది. మరోవైపు స్వప్న దిగాలుగా కూర్చుని ఉంటే రాహుల్‌ వెళ్తాడు.

రాహుల్‌: ఏంటి శ్రీమతి గారు రాబోయే కష్టం ముందే కనిపెట్టారా..? కడుపులో బాధ కళ్లల్లోకి వచ్చింది

స్వప్న: కట్టుకున్నోడి ఒంట్లో కొవ్వు వస్తే భరించే భార్య కళ్లల్లో బాధే కనిపిస్తుంది.

రాహుల్‌: కరెక్టుగా చెప్పావు.. మరి ఆ కొవ్వుకు నువ్వు సరిపోవడం లేదు.. నా చూపుకు నువ్వు ఆనడం లేదు స్వప్న.. మరేం చేయమంటావు చెప్పు

స్వప్న: నువ్వేం చేయనక్కర్లేదు.. నేను నిన్నటి స్వప్ననే అయితే నీ చిత్త కార్తె బుద్దికి బాగా గడ్డి పెట్టేదాన్ని

రాహుల్‌: నేను చిత్త కార్తెనే.. మరి నువ్వు ప్రతివతవే కదా..? కథల్లో కానీ సినిమాల్లో కానీ ప్రతివతలు ఏం చేస్తారు..? భర్తల సుఖాన్నే కోరుకుంటారు. అయ్యో పాపం కట్టుకున్న వాడికి ఏం కష్టం వచ్చిందో ఇంటి తిండి కాదని హోటల్‌ తిండి మీద ఆశపడ్డాడు అని సర్ది చెప్పుకుని ముక్కు చీదుకుని వదిలేస్తుంది. మరి నువ్వేంటమ్మా నన్ను వదిలేయడం లేదు..

స్వప్న: ఆరోజు నిన్ను నమ్మడం నేను చేసిన తప్పు.. నీతో రావడం నేను చేసిన తప్పు.. ఈ రోజు నువ్వు తెగించి ఇంతగా దిగజారిన ఇంకా నీ చెంప పగులగొట్టకుండా ఉండటం నేను చేసిన తప్పే..

రాహుల్‌: వద్దు నువ్వేం చేయోద్దు.. నువ్వు తప్పు చేస్తానన్నా..? నేను మాత్రం జీవితంలో నీతో మళ్లీ మళ్లీ తప్పు చేయించను. కాబట్టి ఈ తప్పులన్నీంటికీ పుల్‌ స్టాప్‌ పెట్టేదాం.. ఇక నేను నీతో కలిసి ఉండటం జరగదు.. ఎందుకంటే నువ్వు నాకు డివోర్స్‌ ఇచ్చేయ్‌..

అని రాహుల్‌ అడగ్గానే.. స్వప్న ఒప్పుకోదు.. బలవంతంగా స్వప్న చేత సంతకం చేయించాలని చూస్తాడు రాహుల్‌. అయితే తప్పించుకుని అందరికీ చెప్తానని  కిందకు వెళ్లిపోతుంది. అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. స్వప్న పేపర్స్‌ తీసుకెళ్లి రుద్రాణి ముందు వేస్తుంది.

రుద్రాణి: ఏంటివి నా ముందు వేస్తున్నావు..?

స్వప్న: నీ కొడుకు చేస్తున్న ఘనకార్యం.. నాకు చేస్తున్న అన్యాయం..

రుద్రాణి:  ఏమంటున్నావు వాడు నీకు అన్యాయం చేయడం ఏంటి..?

స్వప్న: నా మీద మొహం మొత్తిందంట.. ఇంకో ఆడదాని మీద మోజు పుట్టిందట

రుద్రాణి: ఏంటి స్వప్న నువ్వు అనేది..

రుద్రాణి: మరీ అంత షాక్‌ అవ్వకు అత్తా చూడ్డానికే చాలా చెండాలంగా ఉంది.

అపర్ణ: స్వప్న ఏంటది ఇదంతా..?

స్వప్న: రాహుల్ ఇంకోదాన్ని పెళ్లి చేసుకోవాలట.. అందుకే విడాకుల పేపర్స్‌ మీద సంతకం పెట్టమని వేధిస్తున్నాడు

అంటూ స్వప్న ఏడుస్తూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. అప్పుడే రాజ్‌, కావ్య రూంలోంచి బయటకు వస్తారు. రాహుల్‌ కూడా కిందకు వస్తాడు. అందరూ రాహుల్‌ను తిడతారు. అయినా తనకు విడాకులు కావాలని చెప్పి వెళ్లిపోతాడు. అందరూ రుద్రాణిని తిట్టగానే రుద్రాణి పైకి వెళ్లి రాహుల్‌ను కొడుతుంది. రాహుల్‌ తన గర్ల్‌ ఫ్రెండ్‌ గురించి కన్వీన్స్‌ చేస్తాడు. మరోవైపు రాహుల్‌ను ఎలాగైనా మార్చాలని కావ్య, రాజ్‌ ఆలోచిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!