Brahmamudi Serial Today Episode: రుద్రాణి వెళ్లి ధాన్యలక్ష్మీన రెచ్చగొడుతుంది. ఆస్థులు పంచకుండా కావ్య అడ్డుపడుతుందేమోనని చెప్తుంది. కావ్య అడ్డుపడక ముందే ఆస్థుల పంపకాలు జరిగిపోవాలి అని చెప్తుంది. దీంతో కావ్య అడ్డు పడినా.. ఎవరెన్ని వేషాలు వేసినా ఆస్థి పంపకాలు జరగాల్సిందే అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇప్పుడు కావ్య మీద నిందలు పడకుండా ఉండేందుకైనా ఆస్థి పంచుతారు అనుకుంటుంది. తర్వాత రోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా.. ధాన్యలక్ష్మీ వస్తుంది.
ధాన్యలక్ష్మీ: మామయ్య గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అన్నారు. వారి మీద గౌరవంతో ఇప్పటి వరకు ఓపిక పట్టను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్తారని ఎదురుచూస్తున్నాను మామయ్యగారు.
సీతారామయ్య: ఇది ఇంటి పెద్దగా నాకు అగ్నిపరీక్ష. నిర్ణయం తీసుకోవాలన్నా.. పరిష్కారం ఆలోచించాలన్నా.. వందేళ్ల చరిత్రను ఒక్కరోజులో మార్చలేని ధైర్యం లేని అసక్తత ఆవహిస్తుంది. కాస్త వ్యవధి కావాలని మాత్రం అడగాలనుకుంటున్నాను.
ధాన్యలక్ష్మీ: ఎంత సమయం కావాలి మామయ్య గారు చెప్పండి ఎంత సమయం కావాలి. మీరు సమయం అడిగే లోపు ఏదైనా జరగొచ్చు. లేదంటే అంతా కలిసి నా నోరు మూయించొచ్చు.
ఇందిర: ధాన్యలక్ష్మీ ఏం కావాలి నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు. అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు. నా కొడుకు చవటలా కూర్చుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఏరా సిగ్గు లేదా… నీకు. నీ తండ్రి నిస్సహాయంగా మాట్లాడుతుంటే
ధాన్యలక్ష్మీ: నేనేం నిస్సహాయంగా..
ఇందిర: నోరు మూయ్.. కోడలి మీద చేయి చేసుకున్న మచ్చ రాకూడదని ఊరికే ఉన్నాను. మీ తాతముత్తాల ఆస్థులు ఏమైనా పసుపు కుంకుమ కింద తీసుకొచ్చి మా ఆస్థుల్లో కలిపిపావా..? కోడలిగా హక్కులు అడిగే ముందు బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలి.
రుద్రాణి: నాకు తెలసుసమ్మా.. ఇలా గట్టిగా అరిచి నోట్లో మట్టి కొట్టి..
స్వప్న: అత్తా ఇంకొక మాట మాట్లాడితే నేనే నిన్ను ఇంట్లోంచి గెంటివేస్తాను. ఈ ఇంటిని ముక్కలు చేయమన్న ఆలోచన ధాన్యలక్ష్మీ ఆంటీలో కలిగించింది నువ్వే అని నాకు తెలుసు. అయినా నీ మొగుడు సంపాదించిన ఆస్థులు ఏమైనా ఉన్నాయా..? ఇక్కడ.
అని స్వప్న, రుద్రాణిని తిడుతుంది. ఇంతలో రాజ్ వచ్చి పిన్ని అప్పును కోడలిగా అంగీకరిస్తే కళ్యాణ్ వచ్చి ఇక్కడే ఉంటాడు కదా..? అని చెప్పగానే నువ్వు సరిగ్గా చెస్తే ఇంకొకరికి నీతులు చెప్పు రాజ్. పెళ్లాన్ని ఇంట్లోంచి వెళ్లగొట్టిన నువ్వు నీతులు చెప్పడం ఏంటి అని తిట్టి సీతారామయ్యను తీసుకుని వెళ్లిపోతుంది ఇందిరాదేవి. మరోవైపు రాజ్ సార్ డిజైన్స్ అప్రూవల్ చేయడం లేదని అడిగితే మీ సీఈవోతో చెప్పుకో అంటున్నాడు అని చెప్పగానే కావ్య ఫైల్ తీసుకుని రాజ్ దగ్గరక వెళ్తుంది.
