Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్య ఆఫీసుకు వెళ్లిపోయాక కళ్యాణ్‌ కూడా అప్పును తీసుకుని స్టేషన్‌కు వెళ్లబోతుంటే.. ధాన్యలక్ష్మీ అపుతుది. ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. దీంతో అప్పు గుడికి వెళ్తున్నామని చెప్తుంది.

Continues below advertisement

ధాన్యలక్ష్మీ: అప్పు చేతిలో గుడికి వెళ్లడానికి కొబ్బరికాయ ఉంది. కానీ నీ భుజానికి ఆ బ్యాగ్ ఏంటి..?

కళ్యాణ్‌: బ్యాగా అంటే అది అమ్మా..

Continues below advertisement

అప్పు: అది అత్తయ్యా బ్యాగ్‌ అంటే..

ధాన్యలక్ష్మీ: చెప్పు కళ్యాణ్‌ ఆ బ్యాగులో ఏం ఉన్నాయి

కళ్యాణ్‌: బ్యాగులో నా లిరిక్‌ పేపర్స్‌ ఉన్నాయి. నిన్నటి నుంచి ఓ సాంగ్‌ రాద్దామంటే ఏ ఆలోచన రావడం లేదు.. అందుకే దేవుడి దగ్గర పెన్నులు పేపర్లు పెట్టి సాంగ్‌ రాద్దామని అనుకుంటున్నాము అది తప్పా..

ధాన్యలక్ష్మీ: నేను  అడుగుతుంది. బ్యాగు ఎందుకు అంత ఎత్తుగా ఉంది. పెన్నులు, పేపర్లు అంత ఎత్తు ఉంటాయా..?

ప్రకాష్: దేవుడికి సమర్పించడానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నారేమో

అని చెప్పగానే.. కళ్యాణ్‌, అప్పు కూడా అదే పట్టువస్త్రాలు తీసుకెళ్తున్నాము అని చెప్పి వెళ్లిపోతారు.  మరోవైపు ఆఫీసుకు వెళ్లిన రాజ్‌, కావ్యకు ఎప్లాయిస్‌ గ్రాండ్‌ వెలకం చెప్తారు. అందరూ కనిపిస్తారు కానీ మేనేజర్‌ కనిపించడు.

కావ్య: అదేంటి శృతి మేనేజర్‌ సతీష్ కనిపించడం లేదు.

శృతి: ఆయన రెండు రోజుల క్రితమే రిజైన్‌ చేసి వెళ్లారు. ఆయన రాహుల్ సార్‌ కంపెనీలో జాయిన్‌ అయ్యారంట సార్‌.. మీరు ఫోన్‌ చేసి మాట్లాడతారా..? సార్‌

రాజ్: లేదు కొత్త మేనేజర్‌ పోస్టుకు ఇంటర్వూ కండక్ట్‌ చేయండి. ఎవరు వచ్చినా నా దగ్గరకు పంపించు

శృతి: అలాగే సర్‌..

అని చెప్పగానే రాజ్‌, కావ్య చాంబర్‌ లోకి వెళ్లిపోతారు. ఇక రాహుల్‌ తన కొత్త ఆఫీసులో కూర్చుని సతీష్‌ను పిలుస్తాడు. సతీష్‌ రాగానే..

రాహుల్‌:  సతీష్‌  నీ ఎక్స్‌ ఫీరియన్స్‌ అంతా ఉపయోగించి స్వరాజ్‌ కంపనీతో ఉన్న క్లయింట్స్‌ మొత్తం మన కంపెనీకి వచ్చేలా చూడాలి

సతీష్‌: అలా జరగదు సార్‌ వాళ్లందరికీ రాజ్‌ సార్‌ అంటే చాలా నమ్మకం

రాహుల్‌: వాళ్లకు నువ్వంటే కూడా నమ్మకమే కదా..? ఆ నమ్మకాన్ని ఉపయోగించి వాళ్లను ఒకరికి తెలియకుండా ఒకరిని మీటింగ్‌కు పిలువు

సతీష్‌:  సరే సార్‌.. రేపే అందరినీ మీటింగ్‌కు పిలుస్తాను

అని చెప్పి సతీష్‌ వెళ్లిపోతాడు. ఇక స్వరాజ్‌ గ్రూప్‌ కంపెనీ కోటలు కూలబోతున్నాయి.. ఆ కూలిన ఇటుకలతో ఆర్ కంపెనీ పునాదులు కడతాను అని మనసులో కసిగా అనుకుంటాడు రాహుల్‌. మరోవైపు అప్పు స్టేషన్‌కు వెళ్లి డ్యూటీలో జాయిన్‌ అవుతుంది. పాప మిస్సింగ్‌ కేసు డీటెయిల్స్‌ తెలుసుకుంటుంది ఇంతలో అక్కడికి సీఐ వస్తాడు.  

సీఐ: ఏంటి అపూర్వ మళ్లీ డ్యూటీలో జాయిన్‌ అయ్యావా..?

అప్పు: అవును సార్‌ జాయిన్‌ అయ్యాను

సీఐ: ఏంటమ్మా ఇంత సడెన్‌గా

అప్పు: మీరే అన్నారు కదా సార్‌ ఆ పాప కేసు చూడటానికి ఎవ్వరూ లేరు కావాలంటే నువ్వే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయమని అందుకే వచ్చాను సార్‌

సీఐ: నేను ఏదో కాజువల్‌గా అన్నాను అమ్మ

అప్పు: నేను సీరియస్‌గా తీసుకున్నాను సార్‌

సీఐ: అది క్లోజ్‌ అయిన కేసు అమ్మా దానికి ఎందుకు టైం వేస్ట్

అప్పు: ఏదో ప్రయత్నం చేయాలనిపించింది సార్‌

సీఐ: నీకెలా చెప్పాలో నాకేమీ అర్తం కావడం లేదమ్మా..

అని సీఐ వెళ్లిపోతాడు. అప్పు ఈ కేసుకు సంబంధించి మొదట రేణుకను కలవాలి అని కానిస్టేబుల్‌ ను తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు ఆఫీసులో టర్నోవర్‌ పెంచడానికి కొత్త డిజైన్స్‌ చేయించాలని రాజ్‌, కావ్య డిసైడ్‌ అవుతారు. రేణుక దగ్గరకు వెళ్లిన అప్పు మిస్సింగ్‌ కేసు ఎంక్వైరీ చాలా సీరియస్‌ గా చేస్తుంది. ఏడుస్తున్న రేణుకను ఓదారుస్తుంది. రేణుక భర్తను ఎంక్వైరీ చేయాలనుకుంటుంది. తర్వాత రాత్రికి దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే.. రాహుల్‌ మేనేజర్‌ విషయం రాజ్‌కు అడగకుండానే మరో రకంగా చెప్తాడు. సతీషే కావాలని తన దగ్గరకు వచ్చాడని చెప్తాడు. దీంతో రాజ్‌ పెద్దగా పట్టించుకోడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!