Brahmamudi Serial Today Episode:  ఎక్స్‌ ఫోకు వచ్చిన కావ్య, రాజ్‌ ఒకరికొకరు  ఎదురుపడతారు. రాజ్‌తో పాటు వచ్చిన రుద్రాణి, కావ్యను చూసి వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో స్వప్న, రుద్రాణిని తిడుతుంది. సుభాష్‌ మాత్రం సరేలే  కావ్య ఇక వెళ్దాం పద అంటాడు. రాజ్ ఎవరు పిలిచారు. ఎందుకు వచ్చారు అంటాడు. దీంతో కావ్య నేనేం మీకోసం రాలేదు. నాకు పనుండి వచ్చాను అని చెప్తుంది. ఈ వంకతో మాటిమాటికి ఎదురుపడి రాజ్‌ మనసు మార్చాలని చూస్తున్నావేమో అలా ఎప్పటికీ జరగదు. అంటుంది రుద్రాణి. దీంతో మీ ఆయన నిన్ను వదిలేసి ఇప్పటికీ క్షమించలేదని అందరూ అలాగే ఉంటారా? అంటుంది స్వప్న


రాజ్‌: మరి ఇంటికి రమ్మంటే రాని వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లో..


కావ్య: ఇంటికి రమ్మని నెలకింత ఖరీదు కట్టే షరాబులు ఇక్కడ ఉండరు అనుకున్నాను. తమరు వస్తారని నాకేం తెలుసు.


సుభాష్‌: ఏంటమ్మా ఏమంటున్నావు.


కావ్య: మీ అబ్బాయి గారిఏ అడగండి మామయ్యగారు.


రాజ్‌: కొన్ని పీడకలలు నిద్ర లేవగానే మర్చిపోవాలి డాడ్‌.


కావ్య: ఎదుటి వాళ్ల కళలు ఆశలు, ఆశయాలు అన్ని తొక్కి పారేసి మర్చిపోవాల్సిందేనా..?


అంటూ ఇద్దరూ గొడవ పడుతుంటే స్వప్న అడ్డుపడుతుంది. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే అని అడుగుతుంది. ఉపాధి కోసం వచ్చానని చెప్తుంది. దీంతో రుద్రాణి ఇవన్నీ నాటకాలు అని చెప్తుంది రుద్రాణి. తర్వాత అందరూ  వెళ్లిపోతారు. సుభాష్‌, కావ్యను పలకరిస్తాడు. లోపలికి వెళ్ళిన రాజ్‌ వాళ్లకు అనామిక, సామంత్‌ ఎదురుపడతారు. అనామికను  చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు. రుద్రాణి షాక్‌ అయినట్లు నటిస్తుంది. సామంత్‌ కోపంగా రాజ్‌తో చాలెంజ్‌ చేస్తారు. రాజ్‌ కూడా తిరిగి వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు ఇంట్లో అందరూ కూర్చుని టీవీ చూస్తుంటారు. ఇంతలో అపర్ణ వచ్చి ఏదైనా న్యూస్‌ చానెల్‌ పెట్టు ఎక్స్‌ ఫో గురించి న్యూస్‌ వస్తుండొచ్చు అని చెప్తుది. ప్రకాష్‌ న్యూస్‌ చానెల్‌ పెడతాడు. మరోవైపు కావ్య సురేష్‌ ను కలుస్తుంది.


సురేష్‌: ఏమ్మా వచ్చేశావా?


కావ్య: నా డిజైన్స్‌ ఎవరికో కావాలి అన్నారు కదా? తీసుకెళ్లి పరిచయం చేస్తే మాట్లాడి వెళ్లిపోతాను.


సురేష్‌: ఏమ్మా అంత అర్జెంట్‌ పని ఏమైనా ఉందా?


కావ్య: పనేం లేదు కానీ ఇక్కడ ఉండటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది.


సురేష్‌: అదేంటమ్మా ఇక్కడ అందరూ చాలా బిజీగా ఉన్నారు.


కావ్య: సరే నేను మరో రోజు వస్తాను.


సురేష్‌: ఆగమ్మా అలా తొందరపడితే ఎలా ఈ ఈవెంట్‌ లో ఎలాంటి డిజైన్‌ కు అవార్డు వచ్చిందో నువ్వు చూసి తెలుసుకోవాలి కదా?


కావ్య: నేను అలాంటివన్నీ పట్టించుకోనండి


 అని కావ్య వెళ్లబోతుంటే సురేష్‌ ఆపడానికి ప్రయత్నిస్తాడు. వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి రాజ్‌ గమిస్తుంటాడు. కావ్యను తీసుకెళ్లి ఒక  దగ్గర కూర్చోబెడతాడు సురేష్‌. అందరూ అవార్డు అనౌన్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. కావ్యను చూసిన స్వప్న పక్కకు తీసుకెళ్లి నువ్వు రాజ్‌ కోసమే వచ్చావు కదా? అని అడుగుతుంది. దీంతో కావ్య తాను వచ్చింది చెప్తుంది. అయితే నువ్వు ఎందుకు వచ్చినా సరే కానీ మా అత్త రుద్రాణి నిన్ను రాజ్‌ ను కలవకుండా చేయాలని చూస్తుంది. అది జరగకుండా మనం చేయాలని చెప్తుంది. అందుకోసం రాజ్‌ కు అవార్డు రాగానే నువ్వు వెళ్లి కంగ్రాట్స్‌ చెప్పు, తర్వాత సారీ చెప్పు అంటుంది. నేను సారీ చెప్పడం ఏంటి అని కావ్య ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం