Brahmamudi Serial Today Episode: కనకం, మూర్తి పెళ్లిరోజు సందర్భంగా కేక్ చేసిన తర్వాత కావ్య, రాజ్ నువ్వు తినిపించు అంటే నువ్వు తినిపించు అంటూ పోటీ పడతారు. ఇంతలో మూర్తి మీరే తినిపించండి అల్లుడుగారు అంటాడు. సరేనని రాజ్ తినిపిస్తాడు. తర్వాత కావ్య, అందరూ కేక్ తినిపిస్తారు.
ఇందిరాదేవి: చెట్టుమీద పుట్టిన మామిడి కాయ, సముద్రంలోని ఉప్పు కలిస్తేనే ఊరగాయ అయినట్టు అబ్బాయి ఒక ఇంట్లో పుడతాడు. అమ్మాయి ఒక ఇంట్లో పుడుతుంది. ఆ ఇద్దరూ కలసి బతకడం కోసం ఒకటైపోయి ఒక ఇంట్లో ఉంటారు. అపర్ణ ఇప్పుడు నువ్వు చెప్పు.
అపర్ణ: క్షమించరాని తప్పులు జరిగినా నేను అత్తిటి గడప దాటలేదు. అటు పుట్టింటికి ఇటు అత్తింటికి మచ్చ తెచ్చే పని నేను చేయలేదు. గాయం అయినా శరీరం మనదే పోయిన నాడు తప్పా మన శరీరాన్ని వదిలి వెళ్లలేం కదా?
ఇందిరాదేవి: ఇప్పుడు పెళ్లై పాతికేళ్లు అయిన కనకం తన అనుభవంతో నేర్చుకున్న విషయాలు చెప్తుంది.
రాజ్: ఆ అత్తయ్య గారు మీరు కూర్చోండి.. ఎవరేమీ అనుకోరు మీరు కూర్చోని మాట్లాడండి.
కనకం: నాకు ముగ్గురు కూతుళ్లు.. ముగ్గురు పెళ్లై వెళ్లిపోయారు. అంటే పిల్లలు కూడా మనతో శాశ్వతంగా ఉండరు. ఆయనకు నేను.. నాకు ఆయన. అంటే భార్యాభర్తల అనుబంధం అంత గొప్పది. నేను ఎన్ని అబద్దాలు చెప్పినా.. ఎంత చేసినా నా భర్త నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టలేదు.
ప్రకాష్: ఆ ఇప్పుడు నేను నేను చెప్తాను.
ఇందిరాదేవి: అయ్యో చెప్పరా..
రాహుల్: మామయ్య మర్చిపోయారు..
ప్రకాష్: లేదు.. గుర్తొచ్చింది.. నాకు మతి మరుపు అన్న విషయం మా పెళ్లైన రెండు రోజులకే మా ఆవిడకు తెలిసింది. కానీ ఈ రోజు వరకు అడ్జస్ట్ అవుతూనే ఉంది. ఇప్పటికీ 24 ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ నాతోనే ఉంది.
అపర్ణ: స్వప్న నువ్వు చెప్పు..
స్వప్న: నాకంటే పెద్దవారైన అత్తయ్యగారు ఉన్నారు కదా? ఆంటీ.. వద్దులే ఆవిడ చెప్తే అన్ని విడిపోయిన స్టోరీలే చెప్తుంది. నేనే చెప్తాను. రాహుల్ నన్ను మోసం చేయాలనుకున్నాడు. అది అందరికీ తెలిసిందే.. కానీ పెళ్లి జరిగితే అతనితోనే జరగాలనుకున్నాను. ఇప్పటికీ ఇద్దరం గొడవ పడుతూనే ఉన్నాం. కానీ రాహుల్ నన్ను ఇంట్లోంచి పొమ్మనలేదు. నేను రాహుల్ ను వదిలి పోవాలనుకోలేదు. చచ్చేదాకా రాహుల్ నన్ను భరించాల్సిందే.
రుద్రాణి: ఎక్కడ వాడి పరువతీస్తావో అనుకున్నాను ( మనసులో అనుకుంటుంది)
ప్రకాష్: అరేయ్ రాహుల్ నువ్వు చెప్పరా..?
రాహుల్: నాకు నిజంగా భార్యాభర్తల బంధం అంటేనే తెలియదు. తెలియకుండానే కాపురం చేశాను. తెలియకుండానే ఇప్పుడో బిడ్డకు తండ్రిని కాబోతున్నాను. ఇవాళ నా ముందు మాట్లాడిన వాళ్ల మాటలు విన్నాక నిజంగా ఈ బంధంలో మ్యాజిక్ ఉందేమో అనిపించింది. ఏం చేస్తాను. చచ్చేదాకా ఈ స్వప్నను భరిస్తాను తప్పదు.
