Brahmamudi Serial Today Episode: ఇంతలో శృతి రాగానే రాజ్‌ సార్‌ను నా క్యాబిన్‌ లోకి రమ్మను అని చెప్తుంది. శృతి వెళ్లి రాజ్‌ను భయపెట్టి కావ్య క్యాబిన్‌ లోకి తీసుకెళ్తుంది. అరవింద్‌ వెళ్లిపోతాడు. రాజ్‌.. కావ్య క్యాబిన్‌ లోకి వస్తాడు. ఈ ఆఫ్‌ డిన్నర్‌ గాడు ఎందుకొచ్చాడు అని అడుగుతాడు. దీంతో అరవింద్‌ కంపనీని వేలం పాటలో కొంటున్నాను అని చెప్తుంది. రాజ్‌ వద్దని చెప్తాడు. ఆల్‌రెడీ నేను డిసీజన్‌ తీసుకున్నాను అని చెప్తుంది కావ్య. తర్వాత స్వప్నకు ఫోన్‌ చేస్తుంది కావ్య.


స్వప్న: ఆ చెప్పే ఎలా ఉంది కొత్త ఆఫీసు.


కావ్య: ఎలా ఉంటుంది. ఎప్పుడూ ఉండేలాగే ఉంటుంది. బలం పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయి కదక్కా.. అక్కా నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్‌ చేశాను.


స్వప్న: నువ్వు ఇంట్లో నక్కనేమైనా పెంచుకుంటున్నావే ఏంటి అన్ని ఆఫర్లు నీకే వస్తున్నాయి .


కావ్య: అక్కా ముందు నేను చెప్పేది విను. ఒక కంపెనీ వేలం పాటకు వచ్చింది.


అని తన ప్లాన్‌ చెప్తుంది కావ్య. స్వప్న సరేనని ఇక  చూడు నేను ఎలా చేస్తానో అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తుంది. రాహుల్‌, రుద్రాణి చెస్‌ ఆడుతుంటే స్వప్న వెళ్లి డోర్‌ దగ్గర నుంచి చూస్తుంది.


రుద్రాణి: రాహుల్‌.. రణరంగంలోనైనా.. చదరంగంలోనైనా.. శత్రువు ఆలోచనను ఆరడుగుల ముందుగానే పసిగట్టాలి. లేకపోతే ఇలానే చనిపోతారు.


స్వప్న: ఏంటి కావ్య నువ్వు చెప్పేది నిజమా..? ఏంటి వేలం పాటలో అరవింద్‌ కంపెనీని కొంటే కోట్లలో లాభం వస్తుందా..?


రాహుల్‌: ఇది ఫోన్‌ మాట్లాడుతుందా..? మనకు ఇన్ఫర్మేషన్‌ ఇస్తుందా..?


స్వప్న: కానీ నాకో చిన్న డౌటు.. ఆ కంపెనీ నష్టాల్లో ఉంది అంటున్నావు. మరి దాన్ని కొంటే నీకెలా లాభం వస్తుంది. ఏంటి ఆ అరవింద్‌ కంపెనీకి ఫారెన్‌ ఇన్‌వెస్టర్స్‌ ఉన్నారా..? ఓహో నాకు ఇప్పుడే అర్థం అయింది. నీ ఐడియా సూపర్‌ కావ్య. ఓకే బాయ్‌.. మీరు ఇక్కడే ఉన్నారా..? నేను గమనించనే లేదు.


రుద్రాణి: నువ్వు కావ్యతో మాట్లాడుతున్నావని అర్థం అయింది. కానీ ఏం మాట్లాడుతున్నావో అర్థం కాలేదు. అసలు ఏంటి విషయం.


స్వప్న: మీకెందుకు.. చెప్తే దాన్ని  కూడా నాశనం చేద్దామనా..? మా కావ్య ఏదో సాధించడం కోసం కష్టపడుతుంది. మీ లాంటి వాళ్లకు ఆ విషయాలు చెప్పి నాశనం చేయని.


రాహుల్‌: మమ్మీ ఎవరికి ఫోన్‌ చేస్తున్నావు..


రుద్రాణి: ఇంకెవరికిరా..? ఆ అనామికకు.. ఈ వేలం పాట విషయం చెప్పి కావ్యను ఓడించేలా చేయాలని.


అనామిక: సరే ఆంటీ నాకు అంతా అర్థం అయింది. ఇక మొత్తం నేను చూసుకుంటాను.  


