Brahmamudi Serial Today Episode: కూయిలీని సందు దొరికినప్పుడల్లా కొడుతుంది కావ్య. వంట నేర్పిస్తూ.. ఇల్లు క్లీన్‌ చేయిస్తూ.. ఎక్కడబడితే అక్కడ కొడుతుంది. అయినా కూయిలీ వర్క్‌ చేస్తుంది. ఇంతలో కావ్య హాల్లోకి వస్తుంది.

Continues below advertisement

రాజ్: ఏరా మనవడా ఏం చేస్తున్నావురా..?

రాహుల్‌: అస్తమాను నువ్వు అలా పిలవకు నాకు చిరాకుగా ఉంది.

Continues below advertisement

కావ్య: చిరాకు ఎందుకురా గడుగ్గాయి.. తాత మనవడిని మనవడా అని పిలవకుండా గైవడా పిలుస్తాడురా నీ జిమ్మడా..?

రాహుల్‌:  ఏహేయ్‌ ఆపండి మీ గోల

రాజ్‌: ఏడ్చావులే కానీ నీకో గుడ్‌ న్యూస్‌రా

రాహుల్‌: మీరుండగా నాకు గుడ్‌ న్యూస్‌ కూడానా..?

రాజ్‌: నిజమేరా మనవడా నీకు కజీన్‌ వస్తున్నాడు..

రాహుల్‌: కజీనా..? మళ్లీ కొత్త క్యారెక్టరా..?

రాజ్: అదేరా వాడు గోల్డెన్‌ బాబురా.. దుబాయ్‌ రిటర్న్‌

రాహుల్‌: ఎవ్వరూ రానక్కర్లేదు

కావ్య: ఏరా నీ కాబోయే పెళ్లాం పర్మిషన్‌ కావాలా ఏంటి..?

రాజ్‌: ఇంతకీ నీ గ్యాల ఎక్కడరా

కూయిలీ చింపిరి జుట్టు మాసిన చీరతో  కిచెన్‌ లోంచి వస్తుంది.

కూయిలీ: ఏంటి తాతయ్య గారు

రాహుల్‌: కూయిలీ ఏంటి ఇలా అయిపోయావు

కావ్య: వంట చేసిందిరా మనవడా..? ఈ మాత్రం చేంజ్‌ వస్తుందిలే..?

రాజ్‌: అది వంట చేసినట్టు లేదు.. నువ్వు దాని తాట తీసినట్టు ఉంది

కూయిలీ: ఏంటి రాహుల్‌ అలా చూస్తున్నావు..

రాహుల్‌: అదే నువ్వు మరీ ఇంత చెండాలంగా ఉన్నావేంటా అని

కావ్య: ఏరా రాహుల్‌ దాని వర్జినల్‌ అదే..

రాజ్‌: అయినా ప్రేమించిన దాని అందం చూస్తావురా..? దాని ఆస్తి చూడాలి కానీ

కావ్య: ఓరేయ్‌ రాహుల్‌ ఇది ఇష్టం లేకపోతే చెప్పరా..? వెళ్లిపోదాం..

కూయిలీ: బామ్మ గారు నేను వెళ్లి స్నానం చేశానంటే అప్సరసలా ఉంటాను తెలుసా..?

రాహుల్‌: అదంతా తర్వాత నువ్వు వెళ్లి రెడీ అవ్వవా

రాజ్: అసలే నా గోల్డ్‌ బాబు వస్తున్నాడు వాడికి ఇదంతా నచ్చదు

రంజిత్‌: ఇంతకీ గోల్డ్‌ బాబు ఎవరు..?

కూయిలీ: ఎవరైతే ఏంటి..? పేరులోనే గోల్డ్‌ ఉంది

అప్పుడే గోల్డ్‌ బాబు వస్తాడు. నిజంగా దుబాయ్‌ నుంచి వచ్చిన వాడిలా హడావిడి చేస్తుంటాడు.

కూయిలీ: ఇంతకు మీరెవరూ..?

రాజ్: వీడు తెలియదా.? వీడి గురించి చెప్పాలంటే..?

గోల్డ్‌ బాబు: తాత గారు ఆగండి నా గురించి నేనే చెప్పుకుంటాను.. ఐ యామ్‌ గోల్డ్‌ బాబు.. దుబాయ్‌ రిటర్న్‌..

కూయిలీ: దుబాయ్‌లో ఏం చేస్తుంటారు..?

గోల్డ్‌ బాబు: అక్కడి బంగారం బావుల్లో బంగారం తోడేస్తుంటాను..

రంజిత్‌: అక్కడ ఆయిల్‌ బావులు కదా ఉంటాయి..?

గోల్డ్‌ బాబు: నా ఆయిల్‌ బావుల్లో ఆయిల్‌ అయిపోయి బంగారం వస్తుంది. అందుకే ఇప్పటి వరకు వెయ్యి కోట్ల ఆస్తులు సంపాదించాను..

రాజ్‌:  లక్షల కోట్లు సంపాదించినా ఏం లాభంరా మన ఇండియాకు దూరం అయిపోయావు కదా..?

గోల్డ్‌ బాబు: లేదు తాతయ్య అక్కడి ఆస్తులన్నీ తీసుకుని వచ్చేశాను.. నేను ఇక్కడే ఒక కంపెనీ పెట్టుకుని మరో కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను ఇప్పుడు మంచి పార్ట్‌నర్‌ కోసం వెతకాలనుకుంటున్నాను..

కూయిలీ: మీరు వెతకాల్సిన పని లేదు గోల్డ్‌ బావగారు.. మేమే ఉన్నాము.. మా కంపనీలో పెట్టుబడి పెట్టండి.. మీ కంపెనీ మా చేతిలో పెట్టండి

అని కూయిలీ చెప్పగానే.. గోల్డ్‌ బాబు మెల్లగా కూయిలీతో పులిహోర కలిపి ఇద్దరూ కలిసి రూంలోకి వెళ్తారు. తనతో తెచ్చుకున్న గోల్డ్‌ బిస్కట్స్‌ కూయిలీకి చూపిస్తాడు. దీంతో కూయిలీ పూర్తిగా రాహుల్‌ను అవైడ్‌ చేస్తుంది. రాహుల్‌ రుద్రాణికి కాల్‌ చేసి ఎలాగైనా రాజ్‌, కావ్య ఇక్కడి నుంచి వెళ్లపోయేలా చేయమని చెప్తాడు. సరే అంటుంది రుద్రాణి. తర్వాత ఆఫీసులో ఫైల్స్‌ కనిపించపోయే సరికి శృతి రాజ్‌, కావ్యకు ఫోన్‌ చేస్తుంది. ఫోన్లు స్విచ్చాప్‌ వస్తాయి. దీంతో సుభాష్‌ కు కాల్‌ చేసి విషయం చెప్తుంది. దీంతో సుభాష్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!