Brahmamudi Serial Today Episode: కోపంగా ఇంటికి వచ్చిన కావ్యను ఆఫీసులో ఏమైందని కనకం ఆరా తీస్తుంది. అల్లుడుగారు ఏమైనా అన్నారా? అని అడుగుతుంది. దీంతో అసలే నాకు చిరాగ్గా ఉందని కావాలంటే మీ అల్లుడుగారికే ఫోన్ చేసి కనుక్కోమని చెప్పి వెళ్లిపోతుంది. అల్లుడి గారికి ఫోన్‌ చేస్తే ఇంకేమైనా ఉందా? అని ఇందిరాదేవికి ఫోన్‌ చేస్తుంది.


ఇందిర: హలో చెప్పు కనకం..


కనకం: చెప్పాల్సింది నేను కాదండి.. మీరే చెప్పాలి. అల్లుడుగారు ఆఫీసు నుంచి వచ్చాడంట కదా? ఇప్పుడు ఆఫీసుకు వెళ్తాడా లేదా? అది ముందు చెప్పండి.


అపర్ణ: మేము ఉండగ ఎందుకు అంత కంగారుపడతావు. వాడు ఆఫీసుకు వెళ్లను అంటే వదిలేస్తామా..? మనం ఇంత కష్టపడింది వాళ్లను ఒకచోట ఉంచడానికే కదా?


కనకం: అంటే ఇప్పుడు మీరు వెళ్లి బతిమాలుతారా?


ఇందిర: బతిమాలడానికి, బుజ్జగించడానికి వాడేమీ పాలు తాగే చంటి పిల్లాడు కాదు. అడ్డగాడిదలా ఆరుడగులు పెరిగాడు.


కనకం: గాడిద ఎక్కడా ఆరు అడుగులు ఉండదు కదండి.


ఇందిర: ముఖ్యమైన విషయాలు వదిలేసి గాడిద విషయాలు గుర్తు పెట్టుకుంటావేంటే గాడిద.


కనకం: గాడిద కాకపోతే నన్ను అడ్డగాడిద అని తిట్టండి. ముందు అల్లుడి గారిని ఎలా ఆఫీసుకు పంపిస్తున్నారో చెప్పండి.


అని కనకం అడగ్గానే ఒక ఆపరేషన్‌ స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో నీ కో ఆపరేషన్‌ కూడా కావాలి అని చెప్పగానే సరేనని ఫోన్‌ కట్‌ చేస్తుంది. ఇంతలో రుద్రాణి వచ్చి ఏంటి ఇగో అని ఏదో ఆపరేషన్‌ అని మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. దీంతో రుద్రాణిని అపర్ణ, ఇందిరాదేవి తిట్టి వెళ్లిపోతారు. దీంతో వీళ్లిద్దరూ ఏదో గూడుపుఠాణీ చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అనుకుంటుండగా నాకు తెలుసు అత్తయ్యా నేను చెప్తాను కదా అంటూ వస్తుంది. నిన్ను ఎవరూ ఏమీ చేయడం లేదనుకుంటున్నారు వాళ్లు మాత్రం నిన్ను ఇంట్లోంచి గేంటేయడానికి రెడీ అవుతున్నారు అని చెప్పి వెళ్లిపోతుంది. కళ్యాణ్‌ బాధగా ఏడుస్తుంటే.. అప్పు వచ్చి ఏమైందని అడుగుతుంది.


కళ్యాణ్‌: ఆటో నడపడం అవమానమా..? అదేమన్నా చిన్నతనమా..?


అప్పు: ఆటో నడపడం తప్పెలా అవుతుంది.


కళ్యాణ్‌: నేనేమైనా ఇల్లీగల్‌ బిజినెస్‌ చేస్తున్నానా..? లేకపోతే ఎవరినైనా మోసం చేస్తున్నానా..?


అప్పు: రైటర్‌ ని  కలిశావా..?


కళ్యాణ్‌: కలిశాను.. కనీసం ఆయన అసిస్టెంట్‌ గా కూడా పని చేసే అర్హత లేదని తెలుసుకుని వచ్చేశాను.


అప్పు: అర్హత లేదని నువ్వు అనుకున్నావా?


కళ్యాణ్‌: అయన అన్నాడు.


అప్పు: అరే భాయ్‌ అర్హత అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు. అయినా నీకు అర్హత లేకపోతే నువ్వు రాసిన పాటను ఎందుకు తీసుకుంటాడు.