కావ్య: సంతకం చేయండి.
రాజ్: మూడ్ లేదు.
కావ్య: ఇప్పటికే లేట్ అయింది. వాళ్లకు మనం డిజైన్స్ ఇవ్వాలి. రెండు రోజుల్లో మాన్యుఫాశ్చరింగ్ చేయించాలి. మూడు రోజుల్లో డెలవరీ చేయించాలి. ఎందుకు సంతకం చేయలేదు.
రాజ్: లేబర్ పెయిన్స్ రాలేదు. అదే డెలివరీ చేయాలంటే నొప్పులు రావాలి కదా..?
కావ్య: సరైనా కారణం ఉందా… చూడండి మీకు నాకు ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. పర్సనల్ లైఫ్‌ని ప్రొఫెషనల్ లైఫ్‌ని కలపకండి.
రాజ్: నాకు నీతో పర్సనల్ లైఫ్ కూడా ఉందా..?
కావ్య: అది భూత్ బంగ్లాను అడిగితే తెలస్తుంది.
అని కావ్య చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. తాను సీఈవోగా నిన్ను డిస్మిస్ చేస్తానని బెదిరిస్తుంది. చాటు నుంచి శృతి వింటుంది. దీంతో రాజ్ ఇగో హర్ట్ అవుతుంది. కావ్యను నీ అంతు చూస్తానని చెప్తాడు. ఆ ఫైల్ తీసుకుని బయటకు వెళ్తూ.. ఈఫైల్ నేను తీసుకెళ్తున్నాని చెప్పు అని శృతికి చెప్పి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన రాజ్ సీతారామయ్యతో కళావతిని సీఈవో బాధ్యతల నుంచి తప్పించండి అని లేదంటే ఇంట్లో గొడవలు ఇంకా పెరిగిపోతాయని చెప్తాడు. దీంతో సీతారామయ్య కోపంగా రాజ్‌ను తిడతాడు. మరోవైపు రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటుంటారు.
రుద్రాణి: ఇంత కష్టపడి ప్లాన్ చేసి ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి ముందుకు తోస్తే ఆ ముసలోడు ఆస్తిని ముక్కలు చేస్తాడనుకున్నాను. కానీ సింపుల్ గా తప్పించుకున్నాడు.
రాహుల్: ఎక్కడ తప్పించుకున్నాడు మమ్మీ. జస్ట్ టైం కావాలన్నాడు. చిన్న అత్తయ్య వదిలేస్తుందా..? ఏంటి.. ?
రుద్రాణి: ఇన్ని జరుగుతున్నా మీ తాతయ్య గురించి నీకింకా అర్థం కాలేదా..? ఇంత ప్లాన్ చేసి కావ్యను ఇంట్లోంచి వెళ్లగొడితే కావ్యను కంపెనీ సీఈవోను చేశాడు.
రాహుల్: అవును మమ్మీ నువ్వు చెప్పింది కూడా నిజమే. పేరుకే తాతయ్య ఔట్ డేటెడ్ అయ్యాడు. కానీ ఆలోచనల్లో మన కన్నా చాలా ముందే ఉన్నాడు.
అని రాహుల్ అనగానే ఏదో ఒకటి చేసి మళ్లీ ఆస్థులు పంచేలా చేయాలి. నీ వాటా నీకు వచ్చేలా చేయాలి అని రుద్రాణి అంటుంది. ఇంతలో స్వప్న వచ్చి రాహుల్, రుద్రాణిని తిడుతుంది. ఆస్థి పంచితే అది నీ మొగుడికే కదా వస్తుంది. నీకు వచ్చినట్టే కదా..? అని రుద్రాణి చెప్పగానే మీకు ఆస్థి పంచిస్తే మూడు రోజుల్లో ఖతం చేస్తారు. ఆ తర్వాత నేను అంతే అటుంది స్వప్న. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!