Brahmamudi Serial Today Episode: స్వప్న కట్టుకొచ్చిన శారీని చూసిన ధాన్యలక్ష్మీ.. ఆ శారీ బాగా లేదని ఎందుకు కట్టుకున్నావని అడుగుతుంది. ఇంత నాసిరకమైన శారీ ఎప్పుడు కట్టవు కదా అని అడుగుతుంది. ఆలాంటి చీర కట్టుకోవడానికి అసహ్యంగా లేదా అంటుంది.

Continues below advertisement

స్వప్న:  నాకు బాగుంది

ధాన్యలక్ష్మీ: నీకు బాగుండటం కాదు స్వప్న బయటి వాళ్లు ఎవరైనా చూస్తే మాకు బాగోదు

Continues below advertisement

స్వప్న:  ఈ చీర రాహుల్‌ నా కోసం తెచ్చిన చీర

ఇందిరాదేవి: ఏంటి వాడు నీకోసం చీర తెచ్చాడా..?

స్వప్న:  అవును రాహులే తెచ్చాడు

ధాన్యలక్ష్మీ: తెస్తే తెచ్చాడు కానీ ఈ నాలుగు  వందల రూపాయల చీర నెవ్వెలా కట్టుకున్నావు స్వప్న

స్వప్న: నేను చీర ఖరీదు గురించి ఆలోచించలేదు నా భర్త నా కోసం తన కష్టార్జీతంతో తెచ్చిన చీర ఇది నాకు చాలా గొప్పది

ధాన్యలక్ష్మీ: ఏంటో నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎలా ఆలోచిస్తావో  ఎవ్వరికీ అర్థం కాదు

రాహుల్: స్వప్న నేను నీకు ముందే చెప్పాను కదా ఈ చీర నీకు తగదు అని ఇలాంటి సమస్య వస్తుందని ముందే చెప్పాను వెళ్లు వెళ్లి ఈ చీర మార్చుకో

స్వప్న: ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం ఈ చీర నేను మార్చుకోను నిన్ను డిస్సపాయింట్ చేయను

అప్పు: ఉండనీలే అత్తయ్య అక్కకు ఈ చీర బాగానే ఉంది

రాజ్‌, కావ్య వస్తారు..

రాజ్‌: రాహుల్‌ ఈరోజు టెండర్‌ ఉంది. నువ్వు ఈ చెక్‌ తీసుకుని బ్యాంకుకు వెళ్లి ఇరవై లక్షలు తీసుకుని టెంబర్‌ ఆఫీసుకు వెళ్లు

రాహుల్‌: నేను బ్యాంకు కు అది కూడా ఇరవై లక్షల  క్యాష్‌ విత్ డ్రా చేయడానికా..?

రాజ్: ఎన్నాళ్లని ఖాళీగా ఉంటావురా.. ముందు ఇలాంటి చిన్న చిన్న పనులు చూడు

సుభాష్‌: రాజ్‌ ఏంటిది ఆఫీసు పనులు వాడు చూసేది ఏంటి.? అయినా ఇరవై లక్షల క్యాష్‌ తీసుకురమ్మని వాడికి చెప్తున్నావు ఎందుకు అలా

రాజ్: టెండర్‌ టైంకి డబ్బు కట్టాలి కదా నాన్న

సుభాష్‌: అందుకు బాబాయ్‌ ఉన్నాడు కదా

రాజ్‌: బాబాయ్‌ గంట ముందే టెండర్‌ ఆఫీసు దగ్గర ఉండాలి. ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాలి కదా ఈ లోపు రాహుల్ పని పూర్తి చేసుకుని వెళ్తాడు..

ధాన్యలక్ష్మీ: అదే దానికి రాహులే ఎందుకు

రాజ్‌: రాహులే చేయాలి పిన్ని

రాహుల్‌: రాజ్‌ ఇంత బాధ్యతను నన్ను నమ్మి నాకు అప్పగిస్తున్నావా..? థాంక్యూ రాజ్‌

రాజ్‌: నేను కూడా అంత ధైర్యం చేయలేను రాహుల్‌ కానీ ప్రతి మనిషిని నమ్మి ఒక అవకాశం ఇవ్వాలి కదా ఆ అవకాశమే నీకు ఇమ్మని కళావతి చెప్పింది.

కావ్య: మీరు ఎవ్వరూ భయపడకండి రాహుల్‌ తన పని తాను కరెక్టుగా చేస్తాడు

రాజ్‌: ఈ టెండర్‌ మనకు చాలా ఇంపార్టెంట్‌ కరెక్టు పదకొండు గంటలకు బాబాయ్‌ కి డబ్బులు ఇవ్వాలి

రాహుల్‌: థాంక్యూ రాజ్‌.. నేను నీ నమ్మకాన్ని నిలబెడతాను

అని బ్యాంకు వెళ్లిపోతాడు. ప్రకాష్‌ టెండర్‌ ఆఫీసుకు వెళ్తాడు. సుభాష్‌ బయటకు వెళ్లిపోతాడు. కావ్య దగ్గరకు స్వప్న వెళ్లి థాంక్స్‌ చెప్తుంది. తర్వాత బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వచ్చిన రాహుల్‌ ను దొంగలు కొట్టి డబ్బు తీసుకుని పారిపోతారు. టెండర్‌ ఆఫీసుకు రాహుల్ ఇంకా రాలేదని ప్రకాష్‌, రాజ్‌ కు ఫోన్‌ చేసి చెప్తాడు. విషయం తెలియగానే ఇంట్లో అందరూ రాహుల్‌ను తిడుతుంటారు. స్వప్న బాధపడుతుంది. ఇంతలో రాహుల్‌ దెబ్బలతో వచ్చి తనను దొంగలు అడ్డగించారని కొట్టి డబ్బు లాక్కెళ్లారని కానీ డబ్బు సేఫ్‌గా తీసుకొచ్చానని చెప్తాడు. మళ్లీ ఇదో డ్రామానా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన సుభాష్‌ కోపంగా రాహుల్‌ చెప్పింది నిజమే అంటూ తాను చూసింది చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!