Brahmamudi Serial Today Episode:  కావ్య కోపంగా రాజ్‌ను తిడుతూ మీకు నిలువెల్లా అహంకారం నిండిపోయిందని.. మీ తలతిక్క నిర్ణయాల వల్ల మీ కన్నతల్లే మిమ్మల్ని అసహ్యించుకుని మా ఇంటికి వచ్చి ఉంటున్నారని తిడుతుంది.  అయినా సరే నువ్వు మా ఇంటికి ఫుడ్‌ ఎందుకు తీసుకొచ్చావు. ఇంకోసారి తీసుకురాకు అంటాడు రాజ్‌. మీ కోసం నేను తీసుకురాలేదు. మా అమ్మమ్మ తాతయ్య కోసం తీసుకొచ్చాను అంటుంది కావ్య.


రాజ్‌: ఏ పక్క నుంచి వాళ్లు నీకు తాతయ్య, అమ్మమ్మలు అయ్యారు. 


ఇందిర: మా పక్క నుంచే మా పెద్దకొడుక్కి ఒ బడుద్దాయి పుట్టాడు.  వాడికి నిలువునా అహంకారం నిండిపోయి వంకరబుద్ది చూపించడం వల్ల ఇంట్లోంచి వెళ్లిపోయినా.. మాకు మనవరాలిగా సేవలు చేస్తూనే ఉంది. 


కావ్య: మా బంధుత్వం గురించి ప్రశ్నించే హక్కు మీకు లేదు. ప్రతిదీ మీర డబ్బుతో కొనలేరు.


సీతారామయ్య: కావ్య మా మనవరాలు. కాదనడానికి ఎవ్వరికీ హక్కు లేదు. అయినా నీవల్ల ఆ పిల్ల సుఖ పడిందని నిలబెట్టి ప్రశ్నిస్తున్నావా..?


రుద్రాణి: భజన బృందం చిడతలు వాయిస్తుంది. ఈవిడ వల్ల మా అపర్ణ వదిన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అది ఎవ్వరికీ కనిపించలేదు. ఓ పూట ఆ కనకం ఏదో వండి పంపిస్తే కావ్య అన్నపూర్ణాదేవి అంశతో పుట్టిన కారణజన్మురాలిగా కనిపిస్తుందా…?


రాజ్‌:  కరెక్టుగా చెప్పావు అత్త అసలు నాటకాలకు పులిస్టాప్‌ పెట్టడానికి కొత్త కుక్‌ ను సెట్‌ చేశాను. 


కావ్య: ఎందుకైనా మంచిది ఈయన కుక్కని తెస్తానంటున్నాడు కరిస్తే జాగ్రత్త.


ఇందిర: వీడి మాటలు నువ్వేమి పట్టించుకోకు కావ్య రేపు కూడా మాకు భోజనం తీసుకురా..


 అని ఇందిరాదేవి చెప్పగానే.. కావ్య  సరేనని వెళ్తుంది. మరోవైపు  కళ్యాణ్ భోజనం చేస్తూ.. అప్పును చూస్తుంటాడు. ఎందుకు కూచి అలా చూస్తున్నావు అని అప్పు అడుగుతుంది. నువ్వు ఆలా చూస్తుంటే నాకు భోజనం చేయాలనిపిస్తలేదు అంటుంది అప్పు.


కళ్యాణ్: ఈరోజు ఎందుకో నిన్ను కన్నార్పకుండా అలాగే చూడాలనిపిస్తుంది పొట్టి.  


అప్పు: ఎందుకు కూచి


కళ్యాణ్‌: నన్ను నమ్మినందుకు.. నాతో వచ్చినందుకు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నాతో ఉన్నందుకు.


అప్పు: ప్రేమ అంటే అదే కదా


కళ్యాణ్‌: ప్రేమ మాత్రమే ఉంటే చాలదు కదా..? దాన్ని గెలిపించుకోవడానికి ధైర్యం కూడా ఉండాలి. నువ్వు పైకి కనిపించినంత కఠినంగా ఉండవని.. ఒక మనిషిని అర్థం చేసుకుంటే ఇంత బాగా చూసుకుంటావని ఇవాళే అర్తం అయింది. అక్కడ అనామికతో మాట్లాడిన మాటలు విన్నాక నన్ను నాకంటే నువ్వే ఎక్కువ నమ్మావు. అంత నమ్మకం ఎందుకు పొట్టి నా మీద.


అప్పు: మనల్ని మనం నమ్మితేనే కదా..? అనుకున్నది సాధించగలం. ఇక సక్సెస్‌ అంటావా.. ? ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్లకు వస్తుంది.


అని అప్పు ఒక ఫిలాసపర్‌ లాగా  చెప్పగానే కళ్యాణ్‌, అప్పును ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మరోవైపు రుద్రాణి టెన్షన్‌ గా అటూ ఇటూ తిరుగుతూ ఎన్ని రకాలుగా కావ్యను ఇబ్బంది పెట్టినా మళ్లీ మళ్లీ ఇంటికి ఏదో రకంగా వస్తుందిన ఈ సారి పర్మినెంట్‌గా రాకుండా ప్లాన్‌ చేయాలని రాహుల్ తో అంటుంది. ఇంతలో స్వప్న వచ్చి మీరు ఎన్ని ప్లాన్స్‌ చేసినా మా స్వప్న  వచ్చి తీరుతుందని చెప్తుంది.  తర్వాత సీతారామయ్య, ఇందిరాదేవి భోజనం చేస్తుంటారు. హాల్లో కూర్చున్న  రాజ్‌ ఆకలితో బాధపడుతుంటాడు. రాజ్‌ను వచ్చి భోజనం చేయమని ఇందిరాదేవి పిలుస్తుంది. రాజ్‌ రానని చెప్తాడు. అందరూ పడుకున్నాక వెళ్లి రాజ్‌ భోజనం చేస్తాడు. అప్పుడే అక్కడికి ఇందిరాదేవి, సీతారామయ్య వచ్చి నవ్వుతారు. వాళ్లను చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు. మరోసటి రోజు భోజనం తీసుకుని కావ్య వస్తుంది. రాజ్‌ పైనుంచి వచ్చి దొంగ చాటుగా వింటుంటాడు. కావ్య గమనించి ఇందిరాదేవికి సైగ చేస్తుంది.   


ఇందిరాదేవి:  ఏరా ఎందుకు దొంగ చాటుగా చూస్తున్నావు కిందకు రాకూడదా..? సీతారామయ్య: రాత్రి చేసిన దొంగతనం గుర్తుకు వచ్చిందా..? లేకపోతే ఇంకో దొంగతనానికి ప్లాన్‌ చేస్తున్నావా..?


కావ్య: ఏంటి తాతయ్యా దొంగతనం చేశారా… ఏం దొంగతనం చేశారు..?


రాహుల్‌: రాజ్‌ నువ్వు చెప్పిన కొత్త కుక్‌ ఇంకా రాలేదేంటి…?


రాజ్‌: ఇంకొద్ది సేపట్లో వస్తుంది.


ప్రకాష్‌: నా పెళ్లానికి కూడా బుద్ది చెప్పడానికి ఇదే మంచి చాన్స్‌ (అని మనసులో అనుకుని) ఏదిరా ఇంకా రాలేదు..


అంటూ ప్రకాష్‌ ఆత్రుతగా అడగ్గానే కోపంగా ధాన్యలక్ష్మీ ఎందుకు అంటుంది. ఇంతలో కొత్త కుక్‌ కారు దిగి ఇంట్లోకి వస్తుంటే అందరూ ఆమెనే చూస్తుంటారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!