ప్రకాష్: అరేయ్ ఏమో అనుకున్నానురా.. బాగా చెప్పావు సూపర్..
అపర్ణ: అప్పు ఇప్పుడు నువ్వు చెప్పు..
అప్పు: నాకేం తెలియదు.. ఎవరేం అనుకుంటే నాకేంటి అనుకునే దాన్ని. బిందాస్ గా బతికేదాన్ని.. నేను అందరి ఆడపిల్లల్లా ఉండను మగరాయుడిలా ఉంటాను. కానీ ఎప్పుడైతే కళ్యాణ్‌తో పెళ్లై ఇంట్లోంచి బయటకు వచ్చానో అప్పుడే నా పద్దతి మారిపోయింది. కళ్యాణ్ కోసం అన్ని నేర్చుకున్నా.. వాడి కోసం నన్ను నేను మార్చుకుంటున్నా..
ఇందిరాదేవి: కళ్యాణ్ ఇప్పుడు నువ్వు చెప్పరా..?
కళ్యాణ్: నాకు మాట్లాడ్డం రాదు రాయడం తప్పా.. కానీ ఇప్పుడు మాట్లాడక తప్పదు. అన్ని ఉన్నప్పనుడు ఏమీ లేవని నా జీవితంలోంచి వెళ్లిపోయింది అనామిక. ఏమీ లేనప్పుడు అన్ని ఉన్నాయని నా జీవితంలోకి వచ్చింది అప్పు. నా దృష్టిలో భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడమే అసలైన పేదరికం. నేనిప్పుడు కోటీశ్వరుడిని..
ఇందిరాదేవి: ఇప్పుడు రాజ్ మాట్లాడాలి..
రాజ్: నేనా..నేనేం మాట్లాడతాను..
అపర్ణ: అందరూ మాట్లాడింది. మీలో మార్పు కోసమేరా.. కనీసం భార్యాభర్తలు ఎలా ఉండకూడదో అదైనా చెప్పు.
రాజ్: ఏం చెప్పాలి. మీరంతా మాట్లాడాక నాకు అర్థం అయింది. భార్యాభర్తలంటే ఇలా ఉండాలా? ఇలా సర్ధుకుపోవాలా? ఇంతలా కలిసి ఉండాలా? కోపం ఆవేశం ఇవన్నీ మనుషుల్ని దూరం చేస్తాయే తప్పా మనసుల్ని దూరం చేయలేవు. ఆ మనసుల మధ్య ఒక్కసారి ఒక బంధం ఏర్పడితే తప్పా ఏంత కోపం ఉంటే ఏంటి..? ఇక్కడి దాకా లాక్కొచ్చి పడేస్తుంది.
ఇందిరాదేవి: కావ్య.. నువ్వు చెప్పమ్మా..
కావ్య: అందరూ తమ అనుభవాలు చెప్పారు. కానీ నా దగ్గరకు వచ్చే సరికి నాకు అనుభవం నేర్పిన పాఠం ఒక్కటే.. నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు ఇవన్నీ ఒక భ్రమ, ఒక మాయ బార్యాభర్తల మధ్య సంబంధం చివరి వరకు కొనసాగాలంటే నమ్మకం. అది నా భర్తకు నామీద లేదు. కట్టిపడేయాల్సింది ప్రేమ. అది నా భర్తకు నీ మీద లేదు. అందుకే ఈరోజు ఆయన జీవితంలో నేను లేను.
అంటూ చెప్తూ కావ్య ఎమోషనల్ అవుతుంది. రాజ్ షాక్ అవుతాడు. కనకం కోపంగా కావ్యను తిడుతుంది. దీంతో నేను నిజం మాట్లాడుతున్నాను అమ్మా అంటుంది. ఇంతలో పంతులు వచ్చి దాంపత్య వ్రతానికి ఇంకా పనులు మొదలుపెట్టలేదా? వ్రతంలో ఎవరెవరు కూర్చుంటారు అని అడుగుతాడు. కనకం ముగ్గురు కూతుళ్లు అల్లుళ్లు కూర్చుంటారని చెప్తుంది. తనకు ఇష్టం లేదని కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: శారదకు గుండు కొట్టించబోయిన అపూర్వ- ఇందును గుడికి