Brahmamudi Serial Today Episode:  ఆఫీసుకు వచ్చిన కావ్యతో రాజ్‌ గొడవ పడతాడు. దీంతో కావ్య బూత్‌ బంగ్లా గురించి చెప్పడంతో శృతి అసలు ఈ బూత్‌ బంగ్లా ఏంటని అడుగుతుంది. కావ్య చెప్పబోతుంటే రాజ్‌ అపుతాడు. కావ్య సీఈవో క్యాబిన్‌లోకి వెళ్తుంటే రాజ్‌ ఆపుతాడు. నిన్న తాతయ్య పందెం కాసినప్పటి నుంచి నువ్వు నేను సమానమే అంటాడు. నువ్విప్పుడు ఈ క్యాబిన్‌ లోకి వెళ్లకూడదు అంటాడు. కొత్తవారు వచ్చే వరకు పాతవారే సీట్లో కూర్చుంటారు అని కావ్య చెప్పగానే రాజ్‌ ఇరిటేటింగ్‌ గా శృతికి స్టాప్‌ అందరిని పిలువు వారితో మాట్లాడాలి అంటాడు. సరేనని శృతి వెళ్లిపోతుంది. మీటింగ్‌ మొదలవుతుంది.


రాజ్‌: మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రప్పించాను అంటే రేపటి నుంచి పరధ్యాన శృంఖలాలు తెంచుకుని  ఈ నియంతృత్వ పాలన నుంచి స్వాతంత్రం సంపాదించుకుని వెట్టి చాకిరి వ్యవస్థిని సమూలంగా నిర్మూలించి రేపటి కోసం మన భవిష్యత్తు కోసం స్వేచ్చగా ఆఫీసులోకి అడుగుపెట్టే సమయం ఆసన్నం అయిందని చెప్పడానికి మీ అందరినీ రమ్మన్నాను.


ఉద్యోగి: అంటే సార్‌ రేపటి నుంచి మీరు ఆఫీసుకు రారా..?


రాజ్‌: రేయ్‌ ఎవర్రా ఆ కూత కూసింది.


కావ్య: అసలు అందరినీ ఎందుకు రమ్మన్నారో తెలుగులో చెప్పండి.


రాజ్‌: తెలివి ఉన్నోళ్లకు అర్థం అవుతుంది. మన ఆఫీసులో గత కొన్ని రోజులుగా  ఒక మహిళా  అధికారం కింద పురుషుల ఉనికి తొక్కివేయబడుతుంది. అందుకే నేను ఒక ఉద్యమం లేవదీసాను. దాని ఫలితమే ఈ పందెం.


అంటూ చైర్మన్‌ గారు పెట్టిన పందెం గురించి చెప్పి.. నా టీంలో చేరాల్సిన వాళ్లు నా పక్క.. ఆవిడ పక్క చేరాల్సిన వాళ్లు అటుపక్క వెళ్లండి అని చెప్పగానే అందరూ కావ్య వైపు వెళ్తారు. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. సెక్యూరిటీని పిలిచి చీటీలు అందరికీ ఇవ్వమంటాడు. అందులో మీకు మా ఇద్దరిలో ఎవరి పేరు వస్తే వాళ్ల వైపు మీరు వెళ్లాలని చెప్తాడు. దీంతో సగం మంది.. రాజ్‌ వైపు వెళ్తారు. జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ దగ్గరకు అనామిక వెళ్తుంది.


ప్రసాద్‌: ఏదో ఇంపార్టెంట్‌ విషయం చెప్పాలి అన్నారు ఏంటో చెప్పండి.


అనామిక: నా పేరు అనామిక సార్‌ సామంత్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీకి వన్‌ ఆఫ్‌ ది పార్ట్‌నర్‌.


ప్రసాద్‌: మరి నన్నెందుకు కలవానుకుంటున్నారు.


అనామిక: మీ ఊరిలో ఉన్న గుడిని పునర్నిర్మాణం చేస్తున్నారు అని తెలిసింది.


ప్రసాద్‌: అర్థమైంది. ఆ కాంట్రాక్ట్‌ మీ కంపెనీకి ఇవ్వమని అడగడానికి వచ్చారా..? కానీ నేను ఆ కాంట్రాక్ట్ ను స్వరాజ్‌ కంపెనీకి ఇచ్చాను.