 అని అప్పు అడగ్గానే రైటర్‌ లక్ష్మీకాంత్‌ అన్న మాటలు అప్పుకు చెప్తాడు కళ్యాణ్‌. దీంతో కళ్యాణ్‌ కు భరోసా ఇస్తుంది అప్పు. మరోవైపు ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాజ్‌.. లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి పాస్‌ వర్డ్‌ ఎంటర్‌ చేయగానే రాంగ్‌ అని వస్తుంది.


రాజ్‌: ఓసే శంకిణి పాస్‌వర్డ్‌ ను మార్చివేస్తావా? ఎంత ధైర్యమే నీకు. ఇప్పుడు ఈగోకు వెళ్లి లాభం లేదు. కళావతి మీద కోపం కంపెనీకి నష్టం రానీయకూడదు.


అనుకుని కావ్యకు పాస్‌వర్డ్‌ పంపించు అని మెసేజ్‌ చేస్తాడు. మెసేజ్‌ చూసుకుని నవ్వుకుని..


కావ్య: ఎవరూ ఈ హలో ( మెసేజ్‌ చేస్తుంది.)


రాజ్‌:  నా నెంబర్‌ కూడా డిలీట్‌ చేశావా? ( మెసేజ్‌ చేస్తాడు.)


కావ్య: ఎదుటువాళ్లు డిలీట్‌ చేసినప్పుడు మాకేనా డిలీట్‌ చేయడం రానిది మేము చేస్తాము.


రాజ్: ఎంత ధైర్యమే నీకు నోరు మూసుకుని పాస్‌వర్డ్‌ చెప్పు.


కావ్య: నీకు కంపెనీకి ఏంటి సంబంధం. బిజినెస్‌ లో ఎవ్వరినీ నమ్మకూడదు. కంపెనీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లకు పాస్వర్డ్‌ చెప్పకూడదు.


రాజ్‌: నాకు బీపీ పెరిగేలా ఉంది.


కావ్య: మిమ్మల్ని అడిగితే పాస్వర్డ్‌ చెప్పారా? చేతనైతే మీరే కనుక్కోండి గుడ్‌ నైట్‌.


   అని కావ్య మెసేజ్‌ పెట్టగానే రాజ్‌ .. ఆ కోడి మెదడు ఉన్నదే పాస్వర్డ్‌ కనుక్కోగా లేనిది నా లాంటి మేధావి కనుక్కోలేడా? అని ఎన్ని సార్లు పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసినా ఓపెన్‌ కాదు. ఇంతలో రాజ్ అతరాత్మ వచ్చి తిడుతుంది.  మరోవైపు కళ్యాణ్‌కు రైటర్‌ లక్ష్మీకాంత్‌ కాల్‌ చేస్తాడు.


కళ్యాణ్‌: హలో చెప్పండి సార్‌..


లక్ష్మీకాంత్‌: ఏం చేస్తున్నావు తమ్ముడు.. ఆటో డ్రైవ్‌ చేస్తున్నావా? టీ తాగుతున్నావా?


కళ్యాణ్: రెండు కాదులేండి సార్‌ ఏంటో చెప్పండి సార్‌.


లక్ష్మీకాంత్‌: ఏంటి తమ్ముడు ఇందాక నేను అన్న మాటలకు కోపం వచ్చిందా? ఇంత చిన్న మాటలకే కోపం తెచ్చుకుంటే రేపు గొప్ప వాడివి ఎలా అవుతావయ్యా..?  


కళ్యాణ్‌:  ఏంటి సార్‌ మీరు అనేది.


లక్ష్మీకాంత్‌: రేపు నువ్వు నిజంగా రైటర్‌ అయితే నిర్మాత ఒకలా మాట్లాడతాడు. డైరెక్టర్‌ ఒకలా మాట్లాడతాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఒకలా మాట్లాడతాడు. పాట నచ్చకపోతే జనాలు బండబూతులు తిట్టుకుంటారు. అవమానాలు అనేవి మన జీన్స్‌ లో కలిసిపోవాలయ్యా.. నీలో ఎక్కడ విషయం ఉందయ్యా.. ఇందాక నువ్వు బతిమాలితే నా మనసు కరిగింది. స్విచ్చియేషన్‌ చెప్తాను దాని మీద మంచి పాట రాయి.


అంటూ రైటర్‌ స్విచ్చియేషన్‌ చెప్పగానే కళ్యాణ్‌ రాస్తాను సార్‌ అంటాడు. అప్పు, కళ్యాణ్‌ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత రాజ్ కిందకు వస్తూ అందరూ నన్ను బతిమాలడానికి రెడీగా ఉన్నట్లున్నారు అనుకుంటూ కిందకు వచ్చి తనే అందరినీ పలకరిస్తాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!