Brahmamudi Serial Today Episode: రాజ్‌కు మద్దతుగా వచ్చిన తాగుబోతును చూసి కావ్య నవ్వుకుంటుంది. ఇంతలో మీడియా వాళ్లు రాగానే.. రాజ్‌ కన్నా ముందే తాగుబోతు వాళ్ళతో మాట్లాడుతూ రాజ్‌ను సపోర్టు చేస్తూ కావ్యను తిడుతుంటాడు. ఇంతలో కావ్య మీడియా వాళ్ల దగ్గరకు వస్తుంది.

Continues below advertisement

కావ్య: చూడండి మీకు మొన్నే నేను చెప్పాను కదా..? మా మధ్య ఎటువంటి గొడవలు లేవని.. ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం లేదని

మీడియా: మరి ఈ టెంటు ఇవన్నీ ఏంటి మేడం

Continues below advertisement

కావ్య: ఆయనేదో సరదాగా నన్ను ఏడిపించడానికి ఈ పని చేస్తున్నారు. మీరేమో ఈ తాగుబోతు మాటలు నమ్మి వచ్చేశారు.. దయచేసి వెళ్లిపోండి

మీడియా: సరే మేడం వెళ్ళిపోతాం..

రాజ్‌: హమ్మయ్య సమయానికి ఇది వచ్చి అడ్డుపడింది కాబట్టి సరిపోయింది లేదంటే మొత్తం పెంట పెంట అయిపోయేది.

కావ్య: నేను కనక ఒక్క మాట నా కడుపులో బిడ్డని నా భర్తే చంపుకోమంటున్నాడని వాళ్లకు చెప్పి ఉంటే మీ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవుతుందా..?

తాగుబోతు: ఏంటి నువ్వు చెప్పేది నిజమా..? నీ కడుపులో బిడ్డను చంపేసుకోమంటున్నాడా..? అందుకే దీక్ష చేస్తున్నాడా..?  

కావ్య: అవును నువ్వే చెప్పు అన్నయ్య ఏ ఆడపిల్లైనా తన కడుపులో బిడ్డను పోగొట్టుకోవడానికి ఒప్పుకుంటుందా..?

తాగుబోతు: చీ  నీ కన్నా నా పెళ్లామే నయం కదా బ్రదర్‌ నాలుగు దెబ్బలేసినా రాత్రి ఇంటికి పోగానే రెండు ముద్దలు పెట్టి రెండు ముద్దులు పెడుతుంది. నువ్వేంటి బ్రదర్‌ ఏకంగా బిడ్డను చంపేసుకోమంటున్నావు చీచీ తాగుబోతునైనా నాకంటూ కొన్ని వ్యాల్యూస్‌ ఉన్నాయి. నీ లాంటి వాడికి నేను ఎప్పుడు  సపోర్టు చేయను బ్రదర్‌. ఇక నుంచి నా సపోర్టు మొత్తం నా చెల్లెలికే... చెల్లెమ్మా నీకు ఏదైనా కష్టం వస్తే ఒక చిన్న కేక వేయ్‌ పక్కింట్లోనే ఉంటాను పరుగెత్తుకుంటూ వస్తాను

అని చెప్పి వెళ్లిపోతాడు తాగుబోతు.

కావ్య: ఏవండి ఇప్పటికైనా మీ ఆలోచన తప్పు అని ఒప్పుకుని లోపలికి వస్తరా..?

రాజ్‌: రాను..  నేను ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకో  క్లారిటీ ఉంది. నాతో పాటు నువ్వు వచ్చే వరకు ఈ దీక్ష మాత్రం ఆపను.. భార్యల మొండి తనం నశించాలి. భర్త మాటే వేదవాక్కు..

అని నినాదాలు చేస్తుంటాడు.. విషయం తెలిసిన ఇందిరాదేవి నవ్వుకుంటుంది. ఇంతలో అపర్ణ వస్తుంది.

అపర్ణ: ఏంటి అత్తయ్యా ఫోన్‌లో ఏదైనా కార్టూన్‌ చూశారా..?  మీలో మీరే చిన్న పిల్లలా అలా నవ్వుకుంటుంన్నారు..? ఏంటి విషయం..

ఇందిరాదేవి: విషయం తెలిస్తే నువ్వు నవ్వుతావు తెలుసా..?

అపర్ణ: ఏం జరిగింది అత్తయ్యా

ఇందిరాదేవి: నీ కొడుకు తిక్క కుదిరింది..

అపర్ణ: తిక్క కుదరడం ఏంటి..? అత్తయ్య

అంటూ అపర్ణ అడగ్గానే.. రాజ్‌కు తాగుబోతు సపోర్టు చేసి విషయం.. తర్వాత తిట్టి వెళ్లిన విషయం మొత్తం చెప్పగానే ఇద్దరూ నవ్వుకుంటారు. తర్వాత రాత్రికి రాజ్‌ దోమలు కుడుతుంటే చూడలేని కావ్య దుప్పటి ఇవ్వడానికి వెళ్తుంది. కనకం చూసి కావ్యను ఆపేసి ఇలా ఆయితే అల్లుడు గారు మనసు మార్చుకోరు అంటూ ఒక నాటకం ఆడమని చెప్తుంది. కనకం చెప్పినట్టు నాటుకోడి కూర వేసుకుని భోజనం ప్లేటు తీసుకుని రాజ్‌కు ఎదురుగా వెళ్లి కావ్య తింటుంది. మీరెంత రెచ్చగొట్టినా నా దీక్ష ఆపను అంటూ రాజ్‌ అలాగే ఉండిపోతాడు. తర్వాత రాత్రికి మూర్తిని పిలిచి భోజనం ఇచ్చి ఎవ్వరూ చూడకుండా తీసుకొచ్చాను తినమని చెప్పండి అంటుంది కావ్య. సరేనంటూ మూర్తి భోజనం తీసుకుని రాజ్‌ దగ్గరకు వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!