Brahmamudi Serial Today Episode: కావ్యకు సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన రాజ్‌.. నీకేం కావాలో చెప్పు కళావతి అని అడుగుతాడు. దీంతో కావ్య ఇరిటేటింగ్‌గా చూస్తుంది.

Continues below advertisement

కావ్య: అడగకుండా నాకు ఏమి ఇష్టమో తెలుసుకుని ఆర్డర్‌ చేస్తే అది గొప్ప

రాజ్‌: నన్ను ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోనివ్వవా..? కళావతి మళ్లీ నాకు ఇదో టెన్షనా

Continues below advertisement

కావ్య: అంటే నాకు ఏమి ఇష్టమో నీకు తెలియదు అన్నమాట

రాజ్‌: అంటే దీనికి ఏమి ఇష్టమో తెలియదు అని ఇప్పుడు  అన్నానంటే ఇది ఏదో గోల చేస్తుంది ( మనసులో) నేను అన్నానా నీకు ఏది ఇష్టమో తెలియదు అన్నానా..?

కావ్య: అయితే నాకు ఇష్టమైంది మీరే ఆర్డర్‌ ఇవ్వండి

రాజ్‌: సరే ఇప్పుడు చూడు ఎలా ఆర్డర్‌ ఇస్తానో

అని రాజ్‌ ఆర్డర్‌ ఇచ్చి కరెక్టేనా అని అడుగుతాడు. కాదని కావ్య చెప్తుంది.

కావ్య: మీరు ఇచ్చినవి అన్ని మీకు నచ్చినవి

రాజ్: (మనసులో) ఏంటి ఇంత ఆలోచించి ఆర్డర్‌ చేసినా తప్పు అయిపోయయా..?

కావ్య: మీకు నచ్చినవి ఏవో నేను ఆర్డర్‌ చేయనా..? (బేరర్‌ను పిలిచ కావ్య ఆర్డర్‌ చేస్తుంది.) ఏంటి కరెక్టు గా చెప్పానా..?

రాజ్‌: ఇంట్లో గరిట నీ చేతుల్లో ఉంటుంది కాబట్టి నాకు ఏది ఇష్టమో తెలుసుకున్నావు

కావ్య: అదేం లేదు గరిట మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. కానీ నేను మీ చేతుల్లో ఉంటాను అయినా మీరు తెలుసుకోలేకపోయారు

అని చెప్తుండగానే.. రాజ్‌ బేరర్‌ వాటర్‌ బాటిల్‌ ఇవ్వు అని అడగ్గానే రాహుల్‌ బేరర్‌ గెటప్‌లో వచ్చి వాటర్‌ బాటిల్‌ ఇస్తాడు. రాహుల్‌ ను చూసిన రాజ్‌, కావ్య షాక్‌ అవుతారు.

రాజ్: ఏంట్రా ఇది

రాహుల్‌: నేను ఇక్కడ బేరర్‌ను సార్‌ ఆర్డర్‌ ఏమైనా చేశారా..?

కావ్య: ఏం మాట్లాడుతున్నావు రాహుల్‌ నువ్వేంటి ఇక్కడ బేరర్‌గా పనిచేయడం ఏంటి..?

రాహుల్‌: మనిషి అన్నాక ఏదో ఒకటి చేసుకుని బతకాలి కదా మేడం

కావ్య: రాహుల్‌ ముందు నువ్వు మేడం అనడం ఆపు

రాహుల్‌: ఇలాంటి చోట కస్టమర్‌ను రెస్పెక్ట్ చేయడం రూల్‌..

రాజ్‌: ఇలాంటి పనులు చేసి ఇంటి పరువు తీయకూడదన్న రూల్‌ లేదా..?

రాహుల్‌: ఆ పరువు తీసిన వాడిని లెక్కకు అందని తప్పులు చేసిన వాడిని.. ఇప్పుడు కళ్లు తెరిచినవాడిని కానీ నేను మారాను అంటే నమ్మడానికి ఎవ్వరూ లేరు. నిజాయితీగా నా భార్యబిడ్డలను పోషించుకోవడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు రాజ్ అందుకే ఇక్కడ పనిలో చేరాను

రాజ్‌: నువ్వు మారావని నిరూపించుకోవడానికి ఇలాంటి చోట ఈ పని చేయాల్సిన అవసరం లేదు రాహుల్‌.. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నీకంటూ కష్టం వస్తే మేమంతా ఉన్నాము

కావ్య: అయినా ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది రాహుల్‌

రాహుల్‌: తన మీద తనకు నమ్మకం పోయినప్పుడు.. ఇచ్చిన అవకాశాన్ని వదులుకున్నప్పుడు.. బతుకు మీద ఆశ చచ్చిపోయినప్పుడు  ఇంతకన్నా ఏం చేయగలం. ఇప్పటి దాకా మీరు నాకు చాలా చేశారు రాజ్‌ ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను.. నా భార్యను కన్నీళ్లను పెట్టించలేను

అంటూ ఎమోషనల్‌ అవుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజ్‌. తర్వాత కావ్యను కొంత మంది రౌడీలు అక్కడ అల్లరి చేస్తుంటే రాజ్‌ వచ్చి వాళ్లతో ఫైటింగ్‌ చేసి కొడతాడు. రాజ్‌ ఫైటింగ్‌ చేస్తుంటే కావ్య చూసి ఆనందిస్తుంది. తర్వాత రాజ్‌, కావ్య ఇంటికి వెళుతూ రాహుల్‌ గురించి ఆలోచిస్తారు. తర్వాత రాహుల్‌ ఇంటికి వెళ్లి తన కష్టార్జితంతో నీకో శారీ కొన్నానని స్వప్నకు ఇస్తాడు. మరునాడు స్వప్న ఆ చీర కట్టుకుని హాల్లోకి వెళ్లగానే.. ఆ చీర బాగాలేదని ధాన్యలక్ష్మీ చెబితే తనకు చాలా బాగా నచ్చిందని స్వప్న చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!