Brahmamudi Serial Today Episode: తన బిడ్డను ఎందుకు చంపేయాలని చూస్తున్నావు అంటూ కావ్య కాలర్‌ పట్టుకుని నిలదీయడంతో రాజ్‌ నిజం చెప్తాడు. అయితే రాజ్‌ మాటలను కావ్య నమ్మదు.. మరో నాటకం ఆడుతున్నావా…? అంటూ నిలదీస్తుంది. ఇంతలో అప్పు లోపలి నుంచి వస్తుంది.

Continues below advertisement

అప్పు: బావగారు చెప్పేది నిజమే అక్కా

కళ్యాణ్‌: అవును వదిన నేను అప్పు మొదటిసారి డాక్టర్‌ గారిని కలవడానికి వెళ్లినప్పుడే మాకు ఈ నిజం తెలిసింది.

Continues below advertisement

అప్పు: బావగారికి నిజం చెప్పేసి మా గుండెల్లో భారాన్ని దించుకున్నాం. కానీ ఆ క్షణం నుంచే నీకు నిజం చెప్పలేక నీ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నరకం అనుభవించారు

కళ్యాణ్‌:  నీకు నిజం చెప్పమని అన్నయ్యకు ఎంతో చెప్పాము కానీ నీకు నిజం తెలిస్తే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకే విలువ ఇస్తావని.. నీ ప్రాణాలు కూడా లెక్క చేయవని భయపడ్డాడు..

అప్పు: అందుకే అక్కా అందరూ బావగారిని తిడుతున్నా మౌనంగా భరించారు. నిన్ను కాపాడుకోవడం కోసం నీ కడుపులో పెరుగుతున్న తన వారసుడిని కూడా వదిలించుకోవాలనుకున్నాడు

కళ్యాణ్‌:  ఆఖరికి నువ్వు ఇల్లు వదిలేసి వెళ్లిపోయావని తెలిసిన క్షణమే మేము నీకు నిజం చెప్పాలనుకున్నాం. కానీ ఆ క్షణంలో కూడా అన్నయ్య నిన్ను కాపాడటం కోసం అన్నయ్య పడుతున్న తపన చూసి మేము మౌనంగా ఉండిపోయాం..

అప్పు: నువ్వు చెప్పింది కరెక్టే అక్కా.. బావగారు నిన్ను మోసం చేశారు. నిజం చెప్పకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. జ్యూస్‌లో టాబ్లెట్ కలిపారు. బిడ్డను దూరం చేసుకోమని నిన్ను బాధపెట్టారు. కానీ ఇదంతా చేసింది నీ కోసమే అక్కా నీ ప్రాణాలు కాపాడటం కోసమే.. తనకు వారసులు కావాలని భార్యలను టార్చర్‌ చేసే మగాళ్ల మధ్యలో తన భార్య ప్రాణమే ముఖ్యం అనుకున్న బావగారు బంగారం అక్కా అలాంటి బావను తప్పు పట్టకు.. ఇలా నిందించి అవమానించకు..

కళ్యాణ్‌:  నువ్వు వెళ్తున్న దారి తప్పు అన్నయ్య నువ్వు చేస్తున్న పని వల్ల తన బిడ్డకు దూరం అయితే వదిన నిన్ను జీవితాంతం క్షమించదు ఒక శత్రువులా చూస్తుంది అని చెబితే అన్నయ్య ఏమన్నారో తెలుసా..? వదిన ఓరేయ్‌ అది నన్ను అసహ్యించుకున్నా పర్వాలేదు.. ప్రాణాలతో ఉంటే చాలురా అన్నారు వదిన.

అప్పు: ఇప్పుడు కూడా బావ నీకు నిజం చెప్పేవాడే కాదు.. ఆవేశంలో నువ్వు అన్న మాటలకు నోరు జారారే తప్పా.. ఇలా జరగకపోయి ఉంటే నీకు ఎప్పటికీ నిజం చెప్పేవారే కాదు.. నీకు శత్రువులా మారైనా సరే నిన్ను కాపాడుకునే వారు..

కళ్యాణ్‌:  ఒకసారి అన్నయ్యను చూడు వదిన ఇప్పుడు కూడా తను అనుకున్నది జరగలేదని బాధపడటం లేదు.. నోరు జారి నిజం చెప్పేశానే నిన్ను ఎలా కాపాడుకోవాలి అని బాధపడుతున్నాడు

సుభాష్‌: ఓరేయ్‌ రాజ్‌ కన్న వాళ్లం అయినా కూడా నువ్వేంటో తెలిసి కూడా నిన్ను నిందించాం మమ్మల్ని క్షమించగలవా..?

ఇందిరాదేవి:  ఓరేయ్‌ రాజ్‌ నువ్వు మీ తాతయ్య గారికి ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావని బాధపడ్డాను.. కానీ ఈరోజు నా మనవరాలిని కాపాడటానికి నువ్వు అందరి ముందు దోషిగా నిలబడ్డావంటే నాకు ఆగా అర్థం అవుతుందిరా మీ తాతయ్య విలువలను నువ్వు అందనంత ఎత్తుకు తీసుకెళ్లి నిలబెట్టావు.

అపర్ణ: నేను నానా మాటలు అంటున్నా మనసులో ఇంత బాధ దాచుకని పైకి ఎలా ఉండగలిగావురా..? నీ గొప్ప మనసును తెలుసుకోలేకపోయానురా నన్ను క్షమించరా..?

అనగానే రాజ్‌ వాళ్ల తాతయ్య కూడా రాజ్‌ను మెచ్చుకుంటాడు. అందరూ రాజ్‌ను క్షమించమని అడుగుతుంటారు. కావ్య మాత్రం ఏడుస్తూ రూంలోకి వెళ్లిపోతుంది. వెనకే వెళ్లిన రాజ్‌ కావ్యను ఓదారుస్తూ తన మనసులోని బాధను చెప్పుకుంటూ ఎమోషనల్‌ అవుతాడు. మరోవైపు రాహుల్‌, రుద్రాణి ఇద్దరూ కలిసి ఇక నుంచి కావ్యను చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. రాజ్‌ ఒంటరిగా బయట నిలబడి ఆలోచిస్తుంటే.. మూర్తి, కనకం వెళ్లి క్షమించమని అడుగుతారు. ఇంతలో కావ్య బ్యాగ్ తీసుకుని వచ్చి మన ఇంటికి వెళ్దాం పద అంటుంది. కావ్య, రాజ్‌ కలిసి వెళ్లిపోతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!