Brahmamudi Serial Today Episode: మందు పార్టీ ఏర్పాటు చేసిన కూయిలీ గోల్డ్ బాబుతో డాన్స్ చేయడం చూసిన రాహుల్ కోపంగా కూయిలీని తిడతాడు. గోల్డ్ బాబును పక్కకు తోసేసి తాను డాన్స్ చేస్తుంటాడు. దీంతో గోల్డ్ బాబు కోపంగా అరుస్తాడు.
గోల్డ్ బాబు: కూయిలీ నాకు ఇక్కడ ఎంటర్‌టైన్ మెంట్ తగ్గింది. నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోతాను.
కూయిలీ: ఏమైంది బావ సెటప్ నచ్చలేదా..? మ్యూజిక్ నచ్చలేదా..?
గోల్డ్ బాబు: గ్లాస్‌లో డ్రింక్ అయిపోతే ఇచ్చేవాళ్లు లేరు కూయిలీ
కూయిలీ: నేను ఇప్పుడే ఇస్తాను ఒక్క నిమిషం ఆగు బావ నేను తీసుకొస్తాను
గోల్డ్ బాబుకు కూయిలీ మందు ఇస్తుంది.
గోల్డ్ బాబు: మరి నాతో కలిసి డాన్స్ చేసే వాళ్లు లేరు కదా నేను వెళ్లిపోతాను
కూయిలీ: బావ నేను ఉన్నాను కదా బావ
రాహుల్: మరి నా సంగతేంటి..?
కూయిలీ: మనం ఎప్పుడైనా డాన్స్ చేయోచ్చు రాహుల్ కానీ పాపం ఇంటికి వచ్చిన మీ అన్నయ్యను డిసప్పాయింట్ చేసి పంపిస్తామా..? నువ్వు పక్కకు వెళ్లు రాహుల్
అంటూ రాహుల్ ను తోసేస్తుంది.
రాజ్: ఇప్పటికైనా అర్థం అయిందా.. నీ గర్ల్‌ఫ్రెండ్‌కు నీకంటే డబ్బు ముఖ్యం కాబట్టే నిన్ను పక్కన పెట్టి వాణ్ని ఇంప్రెస్ చేస్తుంది.
కావ్య: మా అక్క ఏ రోజైనా అలా చేసిందా..? నిన్ను ఇంకొకరి ముందు అవమానించిందా..? ఎవరు ఏంటో ఇప్పటికైనా తెలుసుకో
రాజ్: ఒరేయ్ నిజంగా కూయిలీ కోటీశ్వరురాలే అయితే నువ్వుండగా వాడి వెంట ఎందుకు పడుతుంది. వాడి బిజినెస్ డబ్బులు తన కంపెనీలో ఇన్వెస్ట్ ఎందుకు చేయమని అడుగుతుంది
రాహుల్ కోపంగా మందు తాగుతుంటాడు. గోల్డ్ బాబు వెళ్లి మందు కలిపి ఇవ్వమని అడుగుతాడు. రాహుల్ కోపంగా మందు కలిపి ఇస్తాడు.
రాజ్: చెప్పేది అర్థం అవుతుంది కదరా..? ఇప్పటికైనా అర్థం చేసుకుని ఇంటికి వచ్చేయ్ స్వప్నను అర్థం చేసుకో నీకు స్వప్నే మందు కలిపి ఇస్తుంది.
రాహుల్ కోపంగా సోపాలో వెళ్లి కూర్చుని మందు కొడుతుంటాడు. రాజ్, కావ్య, కూయిలీ, గోల్డ్ బాబు కలిసి డాన్స్ చేస్తుంటారు.
కూయిలీ: మీరు నిజంగా ముసలి వాళ్లేనా..?
కావ్య: అబ్బా నడుము నొప్పి పట్టేసిందిగా…?
కూయిలీ: నిజంగా ముసలి వాళ్లే
అనగానే.. రాజ్ సైగ చేయగానే.. గోల్డ్ బాబు తనకు మందు కావాలని అడుగుతాడు. కూయిలీ మందు ఇవ్వడానికి వెళ్తుంది. తర్వాత కూయిలీ వెళ్లిపోతుంది. తర్వాత రోజు ఎలా నాటకం ఆడాలో రాజ్, కావ్య.. గోల్డ్ బాబుకు చెప్తారు. అందరూ వెళ్లిపడుకుంటారు. మరుసటి రోజు ఉదయం రాహుల్, గోల్డ్ బాబు ఓకే సోపాలో పడుకోవడం చూసి రాజ్ కోపంగా గోల్డ్ బాబును నిద్ర లేపుతాడు.
గోల్డ్ బాబు: ఏంటి బావ పొద్దు పొద్దునే
రాజ్: అరేయ్ గోల్డ్ మనం ఏం ప్లాన్ చేశామో గుర్తు ఉందా..? రాహుల్ గాడు నిద్ర లేవగానే.. నువ్వు కూయిలీ రూంలో ఉండాలి
గోల్డ్ బాబు: అవును బావ మర్చిపోయాను..
అనుకుంటూ వెళ్లి కూయిలీ రూంలో కూయిలీ పక్కన పడుకుంటాడు. వెంటనే రాజ్, కావ్య ఇద్దరూ కలిసి రాహుల్‌ను నిద్ర లేపి కూయిలీ రూంలోకి తీసుకెళ్లి అక్కడ ఇద్దరూ కలిసి పడుకోవడం చూపిస్తారు. కూయిలీని తిడతారు. ఇలాంటి దాన్నా నువ్వు పెళ్లి చేసుకునేది అంటూ రాహుల్‌కు గడ్డి పెడతారు. దీంతో రాహుల్ డైలమాలో పడిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!