అనామిక: అలా ఇచ్చి తప్పు చేశారని చెప్పడానికే వచ్చాను.


ప్రసాద్‌: తప్పు చేయడం ఏంటి..? ఇప్పుడు మార్కెట్‌ లో ఆ కంపెనీయే కదా నెంబర్‌ వన్‌ గా ఉంది.


అనామిక: అందంతా ఒక్కప్పటి మాట సార్‌ రీసెంట్‌ గా బెస్ట్ డిజైనర్‌ అవార్డు కూడా మా కంపెనీకే వచ్చింది. దానికి కారణం ఏంటో తెలుసా..? ఆ ఇంట్లో గొడవలు. అందుకే రాజ్‌ ఆఫీసును రాజ్‌ సరిగ్గా చేసుకోలేదు.


అంటూ అనామిక లేనిపోని కట్టుకథలు చెప్పి ప్రసాద్‌ను ఒప్పించాలని మాట్లాడుతుంది. దీంతో ప్రసాద్‌ నాకు కొంచెం టైం కావాలని అడుగుతాడు. సరేనని అనామిక వెళ్లిపోతుంది. మరోవైపు రైటర్‌ లక్ష్మీకాంత్‌ దగ్గరకు వెళ్లిన కళ్యాణ్‌కు తన దగ్గర అసిస్టెంట్‌ గా పెట్టుకుంటానని కానీ కొన్ని కండీషన్స్‌ ఉన్నాయని మూడేండ్ల వరకు నువ్వు బయట అవకాశాల కోసం ప్రయత్నించకూడదు. అలా అని అగ్రిమెంట్‌ పేపర్‌ మీద సైన్ చేయాలని అడుగుతాడు. సరేనని సైన్‌ చేసి వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్‌ తన సైడు వచ్చిన ఎంప్లాయీస్‌ తో మీటింగ్‌ పెట్టుకుంటాడు. శృతి వచ్చి చాటుగా చూస్తుంది.


రాజ్‌: గుంటనక్కలు పక్కనుంచి తొంగి చూస్తుంటాయి. వాటి విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఇది మన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. మన టీం గెలిస్తే నా వాగ్దానాలు అన్ని తీరుస్తాను. మీరు చేయాల్సిందల్లా అందమైన డిజైన్స్‌ గీయడమే..


ఉద్యోగులు: సూపర్‌ సార్‌.. మీరే మళ్లీ సీఈవో అవుతారు.


మరోవైపు కావ్య తన సైడు ఎంప్లాయీస్‌ తో మాట్లాడుతుంది. కావ్య


కావ్య: చూడండి ఇప్పుడు మనకేదో కాంట్రాక్టు వచ్చిందని మేమేదో పందెం కట్టుకున్నామని హడావిడి చేయాల్సిన అవసరం లేదు. టైం తీసుకున్నా పర్వాలేదు. చేసే పనిని మనసు పెట్టి చేయండి. పోటీ ఉండాలి కానీ ఆ పోటీ మనతో మనకే ఉండాలి. మనం గెలవాలి అని ప్రయత్నించండి.


ఉద్యోగులు: అలాగే మేడం.


శృతి: ఒకసారి మీరు ఇలా రండి మేడం. ఇక్కడ మీరేమో శాంతి ప్రవక్తలాగా నీతి ప్రవచనాలు చెప్తున్నారు. అక్కడ ఆయనేమో ఉద్యోగులందరికీ ఆవేశాన్ని నూరిపోస్తున్నారు మేడం. ఆయన మాటలు విన్న ఎంప్లాయీస్‌ అందరూ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.


కావ్య: చూడు శృతి నేను సీఈవోగా బాధ్యతలు తీసుకున్నాను కానీ నేను కూడా నీలాగే ఎంప్లాయిని మాత్రమే. అద్బుతాలు జరగాలంటే మనం ఏవో గొప్ప పనులు చేస్తే సరిపోదు. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేస్తే చాలు.


అని చెప్పగానే..శృతి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు అందరూ భోజనం చేయడానికి డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వస్తారు. ధాన్యలక్ష్మీ రాలేదని వంట మనిషిని అడిగితే తాను భోజనం చేయనని ముఖం మీదే తలుపు వేశారని చెప్తుంది. దీంతో   ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!