Brahmamudi Serial Today Episode: కూయిలీ ఇంటికి తాత, బామ్మల గెటప్‌లో వెళ్లిన రాజ్‌, కావ్యలను రాహుల్‌ గుర్తు పట్టి అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్తాడు. దీంతో రాజ్‌, కావ్య తమ ఆస్థి గురించి చెప్పగానే కూయిలీ, రాహుల్‌ను తిడుతుంది.

Continues below advertisement

కూయిలీ:  మీరు ఎక్కడికి వెళ్లొద్దు.. ఇక్కడే నాతోనే ఉండాలి.. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను.

రాజ్: ఆహా దీని మాటలు వింటుంటే చెవుల్లో సీసం పోసినట్టు ఉంది కదా..?

Continues below advertisement

కావ్య: మరే మనకు ఏ లోటు రాకుండా చూస్తాను అంటుంటే ఇక మన ఆస్థిని దీని చేతిలో పెడితే.. ఆ ఆస్తిని ఇంకెంత బాగా చూసుకుంటుందో..

కూయిలీ: అవును బామ్మ గారు కరెక్టుగా చెప్పారు.. చాలా బాగా చూసుకుంటాను.

రాహుల్‌: ఆస్థి లేదు ఏమీ లేదు.. నేను రాను మీరు వెళ్లండి

కూయిలీ: చెప్పాను కదా రాహుల్‌ వాళ్లు ఎక్కడికి వెళ్లరని.. బామ్మ, తాతయ్యలకు నేను కనెక్టు అయిపోయాను. నాకు మా తాతయ్య, బామ్మలను చూసినట్టు ఉంది. వాళ్లకు కావాలసినన్ని రోజులు ఇక్కడే ఉంటారు

కావ్య: పెనిమిటి ఫిక్స్‌ చేసేసింది

రాజ్‌:  నేను అప్పుడే అనుకున్నాను.. దీని ముఖం కందగడ్డలా ఉన్నా మనసు ఎర్రగడ్డలా ఉంది

రాహుల్‌: కూయిలీ నువ్వు వెళ్లి వీళ్లకు కాఫీ తీసుకురా మీ మామయ్యను కూడా తీసుకెళ్లు.. నేను వీళ్లతో మాట్లాడాలి.

కావ్య: ఏం మాట్లాడతావురా..?

రాహుల్‌: కూయిలీ మీరు లోపలికి వెళ్లండి

అనగానే కూయిలీ రంజిత్‌ వెల్లిపోతారు. రాజ్‌, కావ్యను తీసుకుని గార్డెన్‌ లోకి వెళ్తాడు రాహుల్‌. ఎందుకొచ్చారని అడుగుతాడు. ఓహో మమ్మల్ని గుర్తు పట్టావా..? అంటాడు రాజ్‌.

రాహుల్‌: గుర్తు పట్టక మీరేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా..?

రాజ్‌: అయితే మంచిది మర్యాదగా మాతో ఇంటికి వచ్చేయ్‌ లేదంటే నీకు ఆస్థిలో చిల్లిగవ్వ కూడా రాదని నీ కూయిలీకి చెప్పేస్తాము.

అంటూ బెదిరించగానే..  రాహుల్‌ ఇంటికి రానని.. కూయిలీకి మీరు నిజం చెప్పొద్దని రిక్వెస్ట్‌ చేస్తాడు. దీంతో కావ్య రాహుల్‌ ను తిడుతుంది. ఇంతలో కాపీ తీసుకుని కూయిలీ వస్తుంది. కాఫీ తీసుకుని తాగి బయటకు ఊసేస్తారు రాజ్‌, కావ్య.

కూయిలీ: అయ్యో బామ్మ గారు ఏమైంది

రాజ్‌: ఇది కాఫీయా… కుడితా..?

కావ్య: ఈ కాఫీ కుడితి నీళ్లలా ఉందేంటే..? అంటే నీకు కాఫీ పెట్టడం కూడా రాదా..?

రాజ్‌: కాఫీ పెట్టడం రాని దానితో నువ్వు కాపురం ఎలా చేస్తావురా..? ఎదవ

కూయిలీ: అయ్యో సారీ తాతయ్య గారు..

కావ్య: అర్థం అయింది దీనికి వంట కూడా వచ్చినట్టు లేదుగా.. ఓరేయ్‌ రాహుల్‌ దీన్నా నువ్వు కావాలంటున్నది.. వద్దురా వద్దు

కూయిలీ:  బామ్మ గారు అలా అనకండి మీకు కావాల్సినవన్ని .. మీరు తినాల్సినవన్నీ హోటల్‌ నుంచి తెప్పిస్తాను

రాజ్: హోటల్‌ నుంచి తెప్పిస్తావా..?

కావ్వ: ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నుంచి తప్ప వేరే హోటల్‌ ఫుడ్‌ మేము తినము

కూయిలీ:  సరే అలాగే తెప్పిస్తాను..

అనగానే రాజ్‌, కావ్య తమకు కావాల్సిన ఐటెమ్స్ లిస్ట్‌ చెప్తారు. కూయిలీ ఆ లిస్ట్‌ తీసుకెల్లి రంజిత్‌కు ఇస్తుంది. అది చూసిన రంజిత్‌ షాక్‌ అవుతాడు. ఒక్క పూటకే ఇంత ఖర్చా అని బాధపడతాడు. వాళ్ల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి వెయ్యి రెట్ల ఆస్థిని నొక్కోయాలి అని చెప్తుంది కూయిలీ. ఇక రాహుల్‌ను గుర్తు చేసుకుని స్వప్న బాధపడుతుంటే అప్పు వచ్చి ఓదారుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!