సామంత్‌: అదేంటి అనామిక ఆ అరవింద్‌ కంపెనీ చాలా నష్టాల్లో ఉంది.


అనామిక: సామంత్‌ ఆంటీ ఎం చెప్పారో విన్నావుగా.. ఆ కంపెనీకి ఫారిన్‌ ఇన్వెస్టర్లు ఉన్నారట..


అని చెప్పగానే సరే అంటాడు సామంత్‌. మరోవైపు  రాజ్‌ ఇంటికి వెళ్లగానే అందరూ భోజనం చేస్తుంటారు.


రాజ్: అందరూ కలిసి భోజనం చేస్తున్నారా? చేయండి. రేపటి నుంచి మీ సీఈవో మిమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయనివ్వదులేండి.


అపర్ణ: ఇప్పుడు ఏమైందిరా..


ఇందిర: ఏవో గిల్లి కజ్జాలు అయ్యుంటాయి. నువ్వు తిను


రాజ్‌: తాతయ్యా మీరు నన్ను తీసేసినా పర్వాలేదు. ఆ సీఈవో సీటులో కూర్చోబెట్టకపోయినా పర్వాలేదు కానీ..


అపర్ణ: కట్టుకున్న భార్యను మాత్రం తీసేయాలి.


రాజ్‌: మమ్మీ నేను చెప్పేది కాస్త వింటారా..? విషయం చిన్నది కాదు. తాతయ్య మీ మనవరాలు నష్టాల్లో ఉన్న అరవింద్‌ కంపెనీని కొనడానికి రెడీ అయింది. అలా కొంటే మనకు కోట్లల్లో నష్టం వస్తుంది. మన కంపెనీ దివాలా తీస్తుంది.


రుద్రాణి: కావ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వేలం పాటలో పాల్గొనకుండా ఇప్పుడే అడ్డు పడాలి. అది గెలిస్తే మా నాన్న దానికి కిరీటం పెడతాడు. ( అని మనసులో అనుకుంటుంది.) వాడు ఏదో చెప్తున్నాడు ఒకసారి వినొచ్చు కదా..?


  అని రుద్రాణి, రాజ్‌ చెప్తున్నా.. సీతారామయ్యా, ఇందిర పట్టించుకోకుండా కూరలు బాగున్నాయి రసం బాగుంది అంటూ తింటుంటారు. ఇంతలో రాజ్‌ మరింత సీరియస్‌ గా మాట్లాడటంతో సీతారామయ్య అందరు సరగ్గా వినండి అంటూ తన అభిప్రాయం చెప్తాడు.


సీతరామయ్య: నాకు కావ్య సమర్థత మీద నమ్మకం ఉంది. నష్టాల్లో ఉన్న కంపెనీని కొనాలనుకుంది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. కావ్య ఏ నిర్ణయం తీసుకున్నా.. అదేంటని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. నేను అస్సలు ప్రశ్నించను


 అంటూ చెప్పి అక్కడి నుంచి సీతారామయ్య వెళ్లిపోతాడు.


ఇందిర: విన్నావుగా.. కూర్చో భోజనం చేద్దువు..


రాజ్‌: పెట్టారు గడ్డి.. నెమరు వేసుకుంటూ ఉంటాను.


  అని కోపంగా పైకి వెళ్లిపోతాడు రాజ్‌. మీరంతా ఇలాగే కావ్యను సమర్థిస్తూ ఉండండి ఏదో ఒకరోజు మనమంతా రోడ్డున పడటం ఖాయం అంటూ వెళ్లిపోతుంది రుద్రాణి. మరోవైపు రైటర్‌ లక్ష్మీకాంత్‌.. కళ్యాణ్‌కు ఫోన్‌ చేసి తాను రాసిన పాట పాడమని ఫోన్‌ లో వింటాడు. పాట యావరేజ్‌ గా ఉందని ఐదు వేలు ఇస్తానని చెప్తాడు. అప్పు నీ పాట ఎంత అద్బుతంగా ఉందో తెలుసా..? వాడు నిన్ను పూర్తిగా వాడేసుకోవాలిన డిసైడ్‌ అయ్యాడు అని కోపంగా వెళ్లిపోతుంటే ఇంతకీ పాట ఎలా ఉందో నువ్వు చెప్పనేలేదు అని అడుగుతాడు. అద్బుతంగా ఉందని చెప్తుంది అప్పు.  తర్వాత సీతారామయ్య కావ్యకు ఫోన్‌ చేసి జాగ్రత్తలు చెప్తాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!