Brahmamudi Serial Today Episode: కావ్య తనతో రానని రాజ్  కు చెప్పగానే.. అయితే ఆగు అంటూ జేబులోంచి పేపర్స్‌ తీసి వీటి మీద సంతకం పెట్టు అని రాజ్‌ అడుగుతాడు.

Continues below advertisement

కావ్య: ఏంటది..? సంతకం దేనికి..?

రాజ్‌: విడాకుల పేపర్లు.. నాతో కలిసి ఉండటం కంటే నీకు నీ బిడ్డే ముఖ్యం అయినప్పుడు ఇక మనం కలిసి ఉండటంలో అర్థం లేదు. నీకు నీ బిడ్డ కావాలంటే ఇందులో సంతకం చేయి.. నా దారి నేను చూసుకుంటాను. లేదు నాతో కలిసి ఉండాలంటే ఇప్పుడే నాతో రా

Continues below advertisement

మూర్తి: అల్లుడు గారు మీరు కూడా ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఎలా అల్లుడు గారు

కావ్య: ఇప్పుడు కొత్తగా సంతకాలు చేసి ఇవ్వడం ఏంటి..? గతంలో మీకు ఒకసారి సంతకం చేసి ఇచ్చాను కదా ఆ పేపర్లు పోయాయా..?

మూర్తి: అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావు..

కావ్య: మీరు ఆగండి నాన్న.. సరే ఇప్పుడు మీకేంటి సంతకం చేస్తే వెళ్లిపోతారు. ఒక్క నిమిషం ఆగండి

రాజ్: ఒక్క నిమిషం అని ఎక్కడికి వెళ్తున్నావు

కావ్య: సంతకం చేయాలంటే పెన్ను ఉండాలి కదా..? ఉండండి తీసుకొస్తాను

రాజ్‌: ( మనసులో) నేను భయపెడదామని విడాకుల డ్రామా ఆడితే తనేంటి నిజంగానే సంతకం చేయడానికి పెన్ను కోసం వెళ్తుంది

కావ్య లోపలికి వెళ్లి పెన్ను తీసుకొచ్చి సంతకం చేసి పేపర్స్‌ రాజ్‌కు ఇస్తుంది.

కావ్య: అడిగారు కదా సంతకం చేశాను తీసుకోండి

రాజ్‌: అంటే నాతో విడిపోవడానికి కూడా సిద్ద పడతావు తప్ప నాతో పాటు రానంటావు

కావ్య: ఆరు నెలలు సావాసం  చేస్తే గాడిద కూడా గుర్రం అయిందంట అలాగే మీతో చేరి చేరి మాట మీద నిలబడటం అలవాటై పోయింది. సంతకం చేస్తే వెళ్లిపోతాను అన్నారు కదా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి..?

అనగానే రాజ్‌ కోపంగా పేపర్స్‌ చించేస్తాడు.

రాజ్: ఎక్కడికి వెళ్లేది. నిన్ను తీసుకెళ్లకుండా నేను ఎక్కడికి వెళ్లను

కనకం: ( మనసులో) అల్లుడుగారేంటి.. రాకెట్‌ లా పైకి వచ్చి చివరికి చింపేసి తుస్సుమన్నారు.. ఎంతైనా నా కూతురంటే అల్లుడి గారికి ప్రేమే

కావ్య: మీరు ఇలాంటి డ్రామాలాడతారని నాకు ముందే తెలుసు

రాజ్‌: డ్రామాలు కాదు ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్లకుండా నేను ఎక్కడికి వెళ్లను

కావ్య: వెళ్లకపోతే ఏం  చేస్తారు

రాజ్‌: ఏం చేస్తానా..? ఆ నిరాహారదీక్ష చేస్తాను.

అని రాజ్‌ అనగానే మీ ఇష్టం ఏమైనా చేసుకోండి నాన్న, అమ్మ మనం లోపలికి వెళ్దాం పదండి.. అంటూ మూర్తి, కనకాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్లి డోర్‌ వేస్తుంది కావ్య. రాజ్‌ వెంటనే కనకం ఇంటి ముందు టెంట్‌ వేసుకుని నిరాహార దీక్ష చేస్తుంటాడు. మరోవైపు కావ్య, రాజ్‌ విడాకులు తీసుకుని విడిపోతారని సంతోషంలో రుద్రాణి డాన్స్‌ చేస్తుంది. ఇంతలో ఇందిరాదేవి అందరినీ పిలుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు.

అపర్ణ: ఏంటి అత్తయ్య అంతలా కేకలు వేశారు.

ఇందిరాదేవి: కావ్య కోసం వెళ్లిన రాజ్‌ ఏం చేశాడో తెలుసా..?

రుద్రాణి: ఏం చేశాడు అమ్మ కావ్యతో విడాకులు తీసుకున్నాడా..?

ఇందిరాదేవి: కాదు కావ్య కోసం కనకం ఇంటి ముందు ధర్నా చేస్తున్నాడట..

అని చెప్పగానే రుద్రాణి షాక్‌ అవుతుంది.

రాహుల్‌: ( మనసులో) ఈ ప్లాన్‌ కూడా గోవింద

అపర్ణ: నమ్మలేకపోతున్నాను అత్తయ్య

ధాన్యం: నువ్వేంటి అక్క మన రాజ్‌ భార్య కోసం అలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను

సుభాష్‌: వాడిలో ఇంత చేంజ్‌ ఏంటి..?

రుద్రాణి: బాధపడాల్సిన విషయాన్ని పట్టుకుని అంత సంతోషంగా చెప్తారేంటి..?

ఇందిరాదేవి: ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది రుద్రాణి

రుద్రాణి: దుగ్గిరాల ఇంటి వారసుడు భార్య కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడంటే మన పరువు ఏమవుతుందో తెలుసా..?  నలుగురు మనల్ని చూసి నవ్వుకుంటారు వెంటనే ఫోన్‌ చేసి రమ్మనండి

ఇందిరాదేవి: ఏం అవసరం లేదు వాడు దీక్ష చేయని

అనగానే ఈ సంతోషంలో అందరం స్వీట్లు తిందాం తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. అప్పు కూడా హ్యాపీగా ఫుడ్డు తింటుంది. అప్పును చూసిన కళ్యాణ్‌ ఆశ్చర్యపోతాడు. ఇక రాజ్‌ దగ్గరకు ఒక తాగుబోతు వచ్చి మద్దతుగా దీక్షకు కూర్చుంటాడు. అప్పుడే మీడియా వాళ్లు వస్తే వాళ్లతో తాగుబోతు కామెడీగా మాట్లాడుతుంటాడు. అది చూసిన కావ్య నవ్వుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!